డబ్బు కన్నా స్నేహానికి విలువ ఇచ్చే స్టార్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారు సందర్భం వచ్చినప్పుడు తమ గొప్పగుణాన్ని చాటుకుంటారు. కమల్ హాసన్ పై అలాంటి ప్రేమనే చూపించాడు ఓ బాలీవుడ్ స్టార్ హీరో.
భారత సినీ ప్రపంచంలో కమల్ హాసన్ సకల కళా సంగమం. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ నట చక్రవర్తి. వీరిద్దరూ కలిసి పనిచేసిన సినిమా 'హే రామ్' (2000). ఇది ఒక క్లాసిక్ హిట్ గా నటిచింది. అయితే ఈ సినిమా వెనుక ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అవి షారుఖ్‌పై గౌరవాన్ని మరింతగా పెంచుతున్నాయి.
25
సినిమా బడ్జెట్ పెరగడంతో..
'హే రామ్' సినిమాను కమల్ హాసన్ స్వీయ నిర్మిస్తూ.. డైరెక్ట్ చేసి, నటించారు. షూటింగ్ సమయంలో బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో, నటులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన షారుఖ్ ఖాన్ ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆఈసినిమాలో నటించారు. .
35
రెమ్యునరేషన్ కు బదులుగా దొరికిన ప్రేమ
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ, "షారుఖ్ ఈ సినిమాకు డబ్బు తీసుకోలేదు. ప్రతిఫలంగా నేను ఒక ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చాను" అని చెప్పారు. ఈ సినిమా హిందీ పంపిణీ, రీమేక్ హక్కులు కూడా షారుఖ్‌కే దక్కాయి.
కమల్‌పై ఉన్న గౌరవంతోనే షారుఖ్ ఇలా చేశారు. కమల్ సాంకేతిక ప్రయత్నంలో భాగం కావాలనుకున్నారు. మత సామరస్యాన్ని చాటే అమ్జద్ అలీ ఖాన్ పాత్ర నచ్చడంతో, తోటి కళాకారుడికి భారం కాకూడదని ఆయన భావించారు. అందుకే డబ్బులు తీసుకోకుండా ఈసినిమాలో నటించారు షారుఖ్.
55
సినిమాలను ప్రేమించేవారికి మాత్రమే సాధ్యం..
సినిమాను వ్యాపారంగా చూసే ఇండస్ట్రీలో కమల్-షారుఖ్ స్నేహం.. అప్పట్లోనే ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. "కళను ప్రేమించేవారు డబ్బును పట్టించుకోరు" అనడానికి 'హే రామ్' సినిమా ఉదాహరణగా నిలిచింది. షారుఖ్ గొప్ప మనసు దానికి సాక్ష్యంగా మిగిలింది.