అట్లీపై మండిపడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్, బన్నీపై స్టార్ డైరెక్టర్ ప్రయోగం చేయబోతున్నాడా ?

పుష్ప2 తో భారీ హిట్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు. ఆతరువాత  అట్లీ సినిమాను ముందు స్టార్ట్ చేస్తాడా? లేక త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్న టైమ్ లో ఓ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. 

Allu Arjun Fans Upset Over Atlee Casting Choice  Will Priyanka Chopra Be The Leading Lady in telugu jms

Allu Arjun Fans Upset Over Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?  పుష్ప2 తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఐకాన్ స్టార్.  ఇక  పుష్ప3 ఇప్పట్లో లేనట్టే అని అర్ధం అయ్యింది. నిర్మాత చెప్పిన దాని ప్రకారం  ఓ మూడేళ్ళ తరువాతే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా అంచనామాత్రమే.

అయితే ఈలోపు త్రివిక్రమ్ తో పాటు అట్లీ ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. ముందుగా ఎవరి సినిమా చేస్తాడు అనేది ఇప్పటి వరకు తేలలేదు. ఈలోపు రకరకాల రూమర్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతు వస్తున్నాయి. 

Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?

సోషల్ మీడియా లో ఈసినిమా గురించి గడిచిన కొంత కాలం నుండి ఎన్నో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఉగాది షూటింగ్ స్టార్ట్ అవుతుందని, అట్లీ సినిమా ముందు స్టార్ట్ చేస్తాడని, ఈసినిమాలో  రజినీకాంత్, శివ కార్తికేయన్ లాంటి స్టార్స్ నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి.

కాని ఏ విషయాన్ని మూవీ టీమ్  అధికారికంగా ప్రకటించలేదు. అసలు సినిమా ఓపెనింగ్ జరగకుండానే ఇన్ని  రూమర్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం కన్పామ్.. అల్లు అర్జున్ ‘అట్లీ’, త్రివిక్రమ్ సినిమాల షూటింగ్స్ ని ఒకే సారి సమాంతరంగా చేసుకుంటూ వెళ్తాడనేది నిజం. 

Also Read: రాధిక అల్లుడు ఒక స్టార్ క్రికెటర్ అని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా స్టార్ ప్లేయర్ ?


Allu Arjun And Atlee Will Work Together On His Upcoming Movie in telugu

అయితే  త్రివిక్రమ్ సినిమాకంటే ముందుగా అట్లీ సినిమానే ముందుగా స్టార్ట్ కాబోతోంది. ఈలోపు ఈ సినిమాకు సబంధించిన మరో న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అట్లీపై కోపంగా ఉన్నారంట. ఇంతకీ  అసలు సంగతి ఏంటంటే..?  అట్లీ  సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ను తీసుకోవాలని చూస్తున్నాడట. ఈ విషయమే బన్నీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. ఐకాన్ స్టార్ పక్కన ప్రియాంక చోప్రా ఏంటి అని అభిమానులు మండిపడుతున్నారు.  

Also Read: 500 మంది ఫైటర్లు, 3,000 మంది ఆర్టిస్టులు, ఒక్క సీన్ కోసం కోట్లు ఖర్చుచేస్తున్న సినిమా ఏంటో తెలుసా?

అయితే  ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అల్లు అర్జున్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఈసినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. సీనియర్ గా జూనియర్ గా రెండు పాత్రల్లో బన్నీ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అందులో సీనియర్ క్యారెక్టర్ కు జోడీగా ప్రియాంకను తీసుకోవాలి అని అట్లీ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఐకాన్ స్టార్ జోడీగా ప్రియాంక బాగోదని ఫ్యాన్స్ అభిప్రాయం. 

Also Read: మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?

బన్నీ 40 ఏళ్లు వచ్చినా.. ఇంకా 20 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. కాని ప్రియాంక చోప్రా అల్లు అర్జున్ కంటే చాలా పెద్దదానిలా కనిపిస్తుంది అంటున్నారు. ఒక వేళ ఈజోడీని అట్లీ ఫిక్స్ చేస్తే.. సినిమాకే మోసం వస్తుందేమో అని అభిమానులు భయపడుతున్నారు. అందుకే అట్లీ మీద కాస్త కోపంగా ఉన్నారట అల్లు అర్జున్ ఫ్యాన్స్.

మరి నిజంగా అట్లీ అల్లు అర్జున్ కోసం ప్రియాంకను తీసుకువస్తాడా..? రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో బిజీగా ఉన్న గ్లోబల్ బ్యూటీ.. అల్లు అర్జున్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఈ కాంబో సెట్ అయితే స్క్రీన్ మీద ఎలా ఉంటుంది? చూడాలి మరి. 

Also Read: ఐశ్వర్య రాయ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా? షాక్ అవుతారు!

Also Read:పెళ్లైన 4 నెలలకు తమిళ హీరోతో జోడి కట్టబోతున్న శోభిత ధూళిపాళ

Latest Videos

vuukle one pixel image
click me!