రాజమౌళి కి బాగా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..? ఎన్టీఆర్, రామ్ చరణ్ చెప్పిన అసలు నిజం

First Published | Nov 5, 2024, 1:47 PM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి బాగా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..? ఈ విషయం ఎవరికి తెలుసు..? ఎంత మందికి తెలుసు..? అసలు జక్కన్నకు కోపం వస్తుందా..? ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ , రామ్ చరణ్. ఆయన ఏం చేస్తాడో తెలిస్తేు షాక్ అవుతారు. 

Rajamouli

ప్రపంచం మెచ్చిన తెలుగు దర్శకుడు రాజమౌళి.  ఎక్కడా అట్టడుగున ఉన్న టాలీవుడ్ వైపు ప్రపంచ సినిమా ఆసక్తిగా చూసేలా చేశాడు జక్కన్న. తన సినిమా హిట్ అవ్వాలి.. తన ఇండస్ట్రీకి గుర్తింపు రావాలి అని తహతహలాడుతుంటారు రాజమౌళి. అందుకే బాహుబలి సినిమాలతో అటు బాలీవుడ్ ను. ఇటు కోలీవుడ్ ను గట్టిగా కొట్టేశారు. ఈ రెండు ఇండస్ట్రీలు తెలుగు సినిమాను చాలా చులకనగా చూసేవారు. 

Also Read: సమంతతో కలిసి నాగార్జునను మోసం చేసిన నాగచైతన్య, ఒళ్ళు మండి ఏం చేశాడో తెలుసా..?

కాని ఇప్పుడు ఆ ఇండస్ట్రీలు.. అందులో నటులు టాలీవుడ్ సినిమాల్లో కనిపించడానికి ఆరాటపడుతున్నారు. ఈ క్రెడిట్ అంతా రాజమౌళిదే. చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఓటమీ  ఎరుగని దర్శకుడిగా రాజమౌళి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆకరికి కమెడియన్ తో కూడా సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించాడు జక్కన. ఇక ప్రభాస్ తో బాహుబలి సినిమా చేసి.. అటు ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేశాడు. 

Also Read:కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ,


Rajamouli

ఇటు టాలీవుడ్ రేంజ్ ను కూడా మార్చేశాడు. ఇక ఆతరువాత ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్లి వదిలిపెట్టాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబును హాలీవుడ్ కు లిప్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి. ఇక రాజమౌళి చాలా కూల్ గా కనిపిస్తాడు. కాని ఆయన మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కాని ప్రశాంతంగా ఉంటారు. అంత ఎత్తుకు ఎదిగినా.. చాలా ఒదిగి ఉంటారు జక్కన్న.

రాజమౌళి చాలా సాధారణంగా కనిపిస్తుంటాడు. ఇంత సాధించిన మనిషి కదా.. ఎంత దర్జా చూపించాలి అన్నా ఆలోచన ఆయనకు ఏకోశానా కనిపించదు. మరి అటువంటి  రాజమౌళికి కోపం వస్తుందా..? నిజంగా కోపం వస్తే ఆయన ఏం చేస్తారు..? ఏ సందర్భంలో కోపం వస్తుంది...? ఆయన కోపం చూసిన వారు ఎవరు..? ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్. 

NTR-Rajamouli

ఆర్ఆర్ ఆర్ ప్రమోషన్లలో భాగంగా గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ ఈ ప్రశ్న వేశారు. రాజమౌళికి కోపం వస్తే ఏం చేస్తారు అని. అప్పుడు చరణ్ అన్నాడు మైక్ విరిగిపోతుంది.. విసిరికొడతారు అని అన్నాడు. అప్పుడు వెంటనే ఎన్టీఆర్ అందుకుని జక్కన్నకు కోపం వస్తే.. చేతిలో ఉన్న మైక్ విరిగిపోవడంతో పాటు.. వెంటే ఓ భూతు వస్తుంది.. జంద్యాల సినిమాలో ఆర్ఆర్ వస్తుంది కదా.. బూతుబూతుబూతు.. అని అలా చెవులు మూసుకునేలా ఓ మాట అంటారు అని ఎన్టీఆర్ అసలు విషయం బయటపెట్టారు. 
 

ఇంత స్టార్ డైరెక్టర్.. అంత ప్రశాంతంగా కనిపిస్తారు.. కాని షూటింగ్ లో భాగా విసిగిస్తే మట్టుకు  బాగా కోపం వస్తుందట రాజమౌళికి. వెంటనే ఆయన గట్టిగా మైక్ విరిగేలా విసిరేసి.. ఆ బుతు తిడతారట. మరి ఆ బూతు ఏంటో తెలియదు కాని.. సీక్రేట్ మాత్రం ఎన్టీఆర్ రివిల్ చేశారు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమా కోసం రెడీగా ఉన్నారు. మహేష లుక్ ఫైనల్ అవ్వగానే.. షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. 

Latest Videos

click me!