ఎన్టీఆర్‌ ప్లాన్స్ అన్నీ తలక్రిందులు, ఆగిపోయిన మరో మూవీ.. `వార్‌ 2` ఎంత పనిచేసింది?

Published : Aug 26, 2025, 02:56 PM IST

ఎన్టీఆర్‌ నటించిన బాలీవుడ్‌ మూవీ `వార్‌ 2`డిజాస్టర్‌ దిశగా వెళ్తుంది. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌కి చాలా దూరంలో ఉంది. ఈక్రమంలో దీని ప్రభావం ఎన్టీఆర్‌ తదుపరి మూవీస్‌పై పడుతుంది. 

PREV
14
డిజాస్టర్‌ దిశగా `వార్‌ 2`

ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి `వార్‌ 2` చిత్రంలో నటించారు. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ నుంచి వచ్చిన స్పై యాక్షన్‌ మూవీ ఇది. ఇందులో హృతిక్‌ రోషన్‌ మరో హీరోగా నటించారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్‌ మూవీ ఇండిపెండెన్స్ డే (ఆగస్ట్ 14) సందర్భంగా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే మిశ్రమ స్పందన రాబట్టుకుంది. ఆ తర్వాత క్రమంలో డౌన్‌ అవుతూ వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు డిజాస్టర్‌ దిశగా వెళ్తోంది.

24
`వార్‌ 2` కలెక్షన్లు

`వార్‌ 2` మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. ఆ వీకెండ్‌ వరకు సత్తా చాటింది. కానీ ఆ తర్వాత డీలా పడింది. ఈ మూవీ ఇప్పుడు 12 రోజుల్లో ఇండియా వైడ్‌గా రూ.224కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మరో ఎనభై కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం. తెలుగులో రూ.52 కోట్లకుపైగానే రాబట్టింది. ఈ మూవీ ఓవర్సీస్‌లో సేఫ్‌గానే ఉన్నా, మిగిలిన చోట్ల డిజాస్టర్‌గా మారబోతుంది. `వార్‌ 2` బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే సుమారు ఏడువందల కోట్ల గ్రాస్‌ రావాలి. అది అసాధ్యం. దీంతో ఈ మూవీ పెద్ద ఫెయిల్యూర్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు.

34
ఆగిపోయిన యష్‌రాజ్‌ ఫిల్మ్స్ స్పై మూవీ ?

ఈ క్రమంలో ఈ మూవీ ప్రభావం ఇప్పుడు ఎన్టీఆర్‌ నటించబోయే తదుపరి సినిమాలపై పడుతుంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సిన `దేవర2`పై పడింది. ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం. అలాగే ఇప్పుడు మరో మూవీ కూడా ఆగిపోతుందట. `వార్‌ 2` హిట్‌ అయితే  ఎన్టీఆర్‌ హీరోగా మరో స్పై మూవీ(ఏజెంట్‌ విక్రమ్) చేయాలని యష్‌రాజ్‌ ఫిల్మ్స్ భావించింది. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. ఆ మధ్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కూడా తారక్‌ తెలిపారు. మళ్లీ మీతో పనిచేయడానికి ఆతృతగా ఉన్నాను అని చెప్పారు. ఎన్టీఆర్‌ సోలో హీరోగా  స్పై యాక్షన్‌ మూవీ `ఏజెంట్ విక్రమ్`ని తీయాలని యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ భావించింది. అయితే ఈ సినిమాని ఇప్పుడు ఆపేశారట.

44
ఎన్టీఆర్‌ చేయబోయే సినిమాలివే

ఇది తారక్‌ కి దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. నిజానికి ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో పాగా వేయాలని భావించారు. నార్త్ మార్కెట్‌లో స్థిరపడిపోవాలని భావించారు. ఈ మేరకు  చాలా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అన్నీ తలక్రిందులయ్యాయి.  ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. దీనికి `డ్రాగన్‌` అనే పేరు వినిపిస్తోంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories