Janaki kalaganaledu: జానకి చదువు పట్ల జ్ఞానాంబ నిర్ణయం మారనుందా?

First Published Aug 5, 2022, 2:52 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 5వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకి,ఆ పుస్తకాలు నా చదువుకు ఎలాగా ఉపయోగపడవు. స్వీట్ షాప్ లో పొట్లాలు కట్టడానికైన పనికొస్తాయి. ఇంక నా చదువు గురించి మనం వదిలేద్దాం ప్లీజ్ అని రామాని వేడుకుంటుంది. రామా ఆపడానికి ప్రయత్నించినా జానకి, ఇంక వదిలేద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ ఒక చాటు నుంచి జ్ఞానాంబ వింటుంది.
 

జ్ఞానాంబ కూర్చుని ఇందాక జానకి మాట్లాడిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రామా అక్కడికి వచ్చి, జానకి పుస్తకాలు జ్ఞానాంబికి ఇచ్చి జానకి గారు ఇంక ఐపీఎస్ చదువుని వదిలేస్తా అన్నారు. ఇంక నా గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. నిశ్చింతగా ఉండొచ్చు అని ఆ పుస్తకాలను అక్కడ పెట్టి జానకి గారు ఐపీఎస్ అయితే చాలామందికి మంచి చేస్తారమ్మా , కానీ ఆ దేవుడు జానకి గారు కలని కలగానే ఉంచేసారు అని బాధపడుతూ ఉంటాడు.
 

నువ్వు చదువుకి వ్యతిరేకం కాదని నాకు తెలుసు. చాలామంది చదువుకోడానికి నువ్వు డబ్బు సహాయం చేస్తున్నావని నాకు తెలుసు. కానీ ఎక్కడ మావయ్య లాంటి పరిస్థితి నాకు వస్తుందో అని నువ్వు బాధపడుతున్నావ్. నా మీద ప్రేమతో జానకి గారి ఐపీఎస్ కలను ఆపడం న్యాయమా? అప్పుడు రామ వాళ్ళ నాన్న, నా ఆరోగ్యం బాగోలేని సమయంలో రామా తన చదువుని ఆపేసి నాకు సహాయం చేశాడు. నావల్ల రామ చదివు ఆగిపోయింది.
 

ఇదే స్థానంలో వెన్నెల ఉంటే నువ్వు ఇలాగే చేయగలవా? అని అడుగుతాడు.  అప్పుడు రామ ఆ పుస్తకాలని అక్కడ నుంచి తీసి, ఈ పుస్తకంలో అక్షరాలు జానకి గారి కల నిజం చేయడానికి ఉపయోగపడతాయి అనుకున్నాను.కానీ మన కొట్టులో పొట్లాలు కట్టడానికి పనికొస్తాయని అనుకోలేదు అమ్మ అని చెప్పి ఆ పుస్తకాలను అక్కడి నుంచి తీసేసాడు. ఈ లోగ మళ్ళీక, మనసులో మీరందరూ ఒప్పిస్తే కరిగిపోయి జానకిని చదువుకోమంటారు అనుకుంటున్నారేమో.
 

అది జరగని పని. అని సంబరపడిపోతూ ఉంటుంది. ఈలోగా రామ ఆ పుస్తకాలను పట్టుకుని గడప దాటుతూ ఉండగా  జ్ఞానాంబ రామని ఆపి, లోపలికి రమ్మని చెప్పి, ఇప్పుడు ఇల్లు ఇంత అన్యోన్యంగా ఉన్నది అంటే దానికి కారణం ఇంటి కోసం చదువుని వదిలేసిన నా పెద్దకొడుకే. కానీ ఈరోజు, నా భార్య బాధపడుతుంటే నేను జీవితాంతం ఆనందంగా ఎలా ఉండగలను? అని అన్నావు.చిన్నప్పుడు నీ చదువుని వదిలినప్పుడు కూడా నువ్వు ఇంత బాధపడలేదు.
 

అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జానకినీ చదివించడానికి నేను అంగీకరిస్తున్నాను అని అంటుంది జ్ఞానాంబ. అందరూ ఆనందపడతారు. ఈ లోగ జ్ఞానంబా నాకు కొన్ని షరతులు ఉన్నాయి. నువ్వు ఎప్పుడూ, చదువుకున్నాను అని అహంకారం చూపించకూడదు. ఇంట్లో అందరికీ మార్గదర్శిగా ఉండాలి. నీ చదువు వల్ల ఇంటి మర్యాదలకు భంగం కలగకూడదు.అని షరతులు పెడుతుంది .ఈ షరతులన్నీ ఒప్పుకుంటేనే నిన్ను చదివిస్తాను అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!