కృష్ణ `దేవదాసు` ని చావు దెబ్బ కొట్టిన ఏఎన్నార్‌, ఏం చేశాడో తెలుసా? ఇంత కథ జరిగిందా?

Superstar Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన `దేవదాసు` మూవీ 1974లో విడుదలై పెద్దగా ఆడలేదు. మరి ఈ మూవీ ఫెయిల్యూర్‌కి కారణమేంటో తెలిపారు కృష్ణ. అసలేం జరిగిందో చెప్పారు. 
 

superstar krishna starrer devadasu movie flop he revealed reasons for failure in telugu arj
superstar krishna

Superstar Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన `దేవదాసు` మూవీ 1974లో విడుదలైంది. ఈ చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించడమే కాదు, ఇందులో కృష్ణకి జోడీగా కూడా ఆమెనే నటించింది. పద్మాలయా పిక్చర్స్ పతాకంపై కృష్ణనే నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఫెయిల్‌ అయ్యింది. ఆడియెన్స్ ని అలరించడంలో విఫలమయ్యింది. 

devadasu movies

కృష్ణ పోటీగా ఈ మూవీని ఏఎన్నార్‌ `దేవదాసు`కి పోటీగా రూపొందించారు. కాకపోతే 21ఏళ్ల తర్వాత ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఏఎన్నార్‌ `దేవదాసు` 1953లో వచ్చి పెద్ద విజయం సాధించింది. కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. మ్యూజికల్‌ పరంగా అప్పట్లో ఓ ఊపు ఊపేసింది.

ఆ మూవీలోని పాటలు అప్పట్లో ఎవర్‌ గ్రీన్‌. ఇప్పుడు విన్నా అలరించేలా ఉంటాయి. కృష్ణ `దేవదాసు` తీసే నాటికి కూడా ఆ మూవీ పాటలు మారుమోగాయంటే ఆ సినిమా ప్రభావం, పాటల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 


Devadasu Movie

ఈ నేపథ్యంలో కృష్ణ `దేవదాసు`లో పాటలు ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఆడియెన్స్ ఏఎన్నార్‌ `దేవదాసు` పాటలను మనసులోకి ఎక్కించుకున్నారు. దీంతో కృష్ణ `దేవదాసు` చిత్రంలోని పాటలు ఆడియెన్స్ కి ఎక్కలేదు. ఈ కారణంతోనే సినిమా ఫ్లాప్‌ అయ్యిందని తెలిపారు సూపర్‌ స్టార్‌ కృష్ణ. ఆయన చెబుతూ, ఏఎన్నార్‌ `దేవదాసు` మ్యూజికల్‌ బ్లాక్‌ బస్టర్‌.  

ఇరవై, ఇరవై ఐదు ఏళ్లుగా జనం ఆ పాటలను వింటున్నారు. కానీ మా సినిమాలోని పాటలు వచ్చి అప్పటికీ రెండు నెలలే. 25ఏళ్లు యువకుడితో మా రెండు నెలల పసిపాప పోటీపడినట్టు అయ్యింది. అలా సినిమా ఆడలేదు. కానీ నా `దేవదాసు` ఎప్పటికీ క్లాసికే అని తెలిపారు కృష్ణ. ఈటీవీకి ఇచ్చిన ఓల్డ్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. 
 

Devadasu Movie

ఇదిలా ఉంటే కృష్ణ `దేవదాసు` ఆడకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ మూవీ రిలీజ్‌ టైమ్‌లోనే ఏఎన్నార్‌ `దేవదాసు`ని కూడా రీ రిలీజ్‌ చేశారు. ముందే ఆ మూవీ థియేటర్లోకి వచ్చింది. దీంతో జనం అంతా ఆ సినిమాని చూశారట.

రెండు సినిమాల టైటిల్స్ సేమ్‌ కావడంతో, ఆడియెన్స్ కన్‌ఫ్యూజ్‌ అయ్యారని, తమ సినిమాని చూడాల్సిన వాళ్లు ఆ మూవీని చూశారని, ఆ రకంగా కూడా తమకు దెబ్బ పడిందని మరో ఇంటర్వ్యూలో కృష్ణ చెప్పారు. 
 

Super Star Krishna

మొత్తం సూపర్‌ స్టార్‌ కృష్ణని `దేవదాసు` రూపంలో దెబ్బకొట్టారు ఏఎన్నార్‌. ఆ సమయంలో కృష్ణకి, ఏఎన్నార్‌కి మధ్య కొన్ని మనస్పర్థాలు కూడా వచ్చాయి. స్టూడియో, షూటింగ్‌ల విషయంలోనూ చిన్న గొడవలు జరిగినట్టు టాక్‌. ఇవన్నీ సూపర్‌ స్టార్‌ కృష్ణ `దేవదాసు`పై ప్రభావం పడందని, సినిమా ఫెయిల్యూర్‌కి కారణమైందని అంటుంటారు. 

read  more: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?

also read: అట్లీపై మండిపడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్, బన్నీపై స్టార్ డైరెక్టర్ ప్రయోగం చేయబోతున్నాడా ?

Latest Videos

vuukle one pixel image
click me!