Karthika Deepam: గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్న కార్తీక్.. డాక్టర్ బాబు ముందు మోనితని ఇరికించేసిన దుర్గ!

First Published Oct 4, 2022, 8:26 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 4వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..మోనిత,కార్తీక్ దగ్గరకు వస్తుంది.కార్తీక్, బాబుని పడుకోబెడుతూ ఉంటాడు. అప్పుడు మోనిత మనసులో, ఇప్పుడు కార్తీక్ కి  నా మీద అనుమానం వచ్చినట్టు ఉంది.ఇప్పుడు అది అబద్ధం అని చెప్తే ఎందుకు సైలెంట్ గా ఉన్నాను అని అడుగుతాడు. దానికి నేను ఏం సమాధానం చెప్పాలి.ఒకవేళ మౌనంగా ఉంటే ఇప్పుడు వరకు జరిగిందంతా నిజమే అని నమ్ముతాడు. ఏదో ఒకటి చేసి వెళ్లి సద్ది చెప్పాలి అని కార్తీక్ దగ్గరికి వెళ్తుంది మోనిత. వెళ్ళిన తర్వాత కార్తీక్ తో, కార్తీక్ నువ్వు అనుకున్నది ఇక్కడ జరగడం లేదు నీకు నామీద నమ్మకం ఉంది కదా అని అనగా, దేని గురించి మాట్లాడుతున్నావు అని కార్తీక్ అడుగుతాడు. దుర్గ విషయంలో కార్తీక్ అని అంటుంది మోనిత. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజం తడుక్కున్నట్టు నేను నిన్ను ఏమీ అడగకుండానే ఎందుకు అలా అవుతున్నావు అని అంటాడు కార్తీక్. 

ఇంతలో పక్కనుంచి దీపా ఇదంతా చూసి డాక్టర్ బాబు కి మోనిత మీద అనుమానం వచ్చింది అని అనుకుంటుంది. అదే సమయంలో మోనిత, అతనికి నాకు ఏం సంబంధం లేదు కార్తీక్ అని అంటుంది  అప్పుడు కార్తీక్ గతంలో ఎవరో ఈ మాట అన్నట్టు గుర్తొచ్చి, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను కారణం కాదు అని లెగిసి అరుస్తాడు. దానికి దీప, మోనిత ఆశ్చర్యపోతారు.కార్తీక్ కి తల నొప్పెడుతూ గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించుగా దీప పక్కన ఉన్న స్టాండ్ ని కిందపడేసి కార్తీక్ ని ఆ మాయ నుంచి బయటకు తీసుకొని వస్తుంది. అప్పుడు మోనిత కార్తీక్ తో, ఏం అవలేదు కార్తీక్ కొంచెం వెళ్లి రెస్ట్ తీసుకో తగ్గిపోతుంది అని గదిలోకి పంపిస్తుంది. గదిలోకి పంపించిన తర్వాత మోనిత, గతంలో కార్తీక్, మోనితో కడుపులో పెరుగుతున్న బిడ్డకు తను కారణం కాదు అన్న మాట కోర్టులో చెప్పినప్పుడు ఆ సంఘటనను గుర్తుతెచ్చుకుంటుంది. కార్తిక్ కి గతం గుర్తొస్తుందా ఏం జరుగుతుంది అని భయపడుతూ ఉంటుంది. ఇంతలో దీపా ఇంటికి వస్తుంది.
 

అప్పుడు దుర్గా, మన ప్రభావం మోనిత మీద ఎలా పడింది దీపమ్మ అని అనగా,దాని మీద కాదు కానీ డాక్టర్ బాబు మీద పడుతున్నట్టున్నాది దుర్గ ఆయనకి  గతం గుర్తొస్తుంది అని అనగా,మరి ఏం చేసావు అని అడుగుతాడు దుర్గ. నేను అప్పుడు పక్కన ఉన్న స్టాండ్ నీ కింద పడేసా.అప్పుడు ఆయన మాయ లో నుంచి బయటకు వచ్చారు అని దీపా అనగా, అలా ఎందుకు చేసావు దీపమ్మ మనం సార్ కి గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే ప్రమాదం కానీ, తనంతట తానే గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఆ గతం గుర్తొచ్చే అవకాశం ఉంటుంది ఏమో కదా అని అంటాడు దుర్గ. అప్పుడు దీప, నాకిప్పుడు రిస్క్ తీసుకోవాలని లేదు దుర్గ. మన ప్లాన్ ప్రకారమే మోనితని భయపెట్టి తన చేతే,కార్తీక్ తన భర్త కాదు అని చెప్పిద్దాము,నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అది దుర్గ కి చెప్తుంది దీప.అప్పుడు దుర్గ, ఇలా చేసి కార్తీక్ సర్ చేత మోనితని చంప దెబ్బ కొట్టిందా అని అంటాడు. అదే సమయంలో కార్తిక్ మోనితని కొడతాడు. 

