అనసూయ చేతిలో చెయ్యేసి కాలేజ్‌ నాటి ప్రేమకథలు పంచుకున్న దర్శకేంద్రుడు.. పది కోట్లకి జబర్దస్త్ యాంకర్‌

Published : Aug 16, 2022, 11:48 PM IST

హాట్‌ ఫోటో షూట్లతో, టీవీ షోస్‌లతో రచ్చ చేసే అనసూయ ఇప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కంట్లో పడింది. దీంతో ఆమెని మరో లెవల్‌కి తీసుకెళ్తున్నారు. తాజాగా వీరి మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు రచ్చ లేపుతున్నాయి.   

PREV
18
అనసూయ చేతిలో చెయ్యేసి కాలేజ్‌ నాటి ప్రేమకథలు పంచుకున్న దర్శకేంద్రుడు.. పది కోట్లకి జబర్దస్త్ యాంకర్‌

సెక్సీ యాంకర్‌ అనసూయ(Anasuya).. ఇప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(K Raghavendra Rao)కి జోడయ్యింది. ఈ ఇద్దరు కలిసి ఓ షోలో సందడి చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. అయితే ఇద్దరు ఒకరి చేతిలో మరొకరు చేయ్యేసుకుని రావడం పెద్ద రచ్చ లేపుతుంది. సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ టాపిక్‌ గా మారుతుంది. రాఘవేంద్రరావు తన గతం తాలుకూ లవ్‌ స్టోరీ చెప్పడం మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తుంది.
 

28

హాట్‌ యాంకర్‌ అనసూయ జోరు నడుస్తుంది. ఓ వైపు `జబర్దస్త్`(Jabardasth)ని వీడటం, మరోవైపు కొత్త షోలతో దూసుకుపోవడం, మరోవైపు సినిమాలతో బిజీగా ఉండటంతో తరచూ హాట్‌ టాపిక్‌గా మారుతుంది. మరోవైపు ప్రస్తుతం అనసూయ నటించిన `వాంటెడ్‌ పండుగాడ్‌`(Wanted Pandugod) చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదలవుతుంది. 
 

38

సినిమా ప్రమోషన్‌లో చిత్ర బృందం జోరు మీదుంది. అందులో భాగంగా `వాంటెడ్‌ పండుగాడ్‌` టీమ్‌ `క్యాష్‌`(Cash Promo) ప్రోగ్రామ్‌లో సందడి చేసింది. అనసూయ, రాఘవేంద్రరావు, విష్ణుప్రియా, యశ్వంత్‌ మాస్టర్‌, నిత్య శెట్టి పాల్గొని హంగామా చేశారు. కామెడీతో నవ్వులు పూయించారు. విష్ణు ప్రియ(Vishnu Priya) చేసిన పెళ్లి కామెంట్లు ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు హైలైట్‌ అయ్యాయి. 

48

ఈ సందర్భంగా అనసూయ, రాఘవేంద్రరావు, యాంకర్‌ సుమల మధ్య చోటు చేసుకున్న వచ్చే సన్నివేశాలు మరింత స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అయ్యాయి. ఇందులో షో లోకి అనసూయ, రాఘవేంద్రరావు కలిసి ఎంట్రీ ఇవ్వడం విశేషం. అనసూయ, రాఘవేంద్రరావులు కలిసి చేతిలో చెయ్యేసుకుని, ఒకరినొకరు పట్టుకుని షోలోకి అడుగుపెట్టారు. అది అందరి చేతి వాహ్‌ అనిఇంచింది. అయితే ఈ ఇద్దరు కలిసి రావడం వెనకాలున్న సీక్రెట్‌ని రివీల్‌ చేశారు దర్శకేంద్రుడు. 
 

58

తాను చిన్నప్పుడు చదువుకునే కాలేజ్‌ రోజుల విషయాలను గుర్తు చేసుకున్నారు. కాలేజ్‌లో అనసూయ అనే అమ్మాయి ఉండేదని తెలిపారు దర్శకుడు. ఆమెపై తనకున్న ప్రేమని మనసులోనే దాచుకున్న రాఘవేంద్రరావు ఆమెని మిస్‌ అయ్యాడట. ఇప్పటికీ ఈ అనసూయ దొరికిందని, కనీసం ఫ్లాష్‌ బ్యాక్‌లోకైనా వెళ్దామని ఈ అనసూయతో ఇలా పట్టుకుని వచ్చినట్టు తెలిపారు రాఘవేంద్రరావు. దీంతో షోలో కామెడీ పండింది.

68

దీనికి యాంకర్‌ సుమ(Anchor Suma) స్పందించి పంచ్‌ డైలాగ్‌ వేసింది. అప్పట్లో సుమ పేరుతో ఎవరూ లేరు కదా అని అనగా, నీ పెళ్లి చేసింది నీనే కదా అంటూ రాఘవేంద్రరావు చెప్పాడు. దీనికి సుమ వెంటనే రియాక్ట్ అవుతూ `ఆ పాపం మాత్రం మీదే సర్‌` అంటూ పంచ్‌ వేసింది. దీంతో షోలో నవ్వులు పూశాయి. 
 

78

అనంతరం రాఘవేంద్రరావు రియాక్ట్ అవుతూ, ఈ సారి షోలో కనీసం పదికోట్లైనా గెలుచుకుని వెళ్లాలనని చెబుతాడు. అందుకు సుమ చెబుతూ, పది కోట్లకైతే అనసూయని తీసుకెళ్లు అంటుంది. వంద కోట్లకైతే నన్ను తీసుకెళ్లు అని చెబుతుంది. `అలా అయితే నాకు నువ్వే కావాలి` అని రాఘవేంద్రరావు చెప్పడంతో సుమకి ఫ్యూజులెగిరిపోయాయి.
 

88

అనంతరం అనసూయ, సుమ కలిసి ఓ డ్యూయెట్‌ పాడుకున్నారు. నవమన్మథుడా.. అతి సుందరుడా.. అంటూ పాటేసుకున్నారు. సుమ అమ్మాయిగా, అనసూయ అబ్బాయిగా చేశారు. ఇది చూసిన రాఘవేంద్రరావు `ఎవరే ఆ అబ్బాయి` అని అంటే నన్ను చూపించండే అంటూ పంచ్‌ వేయడంతో షో హోరెత్తిపోయింది. ఆద్యంతం నవ్వులు పూయించింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories