1000 కోట్లు బడ్జెట్ పెడితే, 100 కోట్లు కూడా రాలేదు, ప్రపంచంలోనే చెత్త సినిమా ఏదో తెలుసా?

Published : Aug 26, 2025, 04:30 PM IST

కొన్ని సినిమాలు ఊహించని సక్సెస్ సాధిస్తాయి, మరికొన్ని సినిమాలు రికార్డ్ స్థాయిలో సక్సెస్ అవుతాయి అనుకుంటే, దారుణంగా డిజాస్టర్స్ అవుతుంటాయి. ప్రపంచంలోనే పరమ చెత్త సినిమా రికార్డు సాధించిన మూవీ ఏదో మీకు తెలుసా?

PREV
15

భారీ డిజాస్టర్ మూవీ

సినిమా సక్సెస్ అవ్వాలంటే స్టార్ హీరోలు అవసరం లేదు, భారీ బడ్జెట్ కూడా అవసరం లేదు, కంటెంటె కరెక్ట్ గా ఉంటే చాలు సినిమా కనెక్ట్ అవ్వడానికి అని కొన్ని సినిమాలు నిరూపించాయి. ఈమధ్య కాలంలో వస్తోన్నబలగం, సయారా, సు ఫ్రమ్ సో లాంటి సినిమాలు 5 లేక 6 కోట్లతో రూపొంది. 100 కోట్లకు పైగా కలెక్షన్లు, జాతీయ అవార్డులు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఈక్రమంలో 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఓ భడా సినిమా మాత్రం తిప్పికొడితే వంద కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?

25

30 ఏళ్ల క్రితం భారీ బడ్జెట్ తో

సినిమా రంగంలో విజయాలు, పరాజయాలు సహజం. కొన్ని చిత్రాలు అంచనాలకు మించి విజయాలు సాధిస్తే, మరికొన్ని భారీ బడ్జెట్ తో నిర్మించి,భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ఫ్లాప్‌గా మిగులుతాయి. అలాంటి సినిమాలలో ప్రముఖంగా చెప్పుకునేమూవీ ఒకటి ఉంది. ప్రపంచ సినిమా చరిత్రలో ఓ చెత్ తసినిమా రికార్డును, స్పెషల్ స్థానాన్ని దక్కించుకున్న ఆ సినిమా ఏదో కాదు ‘కట్‌త్రోట్ ఐలాండ్ (Cutthroat Island)’.1995లో విడుదలైన ఈ హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ, ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లాప్ సినిమాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాను రూ.857 కోట్ల (సుమారుగా 98 మిలియన్ డాలర్లు) బడ్జెట్‌తో నిర్మించారు. కానీ విడుదల తరువాత ఇది బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.132 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

35

సాహసయాత్ర

రెన్నీ హార్లిన్ (Renny Harlin) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటి గీనా డేవిస్ (Geena Davis), మాథ్యూ మోడిన్ (Matthew Modine), ఫ్రాంక్ లాంగెల్లా (Frank Langella), మౌరీ చైకిన్ (Maury Chaykin) కీలక పాత్రల్లో నటించారు. మొత్తం 2 గంటల 4 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమా, ఒక మహిళా పైరేట్ (pirate) అండ్ ఆమె భాగస్వామి నిధి ద్వీపం కోసం చేసే యాత్రను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది.

45

దాదాపు 1000 కోట్ల బడ్జెట్

అత్యంత భారీ సెట్స్, గ్రాఫిక్స్, ప్రొడక్షన్ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా, 30 ఏళ్ల క్రితం రిలీజ్ టైమ్ లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కాని రిలీజ్ తరువాత ప్రేక్షకుల నుండి ఆశించిన స్పందన రాకపోవడంతో భారీ ఆర్థిక నష్టాలను చవిచూసింది. ఈ చిత్రం ఫలితంగా, దాన్ని నిర్మించిన ప్రొడక్షన్ కంపెనీ Carolco Pictures దివాళా తీసింది. ఆ సమయంలో హాలీవుడ్‌లో ఈ స్థాయి నష్టాలు కలిగిన మరో సినిమా లేనందున, 'కట్‌త్రోట్ ఐలాండ్'కి "బాక్సాఫీస్ డిజాస్టర్" అనే గుర్తింపు ఏర్పడింది.

55

ప్రపంచంలోనే చెత్త సినిమా రికార్డు

IMDb రేటింగ్ పరంగా చూస్తే ఈ సినిమాకు 5.7 రేటింగ్ ఉంది. చిత్రాన్ని ప్రస్తుతానికి యూట్యూబ్‌లో ఉచితంగా (Free) వీక్షించడానికి కూడా అందుబాటులో ఉంచారు.ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 30 సంవత్సరాలు అయినా కూడా, ప్రపంచంలోని ఇతర ప్లాప్ సినిమాలు ఈ రికార్డును అధిగమించలేకపోయాయి. ఇప్పటికీ కట్‌త్రోట్ ఐలాండ్ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ఖర్చుతో తీసి, అత్యంత తక్కువ వసూళ్లు చేసిన చిత్రం అనే స్థానం కలిగి ఉంది. దాంతో ప్రపంచంలోనే పరమ చెత్త సినిమాగా 'కట్‌త్రోట్ ఐలాండ్' ఘనతను సాధించింది.

Read more Photos on
click me!

Recommended Stories