జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడిగా ఎదగడం అతని కష్టం, ప్రతిభ, పట్టుదలకు నిదర్శనం. ఈ రోజు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, కొత్తగా వచ్చే నటులకి స్ఫూర్తి. ప్రతిభ, పట్టుదల ఉంటే అడ్డంకులను అధిగమించి అద్భుతమైన విజయం సాధించవచ్చు అని నిరూపించిన నవాజుద్దీన్.. ఎంతో మందికి ఆదర్శం.