uday kiran
Uday Kiran : ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెండు మూడేళ్లలోనే టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. క్రేజీ స్టార్‌గా ఎదిగాడు. చాలా మంది వారసత్వంగా వచ్చిన హీరోలకు సైతం వణుకు పుట్టించాడు. వాళ్లని బీట్ చేసి తిరుగులేని క్రేజ్, ఇమేజ్‌తో దూసుకుపోయాడు.
కానీ ఆ తర్వాత తన జీవితంలో జరిగిన కొన్ని మిస్టేక్స్ కారణంగా ఆయన లైఫ్ తలక్రిందులైంది. ముఖ్యంగా చిరంజీవి కూతురు సుస్మితతో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఆయన కెరీర్ క్రమంగా డౌన్ అయ్యింది.
uday kiran
సినిమాలు ఆడలేదు. వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అవన్నీ ఉదయ్ కిరణ్ కెరీర్‌పై ప్రభావం చూపించాయి. అయితే ఈ క్రమంలో కొన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి. ఉదయ్ కిరణ్ హీరోగా ప్రారంభించిన చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని ప్రారంభ దశలోనే ఆగిపోతే, మరికొన్ని షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. ఇంకొన్ని షూటింగ్ చివరి దశలో ఆగిపోయాయి.
uday kiran
లవర్ బాయ్ ఇమేజ్‌తో రాణిస్తున్న ఉదయ్ కిరణ్ క్రేజ్ తగ్గిపోతూ వచ్చింది. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి టర్న్ తీసుకుని ఆయన యాక్షన్ హీరోగా ప్రయత్నం చేశారు. అవి కూడా వర్కౌట్ కాలేదు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడట. ఓ వైపు ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్, మరోవైపు సినిమాలు ఆడకపోవడంతో బాగా ఇబ్బంది పడ్డాడట ఉదయ్ కిరణ్. అది ఆయన వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయని అంటుంటారు.
uday kiran premante suluvu kadura movie
ఉదయ్ కిరణ్ నటించిన `ప్రేమంటే సులువు కాదురా` సినిమా 80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుని చివరి దశలో ఆగిపోయింది. ఈ మూవీ పూర్తి అయి విడుదలైతే ఉదయ్ కి పెద్ద హిట్ అయ్యేదని, ఆ దెబ్బతో సూపర్ స్టార్‌గా ఎదిగేవాడని మ్యూజిక్ డైరెక్టర్ జోస్యభట్ల వెల్లడించారు.
ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలు తెలియదన్నారు. కానీ ఏదో జరిగిందనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. ఈ మూవీకి ఏఎం రత్నం నిర్మాత. ఆయన ప్రొడక్షన్ లో సినిమా ఆగిపోయిందంటే మామూలు విషయం కాదు, అది కూడా భారీ స్కేల్ ఉన్న చిత్రమని, అది ఆగిపోవడం బాధ కలిగించిందన్నారు.
joshyabhatla
ఏఎం రత్నం కొడుకు దర్శకుడు జ్యోతికృష్ణ కూడా మధ్యలో ఆ మూవీని పూర్తి చేయాలని ప్రయత్నించారట. కానీ సాధ్యం కాలేదని, ఏం జరిగిందో తెలియదన్నారు. జనసేనకి పాటని చేసినప్పుడు జ్యోతి కృష్ణ కలిశాడని, ఆ టైమ్‌లో ఈ ప్రస్తావన వచ్చిందన్నారు. నిర్మాత ఏఎం రత్నం కూడా అనేవారట.
ఈ మూవీతో ఉదయ్ కిరణ్‌కి మంచి లైఫ్ వస్తుందని. కానీ ఏదో జరిగింది, ఉదయ్ కిరణ్ కి లైఫ్‌ని తలక్రిందులు చేసిందని జోస్యభట్ల వెల్లడించారు. ఈ మూవీ ఆగిపోవడం వెనుక కొన్ని పెద్దవారి హస్తం ఉండే ఉంటుందని, వాళ్లే తెరవెనుక కథ నడిపించినట్టుగా ప్రచారం జరుగుతుంది.