బుద్ధుందా అంటూ తెలుగు హీరోయిన్ ని తిట్టిన కమల్ హాసన్..16 ఏళ్ళ వయసున్న ఆమెని చూసి ఏఎన్నార్ సతీమణికి ఆశ్చర్యం

Published : Jul 06, 2025, 10:43 AM IST

కమల్ హాసన్ నటించిన గొప్ప చిత్రాలలో సాగర సంగమం ఒకటి. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం క్లాసిక్ మూవీ గా నిలిచింది.

PREV
15
కమల్ హాసన్ సాగర సంగమం మూవీ 

కమల్ హాసన్ నటించిన గొప్ప చిత్రాలలో సాగర సంగమం ఒకటి. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం క్లాసిక్ మూవీ గా నిలిచింది. ఈ చిత్రంలో కమలహాసన్ నట విశ్వరూపం ప్రదర్శించారు. కమల్ హాసన్ కి జంటగా ఈ మూవీలో సీనియర్ నటి జయప్రద నటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం గురించి సహజనటి జయసుధ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయప్రద కంటే ముందుగా సాగర సంగమంలో నటించే అవకాశం తనకే వచ్చిందని జయసుధ తెలిపారు. కానీ అదే సమయంలో తాను ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాల్లో నటిస్తున్నాను. అయినప్పటికీ సాగర సంగమం చిత్రానికి కూడా సైన్ చేశాను.

25
సాగర సంగమం మూవీ నుంచి తప్పుకున్న జయసుధ 

షూటింగ్ మొదలయ్యే సమయానికి షెడ్యూల్ విషయంలో కుదరలేదు. సాగర సంగమం మూవీ షూటింగ్ షెడ్యూల్ మార్చడం వల్ల ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రాలతో క్లాష్ ఏర్పడింది. సాగర సంగమం మూవీ కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాల్ని వదులుకోలేను కదా. అందువల్లే ఆ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జయప్రదని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ చిత్రంలో క్యారెక్టర్ నాకన్నా జయప్రదకే బాగా సరిపోతుందని నాకనిపించింది.

35
కమల్ హాసన్ బుద్ధుందా నీకు అని తిట్టారు   

ఆ మూవీ నుంచి తప్పుకోవడంతో కమల్ హాసన్ గారు ఒకరోజు పిలిచి నాకు చివాట్లు పెట్టారు. బుద్ధుందా నీకు ఇంత మంచి చిత్రాన్ని వదులుకుంటావా అని కోపంతో తిట్టేశారు. సాగర సంగమం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీ వదులుకోవడంతో నేనేమీ రిగ్రెట్ గా ఫీల్ కాలేదు. జయప్రద చాలా బాగా నటించింది అని జయసుధ అన్నారు.

45
జ్యోతి చిత్రంతో ఫస్ట్ బ్రేక్

లెజెండ్రీ నటి దర్శకురాలు విజయనిర్మలకు జయసుధ బంధువు అవుతారు. జయసుధని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది విజయ నిర్మలనే కావడం విశేషం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి చిత్రంతో తనకి ఫస్ట్ బ్రేక్ వచ్చిందని జయసుధ తెలిపారు. జ్యోతి మూవీలో నటించే సమయానికి నా వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. ఆ చిత్రాన్ని ఏఎన్ఆర్ సతీమణి అన్నపూర్ణ గారు చూశారట. ఒకరోజు అనుకోకుండా ఏఎన్ఆర్ గారిని కలిసాను. ఇదిగో అమ్మాయి ఇలా రా అని ఏఎన్ఆర్ పిలిచారు. నువ్వు జ్యోతి అని ఏదైనా సినిమాలో నటించావా అని అడిగారు.

55
జయసుధ స్టార్ హీరోయిన్ అవుతుందని జోస్యం చెప్పిన ఏఎన్ఆర్ సతీమణి

అవును చేశాను రాఘవేంద్రరావు దర్శకత్వంలో అని చెప్పాను. మా ఆవిడ ఆ సినిమా చూసిందట. ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది, అద్భుతంగా నటించింది.. తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతుంది అని నాతో చెప్పింది అని ఏఎన్ఆర్ అన్నారు. ఆ విధంగా జ్యోతి చిత్రం ప్రతి ఒక్కరిలో నాకు ఒక గుర్తింపు తీసుకు వచ్చింది అని జయసుధ అన్నారు. ఆ తర్వాత ఏఎన్ఆర్ తో ప్రేమాభిషేకం లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందని జయసుధ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories