Bimbisara: 'బింబిసార'పై ఎన్టీఆర్ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ కి థ్రిల్ అయిన తారక్

First Published Aug 5, 2022, 2:05 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార'. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఫాంటసీ ఎలిమెంట్స్, టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. 

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార'. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఫాంటసీ ఎలిమెంట్స్, టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. 

తొలి షో నుంచే బింబిసార చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ మొదలయింది. దీనితో కళ్యాణ్ రామ్ చాలా రోజల తర్వాత హిట్ కొట్టబోతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో 40 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. 

బింబిసార చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ చిత్రం మొదటి నుంచి అన్నకు అవసరమైనప్పుడు సాయం అందిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రిలీజ్ కి ముందే ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని వీక్షించాడు. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 

'బింబిసార చిత్రం గురించి గొప్పగా పాజిటివ్ రిపోర్ట్స్ వింటున్నా. నేను తొలిసారి ఈ చిత్రాన్ని చూసినప్పుడు ఎంత ఉత్సాహంగా చూశానో.. ప్రేక్షకులు కూడా అంతే ఉత్సాహం చూపిస్తుండడం సంతోషంగా ఉంది. కింగ్ బింబిసారగా కళ్యాణ్ రామ్ అన్నని తప్ప మరొకరిని ఊహించుకోలేం. దర్శకుడు వశిష్ట్ ఈ చిత్రాన్ని డీల్ చేసిన విధానం అద్భుతం. 

కీరవాణి గారి సంగీతం ఈ చిత్రానికి బ్యాక్ బోన్. అందరు టెక్నీషియన్స్, నటులకు అభినందనలు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. బింబిసార చిత్రానికి ముందు నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతూ వచ్చింది. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరు కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. మొత్తంగా కళ్యాణ్ రామ్ బింబిసార పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి నెలకొంది. పటాస్ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం కళ్యాణ్ రామ్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 

click me!