మహేష్ బాబు సినిమాలో విలన్, సౌత్ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్ కు ఐటీ నోటీసులు, కారణం ఏంటి?

రీసెంట్ గా మోహన్ లాల్ హీరోగా ఎల్2 ఎంపురాన్' సినిమాను  డైరెక్టర్ చేశారు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్. తాజాగా ఆయన కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపడం  సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంతకీ సుకుమారన్ కు ఎందుకు ఐటీ నోటీసులు అందాయి.
 

Income Tax Notice to Actor Prithviraj Sukumaran in telugu jms

 'ఎల్2 ఎంపురాన్' సినిమా గత నెల మార్చి 27న విడుదలైంది.పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో, మోహన్ లాల్ హీరోగా తెరెక్కిన ఈసినిమా  4 రోజుల్లో దాదాపు 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే అతి తక్కువ సమయంలో ఎక్కువ వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా పేరు తెచ్చుకుంది. 

Also Read: దివ్య భారతి మరణంతో ఆగిపోయిన 10 సినిమాలు, పూర్తి చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Income Tax Notice to Actor Prithviraj Sukumaran in telugu jms

ఇదిలా ఉండగా, ఎంపురాన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వివాదంలో చిక్కుకున్నాయి. దీనికి మోహన్ లాల్ క్షమాపణలు చెప్పడమే కాకుండా, సినిమాలో నుంచి కొన్ని సన్నివేశాలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 24 సన్నివేశాలు సినిమాలో నుంచి తొలగించి మళ్లీ సెన్సార్ చేశారు. ఈ కొత్త వెర్షన్ నిన్న మొన్నటి నుంచే థియేటర్లలో విడుదలైంది. సినిమాలో నుంచి కొన్ని సన్నివేశాలు తొలగించిన తర్వాత, ఇప్పుడు ఎంపురాన్ వసూళ్ల పరంగా కూడా పడిపోయింది.

Also Read:  పవన్ కళ్యాణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు? అవి చేసుంటే పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడా?


ఇలాంటి పరిస్థితుల్లో నిన్న "ఎంపురాన్ సినిమాను నిర్మించిన గోకులం చిట్‌ఫండ్స్ కంపెనీలో ఈడీ అధికారులు  సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. అక్రమ నగదు లావాదేవీలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఇక తాజాగా నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్‌కు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపారు.

Also Read:  బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?

పృథ్వీరాజ్ కు నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటీ అని  అభిమానులు అడుగుతన్నారు. అయితే ఈసినిమా కోసం పృథ్వీరాజ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్న వివరణ ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ కోరినట్టు తెలుస్తోంది. గతంలో నటించిన సినిమాల పారితోషికం గురించి కూడా వివరాలు తీసుకున్నారు.

అలాగే ఎంపురాన్ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు కో-ప్రొడ్యూసర్‌గా రూ.40 కోట్ల డబ్బులు (Rs. 40 crore salary) తీసుకున్నారని, దీనికి సంబంధించిన లెక్కలు చూపించాలని ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ పంపిన నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది ( IT notice to 'Empuran' director Prithviraj) . ఈ సంఘటన మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది.

Also Read:  40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈసినిమాదే

prithviraj Sukumaran

Prithviraj Sukumaran మలయాళంలో  స్టార్ హీరోగా ఉన్నారు. మాలీవుడ్ లో మాత్రమే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లో ఆయన సినిమాలు చేస్తున్నారు. సలార్ సినిమాలో ప్రభాస్ కు ఆపోజిట్ రోల్ చేసిన సుకుమారన్.. రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో విలన్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ఎక్కువ ఆఫర్లు సాధిస్తున్నారు స్టార్ హీరో. 

Latest Videos

vuukle one pixel image
click me!