నాగచైతన్య పెళ్లికి కొత్త వేదిక.. దానికి భయపడే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడా?

First Published | Nov 5, 2024, 9:35 AM IST

నాగచైతన్య, శోభితా దూలిపాళ మ్యారేజ్‌ డేట్‌ తోపాటు వేదిక కూడా ఫిక్స్ అయ్యింది. అయితే నాగ్‌ కొత్త వేదిక అనుకున్నారట. దానికి బలమైన కారణాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 
 

నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తన మొదటి భార్య, హీరోయిన్‌ సమంతకి విడాకులు ఇచ్చిన మూడేళ్ల తర్వాత ఆయన సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకోబోతున్నారు. మరో హీరోయిన్‌ శోభితా దూలిపాళ్లతో ఆయన ఏడు అడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయం తెలిసిందే. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఆగస్ట్ లో ఎంగేజ్‌మెంట్‌తో ఈ జంట సర్‌ప్రైజ్‌ చేసింది. ఇప్పుడు పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేది చర్చనీయాంశంగా మారింది. అక్కినేని అభిమానులు ఈ వార్త కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. తాజాగా మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. వచ్చే నెలలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారట. డిసెంబర్‌ 4న నాగచైతన్య, శోభితా పెళ్లి గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారని సమాచారం.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే శోభితా తన ఇంట్లో పసుపు దంచడం కార్యక్రమంతో పెళ్లి తంతుని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అందంగా ముస్తాబై ఆకట్టుకుంది. అప్పుడే పెళ్లి కళ వచ్చేసిన ఫీలింగ్‌ కలిగించింది. 
 


Naga Chaitanya-Sobhita Dhulipala

ఇక మ్యారేజ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చైతూ, శోభితా మ్యారేజ్‌ వెన్యూ ఎక్కడ అనేది క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. అయితే ఫారెన్‌లో డెస్టినీ వెడ్డింగ్‌ తరహాలో ప్లాన్‌ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇటీవల సినిమా సెలబ్రిటీలు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్న రాజస్థాన్‌ ప్యాలెస్‌లలో అనుకున్నారనే వార్తలు వచ్చాయి.

కానీ నాగ్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారట. బయటకు ఎక్కడ కాకుండా తన స్టూడియోస్‌లోనే ప్లాన్‌ చేస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ మ్యారేజ్‌ నిర్వహించాలనుకుంటున్నారట. ఈ నిర్ణయం కూడా ఫైనల్‌ అయ్యిందని తెలుస్తుంది. 
 

మరి నాగ్‌ నిర్ణయానికి బలమైన కారణాలుకూడా ఉన్నాయి. ప్యాలెస్‌లో గ్రాండ్‌గా చేసి ఆర్భాటాలకు పోతే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సమంతతో గ్రాండ్‌గానే మ్యారేజ్‌ జరిగింది. అటు హిందూ, ఇటు క్రిస్టియన్‌ ట్రెడిషన్‌లో వీరి మ్యారేజ్‌ జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరిగింది.

కానీ ఈ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. నాలుగేళ్లలోనే విడిపోయారు. విడాకులు తీసుకోవడం వారి వ్యక్తిగతం విషయం అయినప్పటికీ, అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనవసరమైన హంగామా వద్దు అని నాగ్‌ భావిస్తున్నారట. అందుకే అన్నపూర్ణ స్టూడియోలోనే సింపుల్‌గా చేయాలనుకుంటున్నారట. అతిథులు కూడా లిమిటెడ్‌గానే అనుకుంటున్నారట.

అంతేకాదు తన బ్యాక్‌ బోన్‌గా, వారసత్వంగా భావించే అన్నపూర్ణ స్టూడియోలోనే అయితే సెంటిమెంట్‌గా ఉంటుందని, నాన్నగారు ఏఎన్నార్‌ ఆశీర్వాదాలు కూడా ఉంటాయని అక్కినేని ఫ్యామిలీ భావిస్తున్నారట. అందుకే మ్యారేజ్‌ వేదికగా అన్నపూర్ణ స్టూడియోని ఫిక్స్ చేసినట్టు సమాచారం. 

నాగచైతన్య, శోభితా దూలిపాళ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సమంతతో విడాకులు ఇచ్చిన తర్వాత శోభితకి దగ్గరైనట్టు తెలుస్తుంది. అయితే సమంతతో చైతూ విడిపోవడానికి శోభితనే కారణమనే మరో రూమర్‌ కూడా ఉంది. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది. దాదాపు మూడేళ్లు ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు.

రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపించారు. ఇటీవల అందరికి ట్విస్ట్ ఇస్తూ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు పంచుకుని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు. నిజానికి ఈ ఇద్దరు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి ఎక్కడ ఈ లవ్‌ స్టోరీ స్టార్ట్ అయ్యిందనేది తెలియాల్సి ఉంది. 
 

ఇక ప్రస్తుతం నాగచైతన్య.. `తండేల్‌` సినిమాలో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. `లవ్‌ స్టోరీ` తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఇది. కోస్టల్‌ ఏరియాలోని మత్య్సకారుల ఫ్యామిలీకి చెందిన ఓ కుర్రాడి కథతో ఈ మూవీ తెరకెక్కుతుంది.

అతని ప్రేమ, స్ట్రగుల్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. అల్లు అరవింద్‌, బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్‌ అనుకున్నారు. కానీ `గేమ్‌ ఛేంజర్‌` కారణంగా వాయిదా వేసే ఛాన్స్ ఉందట. జనవరిలోగానీ, ఫిబ్రవరిలోగానూ రిలీజ్‌ ఛాన్స్ ఉంది. ఈ రోజు దీనిపై క్లారిటీ రానుంది. 

read more: సమంతతో కలిసి నాగార్జునను మోసం చేసిన నాగచైతన్య, ఒళ్ళు మండి ఏం చేశాడో తెలుసా..?

Also read: తెలుగువారిపై నటి కస్తూరి అవమానకర కామెంట్స్, ఇంతకీ ఆమె ఏమన్నారు?

Latest Videos

click me!