Ram Charan: ఉపాసనపై రామ్ చరణ్ ఫన్నీ కామెంట్స్, పెద్ది ముందే వచ్చి ఉంటే..

Published : Jun 03, 2026, 02:00 PM IST

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా 'పెద్ది' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తన భార్య ఉపాసన గురించి ఆయన సరదాగా ఓ కామెంట్ చేశారు. ఇంతకీ చరణ్ ఏమన్నాడంటే? 

PREV
15
స్కూల్ ఫ్రెండ్ ను పెళ్లాడిన రామ్ చరణ్

రామ్ చరణ్, ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటైనా, అంతకుముందు కొన్నేళ్లు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఉపాసన రామ్ చరణ్ స్కూల్ ఫ్రెండ్. వీళ్ల ప్రేమ మొదలైన తరువాత.. రాత్రిళ్లు బైక్‌పై చక్కర్లు కొట్టేవారట. 2012లో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు తన పెళ్లిపైనే రామ్ చరణ్ సరదాగా జోకులు వేస్తున్నారు.

25
జూన్ 4న థియేటర్లలోకి 'పెద్ది'
రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో, దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ల సమయంలోనే రామ్ చరణ్, ఉపాసనతో తన పెళ్లి గురించి మాట్లాడారు.
35
ఇప్పుడు నాకు మంచి పేరు లేదా?
'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కారులో ప్రయాణిస్తున్నారు. ఈ టైంలో ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. 'ఈ సినిమాతో మీకు మంచి పేరు వస్తుంది' అని బుచ్చిబాబు అన్నారు. దానికి చరణ్, 'అంటే ఇప్పుడు నాకు మంచి పేరు లేదా?' అని నవ్వుతూ ప్రశ్నించారు. అప్పుడే బుచ్చిబాబు మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు.
45
ఇంకా మంచి సంబంధం వచ్చేది

ఒకసారి ఉపాసన ముందే జరిగిన సంభాషణను బుచ్చిబాబు గుర్తు చేసుకున్నారు. 'ఈ సినిమాతో వచ్చిన మంచి పేరు మీ పెళ్లికి ముందు వచ్చి ఉంటే, మీకు ఇంకా మంచి సంబంధం వచ్చేది' అని ఉపాసన ముందే అన్నారట. ఆ మాటకు ఆమె సీరియస్ అయ్యారని బుచ్చిబాబు చెప్పారు. దీనికి రామ్ చరణ్ కూడా 'అవును, ఇంకా మంచి సంబంధం వచ్చేది' అని బదులివ్వడం విశేషం. ఇదంతా సరదా సంభాషణే అయినా, ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

55
అద్భుతమైన క్లైమాక్స్
'పెద్ది' ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమా. ఇందులో రామ్ చరణ్ పెహల్వాన్‌గా, క్రికెటర్‌గా, అథ్లెట్‌గా కనిపించనున్నారు. అటవీ ప్రాంతంలోని ఓ గ్రామంలో, తమ భూమి కోసం పోరాడే కథ ఇది. సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. అయితే, ఎంత ప్రచారం చేసినా సినిమాపై అనుకున్నంత హైప్ రాలేదు. ట్రైలర్ అంత ఆకట్టుకునేలా లేకపోవడమే దీనికి కారణమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read more Photos on
click me!

Recommended Stories