‘కల్కి 2898 AD’ సినిమాలో సుమతి పాత్రలో దీపికా పదుకొణె నటించారు. రెండో భాగంలో దీపికా తప్పుకున్న సంగతి తెలిసిందే. మరి ఆమె స్థానంలో నటించబోయే హీరోయిన్ ఎవరు?
చాలా కాలం తరువాత ప్రభాస్ కు సాలిడ్ హిట్ ఇచ్చిన సినిమా కల్కీ 2898 AD. ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి, 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక ఈమూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె నటించింది. అయితే కల్కి 2898 AD పార్ట్ 2 నుండి దీపిక రీసెంట్ గా తప్పుకుంది. ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నప్పటి నుండి, ఆమె స్థానంలో ఎవరు నటిస్తారనే ప్రశ్న అందరిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ హీరోయిన్‌ను దాదాపు ఖరారు చేశారని సమాచారం. .
25
దీపికా ప్లేస్ లో ఆలియా భట్?
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 AD' రెండో భాగం కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పాత్రలో ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్‌ను నటింపజేయాలని మేకర్స్ నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు టీమ్.
35
దీపికాతో ఫలించని చర్చలు
'కల్కి 2898 AD' పార్ట్ 2 నుండి దీపిక తప్పుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంలో దీపికాతో సుదీర్ఘ చర్చలు జరిగాయని, అయినా సరే ఫలితం లేకుండా పోయిందని, దాంతో దీపికా ఈసినిమా నుంచి తప్పుకున్నట్టు టీమ్ తమ పోస్ట్‌లో తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ కోసం దీపిక 8 గంటల షిఫ్ట్ టైమ్ అడగగా, మేకర్స్ అందుకు అంగీకరించలేదు. దాంతో సినిమా నుండి దీపికా తప్పుకున్నారని టాక్. 'కల్కి 2898 AD' 2024లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1042.25 కోట్లకుపైగా వసూలు చేసింది.
55
టాలీవుడ్ లో రెండో సారి
ఇప్పటికే టాలీవుడ్ లో అడుగు పెట్టింది ఆలియా భట్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో ఆమె నటించి మెప్పించింది. ఇక కల్కీలో ఆలియా నటించడం ఖాయం అయితే.. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా అవుతుంది. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.