'జై హనుమాన్‌' లో రానా దగ్గుపాటి, ఏ పాత్రలో అంటే

First Published | Nov 5, 2024, 10:16 AM IST

 `హనుమాన్‌`కి సీక్వెల్ గా  'జై హనుమాన్‌' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో రిషబ్‌ శెట్టి హనుమాన్‌ పాత్రలో నటిస్తుండగా, రానా ఓ క్రేజీ పాత్రలో కనిపించబోతున్నారట. 

Rana Daggubati, Jai Hanuman, Prasanth varma

రానా ఓ పాత్ర కమిటయ్యాడంటే ఖచ్చితంగా ఆ సినిమా విలువ రెట్టింపు అవుతుంది. ఆచి,తూచి సినిమాలు కమిటవ్వుతున్నారు రానా. ఈ క్రమంలో తాజాగా  'హను-మాన్‌' సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద సూపర్ సక్సెస్​ అందుకున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ నెక్ట్స్ సినిమాకు గ్రీన్ సిగనల్ ఇచ్చారు.

తేజ సజ్జా లీడ్​ రోల్​లో తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్ టాక్​తో ఇటు ఇండియాలోనే కాకుండా అటు ఇంటర్నేషనల్​గానూ గుర్తింపు తెచ్చుకుంది.   ఆ సినిమాకు సీక్వెల్​గా 'జై హనుమాన్‌'ను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Rishab Shetty to play the lead in jai hanuman by prasanth varma


దీపావళి పండుగ సందర్భంగా కన్నడ స్టార్‌ హీరో రిషబ్‌శెట్టిని హనుమంతుడిగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన, ఇప్పుడు మరో సర్‌ప్రైజ్​ను ఇచ్చారు. టాలీవుడ్ హీరో రానా , అలాగే కన్నడ స్టార్ రిషబ్‌శెట్టితో కలిసి దిగిన ఓ స్పెషల్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

దానికి 'జై జై హనుమాన్‌' అనే క్యాప్షన్ జోడించి రిషబ్‌శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ను ట్యాగ్​ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అభిమానులు ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్​లో చూసి సినిమాపై మరిన్ని అంచనాలు పెట్టుకుంటున్నారు. రానా ఈ PVCUలో ఎటువంటి రోల్​లో కనిపించనున్నారో అంటూ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

Latest Videos



అందుతున్న సమాచారం మేరకు శ్రీరాముడు పాత్రలో రానా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. అయితే అదేం కాదు మరో కీలకమైన పాత్రలో రానా కనిపిస్తాడు. ఆయన మైథాలజీ రోల్ చేయటం లేదు , నెగిటివ్ టచ్ ఉన్నపాత్రలో రానాని చూపించబోతున్నారు అని ఫిల్మ్ నగర్ జనం అంటున్నారు. అదేం కాదు ఈ సినిమాకు రానా కో ప్రొడ్యూసర్ అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రానా పాత్ర ఏమిటనేది తెలియాల్సి ఉంది.


 'జై హనుమాన్'  విషయానికి వస్తే, శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన ఏం చేశాడు? అన్న స్టోరీతో ఈ సీక్వెల్​ రూపొందనుందని చెప్తున్నారు. ఫస్ట్ ఫార్ట్  హీరో తేజ సజ్జా హీరోగా నటించారు.

సూపర్‌హీరో స్టోరీకి ఇతిహాస పురణాలను ముడిపెట్టి తీర్చిదిద్దారు. తేజతో పాటు అమృతా అయ్యర్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్​ శీనూ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.అతి తక్కువ బడ్జెట్​తో వచ్చిన ఈ సినిమా తెలుగు, హిందీ సహా రిలీజైన ఇతర భాషల్లోనూ భారీగా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. 

Actor Rishab Shetty likely to play lead in Prasanth Varma's Jai Hanuman

దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను సంపాదించింది. ఇక ఈ చిత్రంలో హీరో నటనకు ఫుల్ మార్క్స్​ పడగా, అక్కగా చేసిన వరలక్ష్మీ శరత్​కుమార్ అంజమ్మ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పాటు విలన్​గా వినయ్​ రాయ్ కూడా తనదైన శైలిలో నటించి మెరిశారు. ఈ సినిమా 'హను- మాన్‌'కు మించి వందరెట్లు భారీ స్థాయిలో ఉంటుందని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే ఓ సందర్భంలో తెలిపారు. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదని, కానీ సీక్వెల్‌లోనూ సజ్జా హనుమంతు పాత్ర ఉంటుందని అన్నారు.

Jai Hanuman


ఈ 'జై హనుమాన్' చిత్రంతో పాటు, 'అధీర', 'మహాకాళి' చిత్రాలు కూడా ప్రశాంత్ వర్మ పీవీసీయూ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగానే రానున్నాయి. మరోవైపు నందమూరి నట వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి కూడా ప్రశాంత్‌ వర్మనే దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇది పీవీసీయూలో భాగమా కాదా అనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది.

read more: నాగచైతన్య పెళ్లికి కొత్త వేదిక.. దానికి భయపడే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడా?

also read: రజినీకాంత్ ముందు మోహన్ బాబు పరువు తీసిన చిరంజీవి, మెగాస్టార్ ఏమన్నరంటే..?

click me!