Mirai Twitter Review : టాలీవుడ్ కు సూపర్ హీరోలా తయారయ్యాడు తేజ సజ్జా, మిరాకిల్స్ చేస్తున్నాడు, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి హనుమాన్ సినిమాతో, పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తేజ్, తాజాగా మిరాయ్ తో మరోసారి మిరాకిల్ చేయడానికి వచ్చేశాడు. పైగా ప్రభాస్ ఎంట్రీతో సర్ ప్రైజ్ ఇచ్చారు టీమ్. హనుమాన్ మూవీ తర్వాత తేజ్ చేస్తున్న ప్రతీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే హనుమాన్ మూవీ తర్వాత జై హనుమాన్ సినిమా రావాల్సి ఉంది. కొన్ని కారణాలవల్ల అది వాయిదా పడడంతో తేజ్ మిరాయ్ సినిమాతో పలకరించాడు. ఇక ఈసినిమా ఈరోజు రిలీజ్ అవుతుండగా.. ప్రీమియర్స్ సందడి మొదలయ్యింది. ఈసినిమాను చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మరి ఈసినిమా పై వారి అభిప్రాయం ఏంటీ అనేది ట్విట్టర్ రివ్యూ ద్వారా చూసేద్దాం.