Vijay Devarakonda :విజయ్ దేవరకొండ కెరీర్‌లో సంచలన విజయాలతో పాటు, భారీ అంచనాల నడుమ ప్రారంభమై అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్ట్‌లు కూడా కొన్ని ఉన్నాయి. ఆ రెండు సినిమాలు ఏంటి? ఎందుకు ఆగిపోయాయి. ఆ సినిమాలు చేసుంటే విజయ్ లైఫ్ ఎలా ఉంండేది?
సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. నిజానికి అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల తరువాత ఆ రేంజ్ సక్సెస్ ను విజయ్ దేవరకొండ సాధించలేకపోయాడు. ఆతరువాత వచ్చిన సినిమాలన్నింటిలో కొన్నియావరేజ్ కాగా.. ఎక్కవ శాతం డిజాస్టర్స్ ను విజయ్ ఫేస్ చేశాడు. కానీ విజయ్ దేవరకొండ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే ఆయన కెరీర్ లో రెండు పెద్ద సినిమాలను మిస్ అయ్యాడు. ఆసినిమాలు చేసి ఉంటే విజయ్ లైఫ్ వేరేలా ఉండేది అని అభిమానులు నమ్మకం అందులో మొదటిది 2019లో ప్రకటించిన 'హీరో', మరొకటి రౌడీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'జనగణమన' (JGM).
25
ఆరు కోట్ల ఖర్చు ఆగిపోయిన 'హీరో'
2019లో 'డియర్ కామ్రేడ్' విడుదల తర్వాత, విజయ్ దేవరకొండ - మాళవిక మోహనన్ జంటగా 'హీరో' అనే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రకటించారు. కొత్త దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. బైక్ రేసింగ్ నేపథ్యంతో కూడిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే రెండో హీరోయిన్ గా కూడా సెలక్ట్ అయ్యింది. అప్పట్లోనే ఈ సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. కానీ ఈసినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయింది.
35
విజయ్ దేవరకొండ హీరో ఆగిపోడానికి కారణాలు..
విజయ్ దేవరకొండ - మాళవిక మోహనన్ జంటగా మొదలైన హీరో సినిమా స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది. అయితే 50 కోట్ల బడ్జెట్ అనుకున్న ఈసినిమా మొదలి షెడ్యూల్ కే దాదాపు రూ. 6 కోట్లు ఖర్చు అయ్యాయి. వచ్చిన అవుట్‌పుట్‌తో నటుడు విజయ్ దేవరకొండ తో పాటు అటు నిర్మాతలు సంతృప్తి చెందలేదు. అనంతరం స్క్రిప్ట్‌లో మార్పులు చేసినప్పటికీ, ఆ వెర్షన్‌పై కూడా విజయ్‌కి పూర్తి నమ్మకం కుదరలేదు. దర్శకుడిని మార్చి సినిమాను కొనసాగించాలని నిర్మాతలు భావించినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో మొదటి షెడ్యూల్‌తోనే ఈ సినిమా పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. ఆ తరువాత ఈ మూవీని మళ్లీ స్టార్ట్ చేసే ధైర్యం కూడా చేయలేదు నిర్మాతలు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా.. భారీ అంచనాల మధ్య 'లైగర్' సినిమా రిలీజ్ అయ్యింది. ఈమూవీతో విజయ్ ఎక్కడికో వెళ్లిపోతాడు అనుకుంటే.. భారీ డిజాస్టర్ గా ఈమూవీ మిగిలిపోయింది. అయితే లైగర్ రూపకల్పన సమయంలోనే 'జనగణమన' (JGM) అనే పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను పూరీ ప్రకటించారు. గతంలో ఈసినిమాను మహేష్ బాబుతో చేయాలని పూరీ ప్రయత్నించాడు. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రచారంలోకి వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. ఇక షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలి అనుకున్నారు.
55
ఈసారైనా సక్సెస్ వస్తుందా?
ముంబైలో హెలికాప్టర్ ల్యాండింగ్‌తో వినూత్నంగా, ఆర్మర్డ్ ఆర్మీ లుక్‌లో విజయ్ దేవరకొండను పరిచయం చేస్తూ పూరీ జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దేశభక్తి తో కూడిన సైనిక ఆపరేషన్ నేపథ్యంతో రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్-పూరీ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం 'లైగర్' (2022) బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా పరాజయం పాలైంది. లైగర్ ప్లాప్ ప్రభావంతో 'జనగణమన' బడ్జెట్, మార్కెట్ లెక్కలు మారాయి.
అంత భారీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక, నిర్మాతలు తో పాటు హీరో విజయ్ పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. 'హీరో', 'జనగణమన' సినిమాలలో ఏసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. విజయ్ ఇండస్ట్రీని ఏలేవాడు అని అనుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం విజయ్ రణబాలి సినిమాతో సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. మరి ఈ మూవీ అయినా అతనికి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.