అసలు ఏం చేస్తున్నావు? నా భార్యని ఇన్ని రోజులు పరాయి  దానిలా చూసి,నువ్వు నా భార్య లా నన్ను మోసం చేస్తావా? నాకు గతం మర్చిపోయేలా చేసిందే కాక నా భార్యని పరాయిదాన్ని చేసేస్తావా? అసలు చనిపోయిన మనిషి తిరిగి బ్రతికున్నాడని తెలిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఆనందపడతారో తెలుసా! నా పిల్లలకు, తల్లిదండ్రులకు నన్ను కాకుండా నీ ఒక్కద్దాన్ని స్వార్థం చూసుకున్నావు. ఇలాంటి దాన్ని చంపేయాలి అని చెప్పి కార్తీక్ మోనిత పీక పట్టుకుంటాడు. అప్పుడు మోనత ఉలికిపడి కళ్ళు తెరుస్తుంది వద్దు అని గట్టిగా అరుస్తుంది. ఇదంతా కళ అని అనుకుంటుంది మోనిత. ఇంతలో కార్తీక వచ్చి ఏమైంది అని అడగగా ఏమీ లేదు కార్తీక్ అని అంటుంది. అప్పుడు కార్తీక్, నువ్వు నిజంగా నా దగ్గర అని నిజాలు చెప్తున్నావా అని నీ మనస్సాక్షిని అడుక్కొ అని  చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు దీప తులసి చెట్టుకి పూజ చేస్తూ,ఈరోజు నేను ఒక కార్యం అనుకున్నాను దాన్ని ఎంతో ధైర్యంగా చేస్తున్నాను అది జరగాలని దీవించండి అని అంటుంది.

అదే సమయంలో దుర్గ అక్కడికి వచ్చి, దీపమ్మ నేను చెప్పినవన్నీ తెచ్చేసాను. మన ప్లాన్ కి ఈరోజు ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుంది అని అంటాడు. అప్పుడు దీప, నేను వెళ్లి అమ్మ, అన్నయ్యలను కూడా తీసుకువస్తాను ఈరోజు మన ప్రయత్నం ఫలించాలి అని అంటుంది. ఇంతలో దుర్గ, నేను వెళ్ళి మోనితకు జలక్ ఇచ్చి వస్తాను అని అనగా, ఒద్దు దుర్గ నువ్వు అక్కడికి వెళ్తే,తనకి మన ప్లాన్ గురించి ఏమాత్రం అనుమానం వచ్చినా మన ప్లాన్ పాడైపోతుంది అని అనగా, మన గురించి ఏమీ భయటపడనివ్వనమ్మ.అది ప్రతి క్షణం భయపడాలి. ఇంకో ప్లాన్ గురించి ఆలోచించే సమయం దానికి ఇవ్వకూడదు అని చెప్తాడు.
 

అదే సమయంలో కార్తీక్ హాల్లో ఉంటుండగా మోనిత కార్తీక్ దగ్గరకు వస్తుంది.అప్పటికే కార్తీక్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. కార్తీక్ ని ఆలోచింప చేయకుండా ఏవైనా కట్టుకథలు చెప్పి కార్తిక్ మనసు మళ్లించాలి అని అనుకోని, వర్షం పడుతున్నప్పుడు కార్తీక్ కి వెళ్లి పకోడీ ఇస్తుంది. అప్పుడు మోనిత,గుర్తుందా కార్తీక్ మనం మన పాత ఊర్లో ఉన్నప్పుడు వర్షం పడిన వెంటనే నువ్వు నన్ను సైకిల్ మీద వేసుకొని పకోడీ కొట్టుకు తీసుకెళ్లే వాడివి అని అనగా, కార్తీక్ కి గతంలో తను ఒక్కడే సైకిల్ ఎక్కి ఎక్కడికో వెళ్తున్న సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు మోనిత, అయినా తీపి సంఘటన చాలా మధురాది మధురమైనవి నీకు గుర్తుండవులే అని అనగా, నాకు గుర్తొస్తుంది.
 

కానీ నువ్వు ఆ సంఘటనలలో లేవు. ఇప్పటివరకు నువ్వు చెప్తున్న దానికి నాకు గుర్తొస్తున్న వాటికి ఎటువంటి సింక్ లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్.ఇంతలో దుర్గ అక్కడికి వచ్చి పకోడీని చూస్తాడు. ఏంటి మోనిత వర్షంలో పకోడీ తినడం నాకు ఇష్టమని ఫోన్ చేసి పిలిచావు. పది నిమిషాల్లో లేటవుతుంది అన్న వెంటనే కార్తీక్ సార్ కి పెట్టేసావా అని అనగా,కార్తీక్ ఆశ్చర్యపోతాడు.అప్పుడు మోనిత, నేనెప్పుడు నీకు ఫోన్ చేశాను పిచ్చిపిచ్చిగా ఉందా అని అంటుంది.అప్పుడు దుర్గా తన ఫోన్ చూపించి ఇదిగోండి అరగంట ముందే ఫోన్ కాల్ ఉంది అని చెప్తాడు.

 దుర్గ ఒక అరగంట ముందు మోనిత లేనప్పుడు తన ఫోన్ నుంచి దుర్గే ఫోన్ చేస్తాడు. ఇప్పుడు ఆ ఫోన్ కాల్ ని చూసినా కార్తీక్, ఈ ఫోన్ నెంబర్ నీదే కదా నీ ఫోన్ నుంచి నువ్వు కాకుండా ఎవరు చేస్తారు అని అంటాడు. నేను నిజమే చెప్తున్నాను కార్తీక్ అని మోనిత అనగా, కార్తీక్ సార్ కి  మన గురించి తెలుసులే మోనిత భయపడాల్సిందేమీ లేదు అని దుర్గ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!