Suresh Guru : కామెడీ వీడియోలతో 4M ఫాలోవర్స్ ఏంటి..! నెలకు రూ.5 లక్షల ఆదాయమేంటి..!! ఎవరీ సురేష్ గురు?

Published : Jun 03, 2026, 04:10 PM ISTUpdated : Jun 03, 2026, 04:20 PM IST

Suresh Guru : యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలుగు కంటెంట్ క్రియేటర్ సురేష్ గురు లక్షలాదిమంది అభిమానులను, లక్షలాది రూపాయలను సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియా నుండి అతడి నెల ఆదాయం ఎంతో తెలుసా..?

PREV
15
కామెడీ వీడియోలతో మిలియన్ల ఫాలోవర్స్...

Suresh Guru : మీరు యూట్యూబ్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ ఫాలో అవుతుంటే తప్పకుండా ఓ వ్యక్తిని చూసే ఉంటారు... అతడి కామెడీ వీడియోలు చూసి పగలబడి నవ్వుకుని ఉంటారు. భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు, కుటుంబసభ్యుల మధ్య సరదా సంభాషణలు, స్నేహితుల మధ్య జరిగే సంఘటనలు, రోజువారీ జీవితంలోని ఘటనలకు హాస్యాన్ని జోడించి అతడు చేసే వీడియోలు అద్భుతంగా ఉంటాయి. కంటెంట్ కు కాస్త వ్యంగ్యాన్ని జోడించి, తన హవభావాలతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అందుకే అతడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఇలా వీడియో పెట్టగానే అలా మిలియన్లకొద్ది వ్యూస్ వస్తుంటాయి. ఇలా తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా సెలబ్రిటీ గా తెలుగు ప్రజలకు సుపరితం అయ్యారు సురేష్ గుండుబోయిన అలియాస్ సురేష్ గురు.

25
ఎవరీ సురేష్ గురు..?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం కుందకూరు. ఇదే యూట్యూబ్ లో కామెడీ వీడియోలతో మనందరినీ అలరిస్తున్న సురేష్ స్వస్థలం. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇతడు బాగా కష్టపడి చదువుకున్నాడు. అంతే కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి అనుకున్నది సాధించాడు. ప్రస్తుతం ఇండియన్ రైల్వే లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం భార్య, కొడుకుతో కలిసి వెంకటగిరి పట్టణంలో నివాసం ఉంటున్నాడు.

35
సురేష్ యూట్యూబ్ ప్రయాణం ఎలా మొదలయ్యింది..?

రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న సురేష్ కుటుంబ అవసరాలు పెరగడంతో సైడ్ ఇన్కమ్ కోసం యూట్యూబ్ ను ఎంచుకున్నాడు. విధులు ముగించుకుని ఇంటికివచ్చాక తన ఫోన్ తోనే వీడియోలు తీసుకునేవాడు... వీటిని అతడే ఎడిట్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం ప్రారంభించాడు. ఇలా సరదాగా ప్రారంభమైన అతడి యూట్యూబ్ జర్నీ అతి తక్కువ సమయంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకునే స్థాయికి చేరుకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం అతడికి 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

sureshguru (సురేష్ గురు) పేరిట అతడికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది... ఇందులో ఏకంగా 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక sureshguru unseen (సురేష్ గురు అన్ సీన్) పేరిట ఇటీవల మరో అకౌంట్ క్రియేట్ చేశాడు.. దీనికి 295k ఫాలోవర్స్ ఉన్నారు. Suresh Guru Comedy (సురేష్ గురు కామెడీ) యూట్యూబ్ ఛానల్ కి 1.19M అంటే 11,92,041 సబ్ స్రైబర్స్ ఉన్నారు. Suresh Gunduboina (సురేష్ గుండుబోయిన) పేస్ బుక్ లో పేజికి 92k పాలోవర్స్ ఉన్నారు. ఇలా అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో మంచి ఫాలోయింగ్ కలిగి వుండటంతో ఇతడు వీడియోలు దుమ్ము రేపుతుంటారు.

45
సురేష్ గురు నెల సంపాదన ఎంత..?

సురేష్ యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రతి నెల రూ.3 నుండి రూ.5 లక్షల వరకు సంపాదిస్తాడని అంచనా. యూట్యూబ్ లో అతడి వీడియోలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తుంటాయి... వీటిద్వారా కొంత డబ్బు వస్తుంది. ఇక ఇన్స్టాగ్రామ్ లో భారీగా ఫాలోవర్స్ ఉండటంతో బ్రాండ్ ప్రమోషన్స్ కు కూడా భారీగానే ఛార్జ్ చేస్తాడు. ఒక్కో పోస్టుకు రూ.50,000 నుండి రూ.1,00,000 వరకు ఛార్జ్ చేస్తాడట. ఇక రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి శాలరీ రూ.30,000-40,000 వస్తుంది.

సోషల్ మీడియాలో అతడికున్న క్రేజ్ తో సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించాడు... తాజాగా రాంచరణ్ హీరోగా విడుదలకు సిద్దమైన పెద్ది సినిమాలోనూ సురేష్ నటించినట్లు సమాచారం. ఇలా నటుడిగా కూడా రెమ్యునరేషన్ పొందుతున్నాడు. మొత్తంగా సురేష్ నెల సంపాదన రూ.5 లక్షలకు పైనే ఉంటుందని అంచనా.

55
సురేష్ గురు టార్గెట్ ఇదే..?

రైల్వేలో ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తాను కాబట్టి పెద్దగా సమయం ఉండదు.. అందుకు రోజూ చేసే ఒక్క వీడియోకే మిలియన్స్ వ్యూస్ వచ్చేలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటానని సురేష్ చెబుతున్నాడు. ఇప్పుడు ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ వీడియోలు చేస్తున్నాడు. తన కష్టానికి ప్రతిఫలం దక్కుతోందని... తన వీడియోలు కొన్నింటికి 10M వ్యూస్ కూడా వచ్చాయని ఆనందంగా చెబుతున్నాడు. 

ప్రజలు తనను సొంత బిడ్డలా భావించి అభిమానిస్తున్నారని సురేష్ ఆనందంతో వెల్లడించాడు. ఇలా 2022 అక్టోబర్ లో యూట్యూబ్ ప్రయాణం ప్రారంభించిన సురేష్ మొదటి యూట్యూబ్ ఆదాయం రూ.20 వేలు... ఇప్పుడు అది లక్షలకు చేరింది. తనదైన కామెడీతో నవ్విస్తున్న సురేష్ ను అభిమానించేవారు రోజురోజుకు పెరుగుతున్నారు... ''కంటెంట్ ఉంటే ఎవ్వరినీ ఆపలేం.. అదే తనను ఇక్కడివరకు తీసుకువచ్చింది..'' అని గర్వంగా చెబుతున్నాడు యూట్యూబర్ సురేష్.

Read more Photos on
click me!

Recommended Stories