అయితే బలగం తరువాత వేణు ఇంకో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించలేకపోయారు. అందరూ వేణు నెక్ట్స్ ప్రాజెక్టు ఏమిటా అని ఎదురుచూస్తున్న టైమ్ లో ఎల్లమ్మ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్న వేణు.. హీరోని పట్టుకుని సెట్స్ మీదకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమాకు హీరో దొరకటమే సమస్యగా మారిందని సమాచారం.
రీసెంట్ గా ఎల్లమ్మ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతావు అంటూ స్వయంగా దిల్ రాజు దర్శకుడు వేణు ను ఇటీవల ఒక సినిమా వేడుకలో అడిగారు. అప్పుడు వేణు సమాధానం ఇస్తూ మీరు ఓకే అంటూ వెంటనే మొదలు పెడతాను అని వేణు అంటే... వద్దు వద్దులే ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టు అన్నట్లుగా దిల్ రాజు నుంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎల్లమ్మ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం అయి, అదే ఏడాది చివరి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తేలింది.