Maa Inti Bangaram Collections: మా ఇంటి బంగారం ఫైనల్‌ కలెక్షన్లు, ఇంకా ఆ మార్క్‌ దాటలేదా? సమంత పంటపండింది

Published : Jul 22, 2026, 09:29 AM IST

సమంత మూడేళ్ల తర్వాత `మా ఇంటి బంగారం`తో సాలిడ్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ని అందుకుంది. మరి ఈ చిత్రానికి టోటల్‌గా ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే. 

PREV
15
మా ఇంటి బంగారంతో సమంత సాలిడ్‌ కమ్‌ బ్యాక్‌

సమంత మూడేళ్ల గ్యాప్‌తో వచ్చింది బాక్సాఫీసుని షేక్‌ చేసింది. ఆమె లేటెస్ట్ గా `మా ఇంటి బంగారం` మూవీతో కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీకి సమంత, ఆమె భర్త రాజ్‌ నిడిమోరు నిర్మాతలు. రాజ్‌ నిడిమోరు కథ, స్క్రీన్‌ ప్లే అందించారు. దగ్గరుండి సినిమాని తీశారు. దీంతో సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. వంద కోట్లకు చేరింది. మరి ఈ మూవీ విడుదలై 32 రోజులు అవుతుంది. ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తోంది. అయినా ఇంకా థియేటర్లో ఆడుతుంది.

25
లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో మా ఇంటి బంగారం సంచలనం

`మా ఇంటి బంగారం` మూవీ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ. ఇందులో సమంత ప్రధాన పాత్ర పోషించారు. ఆమె నటన, యాక్షన్‌, కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ని చేశారు. తెలుగులో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిపారు. ఈ మూవీ అనుష్క, కీర్తిసురేష్‌ పేరుతో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. మొత్తంగా సమంత కమ్‌ బ్యాక్‌ ఇస్తూ సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు.

35
మా ఇంటి బంగారం మూవీ ఫైనల్‌ కలెక్షన్లు

ఇదిలా ఉంటే `మా ఇంటి బంగారం` ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది. 32 రోజుల కలెక్షన్లు ఎంత? ఈ సినిమా ద్వారా సమంత ఎంత లాభపడిందనేది చూస్తే, సమంత పంటపండిందని చెప్పొచ్చు. ఈ మూవీ ఇప్పటి వరకు రూ.99.51కోట్లు కలెక్ట్ చేసింది. సాక్నిల్క్ లెక్కల ప్రకారం ఇది ఇంకా వంద కోట్లు దాటలేదు. అయితే వారం రోజుల క్రితమే టీమ్‌ వంద కోట్లు దాటినట్టు ప్రకటించింది. సమంత కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సమంత మాత్రం నిజాయితీగానే ఉందట. రియల్‌గా ఎంత కలెక్షన్లు వస్తే, అంతే వేయాలని, ఫేక్‌ వసూళ్లు వేయోద్దని స్టిక్ట్ గా చెప్పిందట. అందుకే టీమ్‌ రియల్‌ కలెక్షన్లనే వేసినట్టు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీ ఇప్పటికే వంద కోట్లు దాటింది. అలా ఇది రూ.100కోట్లకుపైగా చేసిందని చెప్పొచ్చు. కానీ ట్రేడ్‌ సైట్లు మాత్రం ఇది ఇంకా వంద కోట్లను టచ్‌ చేయలేదని చెప్పడం గమనార్హం.

45
రిలీజ్‌కి ముందే లాభాల్లో సమంత

ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లో రన్‌ అవుతుంది. రోజుకి మూడు నాలుగు లక్షల కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఈ మూవీ ఇండియాలో రూ.71.71 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రూ.61.96కోట్ల నెట్‌ ని సాధించింది. ఓవర్సీస్‌లో రూ.27.80కోట్లు రాబట్టడం విశేషం. ఈ సినిమా ద్వారా సమంత ఎంత లాభపడిందనేది చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతారు. సినిమాకి అయిన బడ్జెట్‌ సుమారు ముప్పై కోట్ల అని సమాచారం. దీనికి నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్ రూపంలోనే రూ.35కోట్లు వచ్చాయి. అంటే రిలీజ్‌కి ముందే ఈ సినిమా ప్రాఫిట్‌లో ఉంది.

55
మా ఇంటి బంగారం లాభాలు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌

దీనికితోడు ఇప్పుడు థియేట్రికల్‌గా వచ్చింది మొత్తం ఆమె లాభమే. ఈ సినిమాని చాలా వరకు సొంతంగా రిలీజ్‌ చేశారు. రిలీజ్‌ చేసిన వాళ్లు కేవలం మినిమమ్‌ ఖర్చులు తీసుకొని మిగిలినది మొత్తం నిర్మాతలకే ఇస్తారు. అంటే థియేట్రికల్‌ ఖర్చులు, జీఎస్టీ, ఇతర ఖర్చులు పోయినా ఈ మూవీ సుమారు రూ.50కోట్ల షేర్‌ సాధించిందని చెప్పొచ్చు. ఈ మొత్తం సమంత అకౌంట్లోకి వస్తాయి. అంటే ఈ సినిమా ద్వారా సమంత ఏకంగా రూ.50-60కోట్ల వరకు లాభపడిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఇంతటి ప్రాఫిట్‌ పొందిన మూవీ `మా ఇంటి బంగారం` మాత్రమే కావడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అందులోనూ టాప్‌లో ట్రెండ్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories