నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంతో పాటు కొరటాల మూవీ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజే న్యూస్ వైరల్ గా మారింది.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. దీనితో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యకి చిన్నపాటి సర్జరీ అవసరం అని వైద్యులు తెలిపారు.
25
కొరటాల శివ, బాలకృష్ణ మూవీ
ఇదిలా ఉండగా మరోవైపు బాలకృష్ణ, కొరటాల శివ మూవీ కూడా లాంచ్ అయింది. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాలపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కొరటాల దేవర చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అయింది కానీ కంటెంట్ పై మళ్ళీ కొరటాలకు విమర్శలు తప్పలేదు. దేవరకి సీక్వెల్ గా రావాల్సిన దేవర 2 పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ చిత్రం ఇక లేనట్లే అనే ప్రచారం కూడా సాగుతోంది.
35
బాలయ్యకి లేడీ విలన్
ఈ తరుణంలో బాలకృష్ణతో మూవీని కొరటాల శివ ప్రారంభించారు. వీరిద్దరి కాంబోలో మూవీ ఇదే తొలిసారి. తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రంలో లేడీ విలన్ ఉండబోతోందట. దీనిపై జోరుగా ప్రచారం సాగుతోంది. విలన్ పాత్ర కోసం కొరటాల శివ ఓ క్రేజీ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఐశ్వర్య రాజేష్.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత ఐశ్వర్య రాజేష్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ తో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం అంతటి ఘనవిజయం సాధించింది అంటే ఐశ్వర్యరాజేష్ పాత్ర ఎంతైనా ఉంది. ఫన్ రోల్ లో ఐశ్వర్యరాజేష్ అదరగొట్టేసింది.
55
ఈ సారి కొరటాల ఏం చేస్తారో ?
ఫన్ మాత్రమే కాదు ఎమోషనల్ సీన్స్ లో కూడా నటించగలగడం ఐశ్వర్యరాజేష్ కి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి హీరోయిన్ ని విలన్ గా చూపించాలని కొరటాల శివ భావిస్తున్నారు. ఇదేదో పెద్ద ప్లాన్ లాగే ఉందని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. ఆచార్య, దేవర లాగా కంటెంట్ పై విమర్శలు లేకుండా బాలయ్య చిత్రం క్లీన్ హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.