మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తన కెరీర్ లో ఎక్కువగా మాస్ చిత్రాలే చేశారు. రాంచరణ్ కుటుంబ కథా చిత్రాలు చేసింది చాలా తక్కువ. రాంచరణ్ సినిమాలో నటించిన ఓ హీరోయిన్ తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టాలీవుడ్ కి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది అనే కారణాన్ని ఆమె వివరించారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు కమలినీ ముఖర్జీ.
25
కమలినీ ముఖర్జీ తెలుగులో ఆనంద్, గోదావరి, జల్సా, గమ్యం లాంటి చిత్రాల్లో నటించారు. హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. రాంచరణ్ నటించిన కుటుంబ కథా చిత్రం గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కమలినీ ముఖర్జీ శ్రీకాంత్ కి జోడీగా నటించారు.
35
ఆ మూవీ గురించి కమలినీ మాట్లాడుతూ.. గోవిందుడు అందరివాడేలే చిత్రం తర్వాత తెలుగులో ఇక నటించకూడదని డిసైడ్ అయ్యా. ఆ చిత్రం వల్ల చాలా ఇబ్బంది పడ్డా. ఆ చిత్రంలో నాకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. అంతే కాదు నేను నటించిన సన్నివేశాలు కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. దాని కోసం గొడవ చేసే వెళ్లిపోవాలని అనుకోలేదు. సర్దుకుపోయి ఆ చిత్రం పూర్తి చేశా. ఇక టాలీవుడ్ లో నటించకూడదని అనుకున్నా అంటూ కమలినీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
45
తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం గోవిందుడు అందరి వాడేలే. ఆ తర్వాత కొన్ని మలయాళీ చిత్రాల్లో నటించి సినిమాలకు పూర్తిగా దూరమైంది. దీనికి కారణం ఆమె వివాహం చేసుకోవడమే. భార్యగా కుటుంబ బాధ్యతలు చూసుకోవడం ముఖ్యం అనిపించింది అందుకే సినిమాలు మానేసినట్లు కమలినీ పేర్కొంది.
55
ఆనంద్ చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటిగా నంది అవార్డు సొంతం చేసుకుంది. ఆమె ఎక్కువగా శేఖర్ కమ్ముల చిత్రాల్లో నటించారు. ఆనంద్, గోదావరి చిత్రాలు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందినవే. హ్యాపీ డేస్ చిత్రంలో కూడా చిన్న పాత్ర పోషించారు.