ఆ రీమేక్ బాలయ్యతో అనుకుంటే రవితేజ చేస్తున్నాడా?

First Published | Nov 5, 2024, 1:03 PM IST

మలయాళ హిట్ 'ఆవేశం' తెలుగు రీమేక్‌ హీరోగా రవితేజ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. మొదట బాలకృష్ణతో రీమేక్ చేయాలని భావించినా, ప్రస్తుతం రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.

Aavesham, remade, Ravi Teja, Balakrishna


మలయాళంలో ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ‘ఆవేశం’ సినిమా పెద్ద హిట్ . దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చిందీ ఈ సినిమా. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ రంగ అనే ఓ రౌడీ పాత్రలో పవర్ ఫుల్ క్యారక్టర్ లో కనిపించాడు.

కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ కి హెల్ప్ చేసే కథతో యాక్షన్ కామెడీగా ఆవేశం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మళయాళంలోనే రిలీజ్ అయినా ఓటీటీలో తెలుగులో తప్పించి మళయాళ, తమిళ, కన్నడ,హిందీ అన్ని భాషల్లో రిలీజైంది. ఈ సినిమా రీమేక్ వెర్షన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఎవరు హీరోగా చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Aavesham, remade, Ravi Teja, Balakrishna


మొదట ఈ చిత్రాన్ని  బాల‌య్య ఆ ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నాడ‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగింది. కొన్ని నెల‌ల కింద‌ట ఫాహ‌ద్ ఫాజిల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ఆవేశం రీమేక్ లో బాల‌య్య న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వచ్చాయి. ఆవేశం సినిమా ఫాహ‌ద్ క్యారెక్ట‌రైజేష‌న్, పెర్ఫార్మెన్స్ మీదే న‌డిచింది.

ప్ర‌తీ హీరో కెరీర్ లో ఇలాంటి ఒక క్యారెక్ట‌ర్ చేయాల‌ని ఆశ‌ప‌డ‌తాడు. ఇప్పుడీ సినిమాను బాల‌య్య రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు చెప్పుకున్నారు. బాల‌య్య‌తో వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొని, బాల‌య్య‌తో రీమేక్ చేయాల‌ని ట్రై చేస్తున్నార‌ని, ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని అన్నారు. అయితే ఇప్పుడు ఆ చిత్రం రవితేజ చేతికి వచ్చినట్లు సమాచారం. 


Maruti Suzuki e-Vitara


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రీమేక్ రైట్స్ మాస్ మహారాజ్ రవితేజ  తీసుకుని రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు హరీష్ శంకర్ ని డైరక్టర్ గా ఎంచుకున్నారని వార్తలు వినపడుతున్నాయి. హరీష్ శంకర్ ...రీమేక్స్ చేయటంలో సిద్దహస్తుడు.

ఒరిజనల్ వాళ్లు కూడా వచ్చి హరీష్ శంకర్ రీమేక్ చేసిన సినిమా రైట్స్ మళ్లీ కొనుక్కుని రీమేక్ చేసుకోవాలనించే స్దాయిలో ఉంటుంది. గబ్బర్ సింగ్ , గద్దల కొండ గణేష్ తో హరీష్ శంకర్ ఆ పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా  హిందీ చిత్రం రైడ్ రీమేక్ మిస్టర్ బచ్చన్ తో మన ముందుకు వచ్చాడు. డైలాగ్స్ అయితే మామూలుగా రాయడు. బాలయ్య , హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. అందుకే ఓ వెర్షన్ రాసి రవితేజకు వినిపించబోతున్నారట.  అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.

kollam accident


 ఆవేశం కథ 

కథను సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పాలంటే ‘మంచి వాళ్లతో విరోధం కన్నా, చెడ్డవాళ్లతో స్నేహం ప్రమాదకరం’ అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు వచ్చిన నలుగురు కుర్రాళ్లు అజు (హిప్‌స్టర్‌), బిబి (మిథున్ జై శంకర్‌), శంతన్‌ (రోషన్‌ షానవాజ్‌) . వీళ్లు కాస్త అల్లరి టైప్. వీళ్లు కాలేజ్‌ హాస్టల్‌లో కన్నా బయట ఉంటే కాస్త స్వేచ్ఛగా ఉండవచ్చని బీకే హాస్టల్‌లో దిగుతారు. ఈ క్రమంలోనే సీనియర్లు అయిన కుట్టీ (మిధుట్టి), అతడి ప్రెండ్స్ ఈ ముగ్గురిని దారుణంగా ర్యాగింగ్‌ చేస్తూంటారు.

Tiruvannamalai


దీంతో తమ సీనియర్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని స్థానికంగా ఉండే లోకల్ ఉండే రౌడీలను కోసం వెతుకుతుంటే, గ్యాంగ్‌స్టర్‌ అయిన రంజిత్‌ గంగాధర్‌ అలియాస్‌ రంగా (ఫహద్‌ ఫాజిల్‌) తారసపడతాడు. రంగాది ఒక డిఫెరెంట్‌ క్యారెక్టర్‌. ప్రేమ, సంతోషం, కోపం ఏదైనా అతిగా ప్రదర్శిస్తాడు. ర్యాగింగ్‌ విషయం తెలిసి, ఆ సీనియర్స్‌కు బుద్ధి చెబుతాడు. అయితే, అప్పటి నుంచి అజు, బిబి, శంతనులపై రంగా మనుషులనే ముద్ర పడుతుంది. కాలేజీలోనూ వారి హవా కొనసాగుతుంది.

Tiruvannamalai


ఈ క్రమంలో చదువు పక్కకు వెళ్లిపోతుంది. అన్ని సబ్జెక్ట్‌ల్లోనూ ఫెయిల్ అవడంతో, కాలేజ్‌ డైరెక్టర్ పిలిచి ఆఖరి అవకాశం ఇస్తాడు. దీంతో ఎలాగైనా రంగా నుంచి దూరంగా వెళ్లిపోయి చదువుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ, రంగ వీళ్లను వదిలిపెట్టడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురూ తీసుకున్న నిర్ణయం ఏంటి? రంగా నుంచి ఎలా తప్పించుకున్నారు? తనని మోసం చేస్తున్నారని తెలిసిన రంగా వాళ్ళను ఏం చేసాడన్నదే కథ. 

read more: అభిషేక్-ఐశ్వర్య విడాకుల రూమర్స్: పాత వీడియో తవ్వి తీసి మరీ వైరల్ చేస్తున్న నటి

also read: 'జై హనుమాన్‌' లో రానా దగ్గుపాటి, ఏ పాత్రలో అంటే

Latest Videos

click me!