Ram Charan Peddi: రామ్ చరణ్ కు గాయం, కంటి నుంచి రక్తం వస్తోంది, డైరెక్టర్ కు చిరంజీవి ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా?

Published : Jun 03, 2026, 01:55 PM IST

పెద్ది షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు మెగా పవన్ స్టార్ రామ్ చరణ్. కంటికి గట్టిగా దెబ్బ తగలడంతో తీవ్రమైన రక్త స్రావం అయ్యింది. మెగాస్టార్ వెంటనే డైరెక్టర్ కు ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా? 

PREV
14
పెద్ది సినిమా షూటింగ్ లో ప్రమాదం..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించి, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోన్న ఈమూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈమూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా కొనసాగుతున్నాయి. రామ్ చరణ్ టీమ్ దేశమంతా తిరుగుతూ.. అద్భుతంగా తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈక్రమంలో పెద్ది సినిమా షూటింగ్ ఇన్సిడెంట్స్ గురించి కొన్ని విషయాలు తాజాగా బయటకు వస్తున్నాయి.

24
రామ్ చరణ్ కంటికి గాయం..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీమ్ అంతా ఎవరికి వారు స్పెషల్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిత్రంలోని ఒక కీలక యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ కంటికి తీవ్ర గాయం అయిందని ఆయన తెలిపారు. ఆ ఘటనలో రక్తస్రావం కూడా జరిగిందని, ఆ దృశ్యం కెమెరాలోనే రికార్డ్ అయిందని చెప్పారు.

34
చిరంజీవి ఫోన్ చేసి ఏమన్నాడంటే?

పెద్ది డైరెక్టర్ మాట్లాడుతూ.. ''చిరంజీవి ఫోన్ ఎత్తే వరకు తీవ్ర టెన్షన్‌లో ఉన్నాను. అయితే ఫోన్‌లో చిరంజీవి స్పందించిన తీరు మాత్రం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదో అంటారు అనుకుంటే ఆయన మరోకటి అని షాక్ ఇచ్చారు. చిరంజీవి ఏమాత్రం కోపగించుకోకుండా.. ఎంతో ప్రశాంతంగా అసలు ఏమి జరిగిందో అడిగి తెలుసుకున్నారు. “కంగారు పడకు బుచ్చి.. ఆ గాయం జరిగిన వీడియో క్లిప్ ఒకసారి నాకు పంపించు” అని చిరంజీవి ధైర్యం చెప్పారని బుచ్చిబాబు వెల్లడించారు. ఆ సమయంలో చిరంజీవి ఇచ్చిన సపోర్టు, చూపిన ప్రేమ ఎప్పటికీ మరిచిపోలేనివని అన్నారు.

44
భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న పెద్ది.

‘పెద్ది’ సినిమా విడుదలకు ముందు బుచ్చిబాబు వెల్లడించిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక భారీ బడ్జెట్ తో.. భారీ అంచనాల నడుమ పెద్ది సినిమా తెరకెక్కింది. ఈసినిమా చాలా కష్టాలు దాటుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. గతంలో గేమ్ ఛేంజర్ తో డిజాస్టర్ ఫేస్ చేశాడు చరణ్.. మరి ఈసినిమాతో అయినా మంచి హిట్ ను సాధిస్తాడో లేదో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories