సినిమాల్లో విజయ్ స్థానం ఎవరిది? దళపతి రిటైర్మెంట్ పై యంగ్ హీరో కీలక కామెంట్స్

Published : Oct 11, 2025, 05:01 PM IST

 రాజకీయాల కోసం సినిమాకు రిటైర్మెంట్ ప్రకటించాడు సౌత్ స్టార్ హీరో విజయ్ . కంప్లీట్ గా పాలిటిక్స్ కే పరిమితం కాబోతున్నాడు. మరి సినిమాల్లో దళపతి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న కోలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. 

PREV
14
సినిమాలో విజయ్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

తమిళంలో మాత్రమే కాదు తెలుగుతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగు వెలిగాడు విజయ్ దళపతి.  సినిమా్లో  అగ్ర హీరోగా  విజయ్, కెరీర్ పీక్స్‌లో ఉండగానే రాజకీయాల్లోకి వెళ్తున్నారు. సినిమాలకు పర్మినెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించాడు విజయ్. ఇక ఇండస్ట్రీలో  ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు యంగ్ హీరో  ప్రదీప్ రంగనాథన్ ఇచ్చిన సమాధానం ఆసక్తి రేపుతోంది.

24
ప్రదీప్ రంగనాథన్ ఏం చెప్పారంటే?

ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దాంతో ప్రమోషన్స్ ను వేగంగా చేస్తున్నారు టీమ్. ఈక్రమంలో ప్రమోషన్స్‌లో, విజయ్ రాజకీయాల్లోకి వెళ్లారు కదా, ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రదీప్ కు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురయ్యింది.  దానికి ప్రదీప్ సమాధానం చెపుతూ 'ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఈ స్థాయికి రావడానికి ఆయన 30 ఏళ్ల కష్టం ఉంది' అని చెప్పారు.

34
అభిమానులే స్టార్లను చేస్తారు

విజయ్, అజిత్, రజనీ లాంటి స్టార్లు విజయవంతం అవ్వడానికి అభిమానులే కారణం, స్క్రిప్ట్‌లు కాదు. రాబోయే 30 ఏళ్లలో ఆ స్థాయికి ఎవరు చేరుకుంటారో చూద్దాం. అది కూడా అభిమానులే నిర్ణయిస్తారు అని ప్రదీప్ స్మార్ట్‌గా  సమాధానం చెప్పారు. ఆయన నటించిన 'డ్యూడ్' సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది.

44
డ్యూడ్ దీపావళి

ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమాను కీర్తీశ్వరన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు.  ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా మమితా బైజు నటించింది. తెలుగులో అతి పెద్ద ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఇది ఆయనకు తొలి తమిళ చిత్రం.

Read more Photos on
click me!

Recommended Stories