చిరంజీవిపై కసితో అన్నం మానేసిన బాలయ్య, చివరికి ఎన్బీకే డాన్స్ నే మెగాస్టార్‌ రీమిక్స్ చేసిన పరిస్థితి

First Published | Nov 5, 2024, 1:18 PM IST

చిరంజీవిపై కసితో బాలయ్య అన్నం మానేశాడట. కొన్నాళ్లపాటు ఎంతో హార్డ్ వర్క్ చేసి తానేంటో నిరూపించుకున్నారట. అయితే బాలయ్య పాటనే చిరు రీమిక్స్ చేయడం విశేషం. 
 

బాలకృష్ణ ఎంతటి అద్భుతమైన నటుడో అందరికి తెలిసిందే. ఆయన పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో అదరగొట్టడమే కాదు, యాక్షన్‌ తోనూ ఇరగదీస్తాడు. కామెడీ చేయడంలోనూ దిట్ట. ఇక సెంటిమెంట్లతో కన్నీళ్లు పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ ఓ ఎత్తైతే ఆయన డాన్సులు మరో ఎత్తు. ఇప్పుడు డాన్సులతోనూ ఇరగదీస్తున్నాడు బాలయ్య. అరవై ఏళ్లు దాటినా మంచి డాన్స్ నెంబర్లతో ఆకట్టుకుంటున్నాడు బాలయ్య. నిజం చెప్పాలంటే యంగ్‌ ఏజ్‌లో కంటే ఇప్పుడు ఆయన బాగా చేస్తున్నాడు, చిరంజీవికి పోటీ ఇస్తున్నాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

అయితే బాలయ్య డాన్స్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉందట. అందుకు ఎంతో అవమానాలు, ఫిజికల్‌ స్ట్రగుల్స్ ఉన్నాయట. అప్పట్లో చిరంజీవి డాన్సులకు పెట్టింది పేరు. ఆయన సినిమాల్లో డాన్సుల గురించే ఎక్కువ చర్చ జరిగేది. ఆ డాన్సులను చాలా మంది ఫాలో అయ్యేవారు. యూత్‌ అయితే ఊగిపోయి డాన్సులు చేసేది. అంతగా క్రేజీ చిరంజీవి డాన్సుల్లో ఉండేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ సమయంలో బాలయ్య సరిగా డాన్సులు చేసేవారు కాదు. దీంతో ఎంతో బాధపడేవారట. చిరంజీవిలా తాను చేయలేకపోతున్నానని ఎంతో మదనపడేవాళ్లట. పోటీలో తట్టుకోవాలంటే డాన్సులు నేర్చుకోవాల్సిందే అని ఫిక్స్ అయ్యారట. 


అయితే బాలకృష్ణ భోజన ప్రియులు. ఎన్టీరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో ఆయనకు సినిమా కష్టాలు పెద్దగా తెలియదు. దీంతో తనకు నచ్చినట్టు ఉన్నాడు. బాడీపై పట్టులేదు. కాస్త లావుగా ఉండేవాడు. పొట్ట కూడా ఉండేది. దీని కారణంగా డాన్సులు చేయడానికి ఇబ్బంది పడేవాడట. అలా కొన్నాళ్లు నెట్టుకొచ్చాడు. కానీ డాన్సుల విషయంలో తనకు ఏదో వెలితిగా ఉండేది. దీంతో తానే మారాలని నిర్ణయించుకున్నాడు. ఫుడ్‌ తగ్గించాడు. రోజుకి ఒక్కపూటనే భోజనం చేసేవాడట. జ్యూసులు తీసుకునేవాడట. 
 

అంతేకాదు వర్కౌట్స్ చేశారు. ఎక్సర్‌సైజ్‌లు, మెడిటేషన్‌ వంటివి చేసేవాదట. ఇలా నెమ్మదిగా తన బాడీపై కొంత పట్టు వచ్చింది. పొట్ట, బ్యాక్‌ తగ్గించుకుని డాన్సులు ప్రాక్టీస్‌ చేశాడట. అలా బెటర్‌ అయ్యారు. ఈ క్రమంలో ఆయన `సమరసింహారెడ్డి` సినిమాలో అదిరిపోయే డాన్సులు చేశారు. ముఖ్యంగా `అందాల ఆటబొమ్మ` పాటకి ఆయన డాన్సులు వేరే లెవల్‌. డాన్స్ విషయంలో అంతకు ముందే బాలయ్య వేరు, `సమరసింహారెడ్డి` తర్వాత బాలయ్య వేరు అనేలా చేశారు. ఇప్పటికీ అదరగొడుతున్నాడు. `అందాల ఆటబొమ్మ` పాటకి కాశ్మీర్‌లో హీరోయినతో ఆయన వేసిన స్టెప్పులు బాగా పేలాయి. ఆడియెన్స్ లో ఫ్యాన్స్ ఊగిపోయారు. ఆ డాన్సులు చూసి చిరంజీవి కూడా షాక్‌ అయ్యారట. కాస్త జెలసీగానూ ఫీలైనట్టు టాక్‌. 

దీంతో ఆ స్టెప్పులు బాగా నచ్చి తన సినిమాలో రీమిక్స్ చేశాడట చిరంజీవి. `అన్నయ్య` సినిమాలో సౌందర్యతో కాశ్మీర్‌లో అలాంటి డాన్సులనే కంపోజ్‌ చేయించుకున చేశారు. అయితే వాటికి తనదైన స్టయిల్‌లో కొంతబెటర్‌మెంట్‌ చేసి కంపోజ్‌ చేశారు. అందులో చిరంజీవి అదరగొట్టారు. ఆ పాట కూడా బాగా ట్రెండ్‌ అయ్యింది. సో అలా బాలయ్య తన డాన్సుల్లోమెరుగు అయ్యారు. ఇప్పుడు రచ్చ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ `ఎన్బీకే 109` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వశిష్ట దర్శకుడు. ఇది వచ్చే సమ్మర్‌కి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.  
 

read more: నాగచైతన్య పెళ్లికి కొత్త వేదిక.. దానికి భయపడే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడా?

also read: ఆ రీమేక్ బాలయ్యతో అనుకుంటే రవితేజ చేస్తున్నాడా?

Latest Videos

click me!