నయనతార అన్న ఎవరో తెలుసా? ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు?

Published : Aug 29, 2025, 08:29 AM IST

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార అందరకి తెలుసు. కానీ నయనతార ఫ్యామిలీ గురించి ఎంత మందికి తెలుసు? నయనతారకు ఓ అన్న ఉన్నాడని మీకు తెలుసా? ఇంతకీ ఆయన ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు.?

PREV
15

లేడీ సూపర్ స్టార్ 

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన నయనతార కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషలలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన “మన శంకరవరప్రసాద్ గారు” చిత్రంలో నటిస్తోంది. ఆమె నటించిన బాలీవుడ్ డెబ్యూట్ మూవీ “జవాన్” బ్లాక్‌బస్టర్ హిట్ కావడం, పాన్ ఇండియా లెవెల్లో హై రెమ్యూనరేషన్ అందుకోవడం వంటి వార్తలు తాజాగా ట్రెండ్ అయ్యాయి.

DID YOU KNOW ?
నయనతార అన్న ఎవరు?
నయనతార అన్న లెనో కురియన్. ఆయన దుబాయ్ లో వ్యాపారం చేస్తున్నారు. అన్న వ్యాపారంలో నయనతార కూడా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.
25

ధనుష్ తో వివాదం

40 ఏళ్ల వయసులో కూడా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది నయనతార. స్టార్ సీనియర్ హీరోల జతగా నటిస్తూ స్టార్ డమ్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికీ ఫామ్ ను కొనసాగిస్తూ..యంగ్ హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ను అందుకుంటోంది. సినిమాలతో పాటు వివాదాలతో కూడా పాపురల్ అయిన నయనతార, ఇప్పటికీ ఏదో ఒక వివాదంతో వైరల్ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం తన పెళ్ళి డాక్యూమెంటరీ విషయంలో హీరో ధనుష్ తో వివాదం కొనసాగతోంది. గతంలో ఆమె సరోగసి విషయంలో కూడా వివాదం అయ్యారు.

35

నయనతార ఫ్యామిలీ

ఇక ఇదిలా ఉండగా, ప్రస్తుతం నయనతార వ్యక్తిగత జీవితం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. నయనతార గురించి అందరికి తెలిసిందే, కాని ఆమెకు ఓ అన్న ఉన్నాడని ఎంత మందికి తెలుసు? నయనతార అన్నయ్య ఎక్కడుంటారు? ఏం చేస్తారో తెలుసా? నయనతార అన్న పేరు లెనో కురియన్ (Leno Kurian). కేరళ కుటంబానికి చెందిన నయనతార అసలు పేరు డయానా మారియం కురియన్, ఆమె అన్నపేరు లెనో కురియన్. నయనతారకు అన్న ఉన్నట్టు ఎవరికి పెద్దగా తెలియదు. ఆయన కూడా పెద్దగా స్క్రీన్ మీదకు ఎప్పుడూ రాలేదు.

45

నయనతార అన్న లెనో కురియన్ 

తాజాగా లెనో, నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్‌లతో కలిసిఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై ఆసక్తి పెరిగింది. నయనతార అన్న లెనో దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. సోషల్ మీడియా సమాచారం ప్రకారం, లెనో కురియన్ దుబాయ్‌లో బిజినెస్ చేస్తూ స్థిరపడ్డాడు. నయనతార తండ్రి కురియన్ కొడియాతు, తల్లి ఒమనా కురియన్ అనేక సందర్భాలలో ప్రస్తావనకు వచ్చారు. కానీ లెనో గురించి జనాలకు ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే నయనతార అన్న దుబాయ్ లో ఉండగా.. అక్కడ బిజినెస్ లలో నయనతార కూడా పార్ట్నర్ గా ఉన్నట్టు సమాచారం. నయన్ సంపాదనలో కొంత భాగం దుబాయ్ లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.

55

విఘ్నేష్ తో పెళ్లి , పిల్లలు

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోతో పాటు, నయనతార కుటుంబం మరోసారి చర్చనీయాంశమవుతోంది. నయనతార 2022లో విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుని, సరోగసీ ద్వారా ఉయూర్, ఉలాగ్ అనే జంట పిల్లల తల్లిగా మారిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయం పక్కన పెడితే, నయనతార వ్యక్తిగత విషయాల్లో చాలా గోప్యంగా ఉంటారు. దాంతో ఆమె కుటుంబ సభ్యుల గురించి మినిమల్ డీటెయిల్స్ మాత్రమే బయటకొచ్చాయి.

Read more Photos on
click me!

Recommended Stories