40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా, బ్యాచిలర్ గా మిగిలిపోయిన హీరోయిన్లు ఎవరు?

Published : Jul 06, 2025, 08:31 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా మిగిలిపోయారు. మరీ ముఖ్యంగా సౌత్ ఫిల్మ్స్ లో స్టార్ హీరోయిన్లు గా వెలుగు వెలిగిన తారలు రకరకాల కారణాలతో ఒంటరిగా మిగిలిపోయారు. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోయిన్లు ఎవరోతెలుసా?

PREV
16

40 ఏళ్లు దాటినా పెళ్లికాని హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అందులో ముందుగా మాట్లాడుకోవలసింది త్రిష గురించి. హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అరుదైన తార త్రిష. హీరోయిన్ గా త్రిష దాదాపు 20 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. 

తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోలందరి సరసన మెరిసిన ఈ బ్యూటీ.. ఇప్పటికీ సీనియర్ హిరోల సరసన నటిస్తూనే ఉంది. గతంలోనే త్రిష పెళ్లి చేసుకోవాలసి ఉంది. ప్రముఖ నిర్మాత వరుణ్మణియన్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని నిశ్చితార్థం చేసుకుంది, కానీ అకస్మాత్తుగా వచ్చిన విభేదాలతో అది బ్రేకప్ అయ్యింది.

త్రిష చాలా కాలం టాలీవుడ్ హీరో రానాతో డేటింగ్ చేసిందని రూమర్స్ ఉన్నాయి. ఆతరువాత వీరిమధ్య బ్రేకప్ అయ్యిందని అంటారు. ఇక విజయ్ దళపతితో కూడా త్రిష రిలేషన్ మెయింటేన్ చేస్తుందంటూ ఇప్పటికీ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.ఈ విషయంలో నెటిజన్లపై చాలాసార్లు ఫైర్ అయ్యింది త్రిష. ఇక తన పెళ్లి గురించి మాత్రం ఇప్పటి వరకూ ఆమె క్లారిటీ ఇవ్వలేదు.

26

టాలీవుడ్ స్టార్ హీరోయన్ అనుష్క కూడా ఇంత వరకూ పెళ్లి చేసుకోలేదు. 43 ఏళ్లు వచ్చినా అనుష్కశెట్టి పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వలేదు. టాలీవుడ్ లో అరుంధతి, బాహుబలి, బాగమతి లాంటి హిట్ సినిమాలు చేసిన అనుష్క.. తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన మెరిసింది. అయితే ప్రభాస్ తో అనుష్క లవ్ లో ఉందని చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయి. 

వీరిద్దరికి అభిమానులు ఏఐ టెక్నాలజీ ద్వారా పెళ్లి చేసి.. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కాని వీరి ప్రేమ గురించి ఎప్పుడూ అఫీషియల్ గా వారు అనౌన్స్ చేయలేదు. మేము మంచి మిత్రులం మాత్రమే అని ఇద్దరు చెపుతూ ఉంటారు. మరి అనుష్క బ్యాచిలర్ గా ఉండిపోడానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు.

36

టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు చేసిన నటి టబు. 53 ఏళ్లు వచ్చినా ఈ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ ఒంటరి జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది టబు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో ప్రేమ వ్యవహారం వల్లే టబు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయిందని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా ఉంది. అంతే కాదు టాలీవుడ్ లో కింగ్ నాగార్జున తో కూడా టబుకు ఎఫైర్ ఉందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక టబు మాత్రం తాను పెళ్లి చేసుకోనని ఎప్పుడో చెప్పేసింది.

46

పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన మరో టాలీవుడ్ హీరోయిన్ నగ్మా. తెలుగులో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్, శరత్‌కుమార్‌, ప్రభుదేవ లాంటి స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది నగ్మ. తెలుగు, తమిళ, హిందీ తో పాటు ఆమె భోజ్‌పురి, మరాఠీ వంటి భాషల్లో కూడా నటించింది నగ్మ. 

హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిన నగ్మా.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ క్రికెటర్ గంగూలీతో నగ్మా ప్రేమలో పడిందని, అందుకే పెళ్లి చేసుకోలేదని చెబుతారు. 50 ఏళ్ళు దాటిన నగ్మ బ్యాచిలర్ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది.

56

కేరళకు చెందిన నటి సితార.తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత చెల్లెలి పాత్రలు చేసింది సితార. ఆతరువాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఇప్పటికీ తెలుగులో తల్లి పాత్రలు చేస్తున్న 52 ఏళ్ల నటి సితార ఇంకా పెళ్లి చేసుకోలేదు. 

తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుందని పెళ్లి చేసుకోలేదని ఓ సందర్భంలో సితార చెప్పారు. కానీ ఆమె నిర్మాత మురళిని ప్రేమించారని పుకార్లు వచ్చాయి. మురళి 2010లో గుండెపోటుతో మరణించారు. దీని కారణంగా సితార కొన్ని సంవత్సరాలు డిప్రెషన్‌లో ఉన్నారని చెబుతారు. అందుకే ఆమె పెళ్ళి చేసుకోలేదని సమాచారం.

66

తెలుగు, తమిళ భాషల్లో పాపులర్ అయిన నటి కౌసల్య. తెలుగులో జగపతిబాబు, శ్రీకాంత్, తమిళంలో విజయ్, సూర్య వంటి ప్రముఖ నటులతో కలిసి నటించిన నటి కౌసల్య చాలా తక్కువ సమయంలోనే స్టార్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. 44 ఏళ్లు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. లవ్ ఫెయిల్యూర్ వల్లే ఇప్పటి వరకూ కౌసల్య పెళ్లి చేసుకోలేదని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories