Karthika Deepam: శౌర్య, హిమల కోసం వంటలక్క అన్వేషణ.. డాక్టర్ బాబు వచ్చేశాడోచ్!

First Published Aug 17, 2022, 8:24 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 17వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దీప,తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆ డాక్టర్ వాళ్ళ అమ్మగారు దీపకి కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళు ఎప్పటికైనా దొరుకుతారు అని భరోసా ఇస్తుంది. ఈ లోగా రామా పండు అని వాళ్ళ వంట మనుషుల్ని పిలుస్తుంది. వాళ్ళు వంట బాగా చేయట్లేదు అని దీపకి తెలిసి నేను వంట చేస్తాను అని వంట గదిలోకి వెళ్లి వంట చేస్తుంది. ఆ తర్వాత సీన్లో సౌర్య,వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎలాగైనా శౌర్యని వాళ్ళ నాన్నమ్మ ఇంటికి పంపించాలి అని అనుకుంటారు.
 

దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎంత చెప్పినా సౌర్య,అమ్మానాన్నలు చావుకు కారణమైన  హిమ ఉన్న ఇంట్లో నేను ఉండలేను అని అంటుంది. అప్పుడు వాళ్ళ పిన్ని నీకు నచ్చనిది హిమే కదా ఆ ఇల్లు కాదు కదా అక్కడ నానమ్మ, తాతయ్య ,పిన్ని బాబాయ్లు వాళ్ళందరూ నీకు ఇష్టమే కదా. ఇక్కడ మాతో ఉంటే తిండికి చదువుకి గతి లేకుండా ఉంటాది. అక్కడ అయితే మంచి చదువు చదువుకోవచ్చు అని ఆఖరికి సౌర్య ని ఒప్పిస్తారు. ఆ తర్వాత సీన్లో దీప ఇంట్లో వాళ్ళందరికీ వండి పెడుతుంది.
 

అక్కడ వాళ్ళు ఆ భోజనం తిని చాలా బాగుందమ్మా చాలా రోజుల తర్వాత ఇంత మంచి వంట తిన్నాను. మా అబ్బాయి నన్ను వంట గదిలో కూడా వెళ్ళనివ్వడు ఆ పొగకి ఎక్కడ నాకు దగ్గు వస్తుందేమో అని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒక్క పని కూడా చేయనివ్వడు అని అనగా దీపకీ కార్తీక్ తన కోసం చేసిన పనులన్నీ గుర్తొచ్చి బాధపడుతూ ఉంటుంది. ఈలోగా ఆ డాక్టర్ రేపు నువ్వు హైదరాబాద్ వెళుతున్నావు కదా అని అడుగుతారు. అవును అని దీప అనగా ఆ డాక్టర్ వల్ల అమ్మగారు ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు అని అంటుంది.
 

అప్పుడు దీప అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని ఇక్కడికి తెచ్చిన తర్వాత డాక్టర్ బాబుని వెతకాలి అని అంటుంది. అప్పుడు ఆ డాక్టర్ నువ్వు పిల్లలని తెచ్చేలోగా నా వైపు నుంచి నేను కూడా వెతికే ప్రయత్నం చేస్తాను అమ్మ అని అంటాడు. అప్పుడు  అక్కడున్న వంట మనుషులు మళ్ళీ ఎప్పుడు నీ భోజనం తింటానో ఇంకొంచెం వడ్డించమ్మా అని అంటారు. ఆ తర్వాత రోజు ఉదయం దీప హైదరాబాద్ బస్సు ఎక్కడానికి నడుస్తూ దారిలో, కళ్ళముందే ఇంత ప్రమాదం జరిగింది అని బాధపడుతూ ఉంటుంది.
 

అదే సమయంలో హైదరాబాద్ వెళ్లడానికి వాళ్ళ పిన్ని బాబాయ్తో పాటు శౌర్య వస్తుంది. దారిలో, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళమ్మా మేము అక్కడ ఏదో పని చూసుకుంటాము అని అనగా వద్దు మీరు ఇక్కడే ఉండి కష్టపడండి అక్కడికి రావాల్సిన అవసరం లేదు అని సౌర్య అంటుంది. ఈ లోగ దీప హైదరాబాద్ బస్సు ఎక్కుతుంది బస్సులో కూర్చుని చివరిగా కార్తీక్ అన్న మాటలు గుర్తుతెచ్చుకొని ఇదే నా చివరి రోజు అయినా బాగుండు అని అన్నారు అన్నంత పని అయింది అని బాధపడుతూ ఉంటుంది.
 

అదే సమయంలో శౌర్య వాళ్ళ పిన్ని బాబాయ్తో అదే బస్సు ఎక్కుతుంది.శౌర్య కూడా జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటుంది.కానీ దీప శౌర్య ఇద్దరికీ ఇద్దరు కనిపించరు ఆ తర్వాత సీన్లో సౌందర్య ఇంటిలో, హిమ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సౌందర్య దీప కార్తీక్ ల ఫోటోని తుడుస్తూ  దేవుడు నిన్ను త్వరగా తీసుకెళ్లిపోయాడు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దీప ఫోటో తుడుస్తూ డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ వాడి ప్రేమ కోసం తపించావు. ఆఖరికి వాడితో పాటు మా అందరిని వదిలేసి వెళ్ళిపోయావు అని అంటుంది. హిమ,సౌర్య ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!