డర్టీ పిక్చర్‌ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్, మరి విద్యాబాలన్ ఏంటి ఇలా అనేసింది...?

Published : Aug 17, 2022, 07:54 AM ISTUpdated : Aug 17, 2022, 07:55 AM IST

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సినిమా డర్టీ పిక్చర్.  సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఎంతలా హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే...? ఇక ఈ సినిమాకు సీక్వేల్ ప్లానింగ్ లో ఉన్నారట మేకర్. ఇక ఈ విషయంలో విద్యా బాలన్ ఏమన్నారు..? 

PREV
15
డర్టీ పిక్చర్‌ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్, మరి విద్యాబాలన్ ఏంటి ఇలా అనేసింది...?

బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా ఒక ఊపు ఊపిన సినిమా డర్టీ పిక్చర్. హీరోయిన్ గా  విద్యాబాలన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన  సినిమాల్లో ఈ డర్టీపిక్చర్‌ కూడా ఒకటి. దాదాపు  పదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈసినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. సంచలన విజయాన్ని సాధించిన ఈ మూవీ మన తెలుగు తార  సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా రూపొందించబడింది.  

25

ఈ సినిమాలో విద్యాబాలన్‌ నటనకు ఇండియన్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. తన అద్భుత నటనతో  విద్య ప్రేక్షకుల్ని మెప్పించింది. సిల్క్ స్మితాను తలుచుకుని చాలా మంది బాధపడ్డారు. ఈసినిమాతో ఆమె అందం వెనకున్న బాధలు.. కష్టాలు కన్నీళ్ళు అందరికి తెలిసొచ్చాయి. ఇక సూపర్ హిట్ అయిన ఈ సినిమా  ఆ రోజుల్లోనే 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 
 

35

ఇక తాజాగా ఈ సూపర్ హిట్ సినిమాకు  సీక్వెల్‌ను తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు దర్శకుడు మిలన్‌ లుత్రియా. అయితే ఈ సీక్వెల్‌లో విద్యాబాలన్‌  హీరోయిన్ గా నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. డర్టీ పిక్చర్ సినిమా అంటేనే వెంటనే అందరికి విద్యనే గుర్తకు వస్తుంది. మరి సీక్వెల్ లో .. విద్యానే నటిస్తుందా..లేక మరొకరిని ఎంపిక చేసుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది. 

45

అయితే ఈ విషయంలో స్పందించారు విద్యా బాలన్.  డర్టీపిక్చర్‌ సీక్వెల్‌ గురించి ఇంతవరకు తననెవరూ సంప్రదించలేదని, ఒకవేళ స్క్రిప్ట్‌ నచ్చితే  ఈ సినిమాలో నటించడానికి తనకు ఎటువంటి  అభ్యంతరం ఏమీ లేదని విద్యాబాలన్‌ తెలిపింది. డర్టీపిక్చర్ సీక్వెల్ విద్యా బాలన్ తో ఫిక్స్ అయితే సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. 

55

ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  స్క్రిప్ట్‌ రూపకల్పనలో దర్శకుడు మిలన్‌ లుత్రియా బిజీగా ఉన్నారని సమాచారం. ఇక  ఈ ఏడాది ఆఖరిలోగా సీక్వెల్‌ విషయంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే క్లారిటీ  వస్తుందని నిర్మాతలు ఏక్తాకపూర్‌, శోభా కపూర్‌ ఒ సందర్భంలో పేర్కొన్నారు.

click me!

Recommended Stories