Nithiin Flop Movies: యంగ్ హీరో నితిన్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడంపై ఓ కమెడియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భీష్మ మూవీ తర్వాత నితిన్ కి సరైన సక్సెస్ లేదు.
యంగ్ నితిన్ కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు. నితిన్ చాలా సందర్భాల్లో స్టార్ స్టేటస్ కి దగ్గరగా వచ్చి దూరం వెళ్లిపోయారు. నితిన్ ని ప్రతిసారీ పరాజయాలు వేధిస్తూనే ఉన్నాయి. నితిన్ కి భీష్మ తర్వాత సరైన సక్సెస్ లేదు. చివరగా విడుదలైన తమ్ముడు చిత్రం డిజాస్టర్ అయింది.
25
కమెడియన్ మధునందన్ కామెంట్స్
నితిన్ కి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ దానిని ఉపయోగించుకుంటూ మంచి కథలని ఎంచుకోలేకపోతున్నారు అనే విమర్శ ఉంది. దీనిపై నితిన్ ఫ్రెండ్, కమెడియన్ మధునందన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితిన్ సినిమాల్లో నటించడం వల్లే తనకి నటుడిగా బ్రేక్ వచ్చింది అని మధునందన్ తెలిపారు. మధునందన్ టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.
35
ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువ
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల్లో మధునందన్ కీలక పాత్రల్లో నటించారు. నితిన్ ఫ్లాపులపై మధునందన్ మాట్లాడుతూ.. నితిన్ కి మంచి హిట్లు ఉన్నాయి. అ.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భీష్మ కూడా సూపర్ హిట్. నితిన్ కి హిట్లు లేకుండా ఏమీ పోలేదు. అయితే ఇండస్ట్రీలో సినిమాల సక్సెస్ రేట్ సహజంగానే తక్కువ ఉంది.
నితిన్ కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండరు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అది కరెక్ట్ కాదని మధునందన్ అన్నారు. నితిన్ కథల ఎంపికలో 100 శాతం జాగ్రత్త తీసుకుంటారు. కానీ కొన్ని కథలు హిట్ అవుతాయి, కొన్ని కావు. వాటికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకి రాంగ్ రిలీజ్ పడినా కూడా మంచి సినిమా ఫ్లాప్ అవుతుంది అని మధునందన్ అన్నారు.
55
అందువల్లే అవకాశాలు కోల్పోయా
ఇక మధునందన్ తన గురించి చెబుతూ.. నితిన్ తో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల తాను ఆ హీరోకి మాత్రమే పని చేస్తాను అనే ముద్ర పడింది. కొందరు నేను అందుబాటులో ఉండను అని భావించారు. ఈ కారణాల వల్ల దాదాపు 15 సినిమాల వరకు అవకాశాలు కోల్పోయినట్లు మధునందన్ పేర్కొన్నారు. నితిన్ లై సినిమా కోసం ఎక్కువ కాలం యుఎస్ లోనే ఉండిపోయాను. దాని వల్ల కూడా చాన్సులు మిస్ అయ్యాయి అని మధునందన్ పేర్కొన్నారు.