శాశ్వతంగా ఐబొమ్మ క్లోజ్, షాకింగ్ మెసేజ్ ఇదే.. రవి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చాడా ?

Published : Nov 17, 2025, 05:28 PM IST

ఇమ్మడి రవి అరెస్ట్ కావడంతో ఐబొమ్మ శాశ్వతంగా క్లోజ్ అయినట్లు షాకింగ్ మెసేజ్ దర్శనం ఇస్తోంది. అసలు రవి హైదరాబాద్ కి ఎందుకు వచ్చాడు అనే అంశం కూడా వైరల్ గా మారింది. 

PREV
15
సంచలనంగా మారిన ఐబొమ్మ రవి అరెస్ట్ 

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ సంచలనంగా మారింది. హైదరాబాద్ పోలీసులు లాగిన తీగతో పైరసీ డొంక మొత్తం కదిలింది. పోలీసులకే ఛాలెంజ్ లు విసురుతూ ఫేక్ ఐడీ లతో దేశ విదేశాల్లో తప్పించుకు తిరుగుతున్న రవిని పోలీసులు రెండ్రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని అతడి ఫ్లాట్ లో పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. 

25
సంచలన విషయాలు వెలుగులోకి 

ఇమ్మడి రవి విశాఖకు చెందిన వ్యక్తి. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన రవి సాఫ్ట్ వేర్ గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత ఐబొమ్మ సైట్ తో సైబర్ నేరగాడిగా మారాడు. వీసీ సజ్జనార్ మీడియా సమావేశంలో అనేక విషయాలు వెల్లడించారు. రవి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లలో 21 వేల సినిమాల పైరసీ ప్రింట్లు ఉన్నాయట. ఇప్పటి వరకు రవి 20 కోట్లు సంపాదించాడు. ఒకదానిని క్లోజ్ చేస్తే మరొకటి వర్క్ అయ్యేలా 65 మిర్రర్ వెబ్ సైట్లు క్రియేట్ చేశాడు.  1972లో గాడ్ గాదర్ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఓజీ వరకు రవి వద్ద పైరసీ ప్రింట్లు ఉన్నట్లు సజ్జనార్ తెలిపారు. ఇటీవల రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. రవిపై నిఘా పెట్టిన పోలీసులు కూకట్ పల్లి లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. రవి ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ ఇలా పలు దేశాల్లో తిరుగుతూ ఐబొమ్మని నిర్వహిస్తుంటాడు. 

35
50 వేల మంది కూడా లేని అతి చిన్న దేశంలో.. 

 అతడు ఎక్కువ కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అనే అతి చిన్న దేశంలో జీవిస్తునట్లు సజ్జనార్ తెలిపారు. ఆ దేశంలో రవికి సిటిజన్ షిప్ కూడా ఉంది. ఆ దేశ జనాభా 50 వేల మంది కూడా ఉండరు. అలాంటి దేశంలో ఉంటూ రవి తన కార్యకలాపాలు చేస్తున్నాడు. అయితే రవి హైదరాబాద్ ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. రవికి, తన భార్యకి మధ్య విభేదాలు ఉన్నాయని.. విడాకుల గురించి చర్చించేందుకు రవి హైదరాబాద్ వచ్చాడని.. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయాడని ఒక ప్రచారం జరుగుతోంది. 

45
రవి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం వచ్చాడా ?

మరో వైపు రవి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై వీసీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులకు ఎక్కడినుంచో ఇన్ఫర్మేషన్ వచ్చింది.. రవి అలా దొరికిపోయాడు ఇలా దొరికిపోయాడు అని అంటున్నారు. అవేమీ నిజం కాదు. పోలీసులకు ఓన్ నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ తీసుకునే కెపాసిటీ ఉంది అని సజ్జనార్ తెలిపారు. 

55
శాశ్వతంగా ఐబొమ్మ క్లోజ్ 

రవి అరెస్ట్ కావడంతో ఐబొమ్మ వెబ్ సైట్ లో షాకింగ్ మెసేజ్ దర్శనం ఇస్తోంది. ఐబొమ్మని శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నట్లు మెసేజ్ చూపిస్తోంది. 'మీరు ఇటీవల మా గురించి వినే ఉంటారు. మీరు మా అభిమాని కూడా అయి ఉండొచ్చు. ఏది ఏమైనా మా సేవలని శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని నిరాశ పరిచినందుకు క్షమాపణలు' అంటూ మెసేజ్ దర్శనం ఇస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories