వార్ 2 vs కూలీ: 6వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రజనీకి షాకిచ్చిన ఎన్టీఆర్‌

Published : Aug 20, 2025, 11:11 AM IST

రజినీకాంత్ నటించిన `కూలీ`, ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్ నటించిన `వార్ 2` సినిమాల 6 రోజుల కలెక్షన్లు ఆసక్తికరంగా మారాయి. రజనీకి తారక్‌ పెద్ద షాకిచ్చారు. 

PREV
14
Coolie vs War 2 Box Office

2025లో `కూలీ`, `వార్ 2` సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఆగస్టు 14న రెండు సినిమాలు విడుదలయ్యాయి. `వార్ 2`లో ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్ కలిసి నటించారు. దీనికి దర్శకుడు అయాన్ ముఖర్జీ. `కూలీ`కి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా, రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, సౌబిన్‌ షాహిర్, శృతి హాసన్, ఉపేంద్ర నటించారు. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ భారీగానే వసూళ్లు రాబడుతున్నాయి. మరి ఆరో రోజు ఈ రెండు సినిమాలకు ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.

DID YOU KNOW ?
పెరిగిన వార్‌ 2 కలెక్షన్లు
ఆరో రోజు `కూలీ`, `వార్‌ 2` కలెక్షన్లు చూస్తే ఐదు రోజు కంటే `వార్‌ 2`కి రెండు కోట్లు పెరిగితే, `కూలీ`కి రెండు కోట్లు తగ్గాయి.
24
`కూలీ` ఆరో రోజు కలెక్షన్లు

`కూలీ` సినిమా మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.404 కోట్లు వసూలు చేసింది. 5వ రోజు రూ.18 కోట్లు, 6వ రోజు రూ.15 కోట్లు వసూలు చేసింది. ఇందులో తమిళంలో 5.50 కోట్లు, హిందీలో 2.54 కోట్లు, తెలుగులో 2.19 కోట్లు, కన్నడలో 13 లక్షలు వసూలు చేసింది. మొత్తం 6 రోజుల్లో రూ.437 కోట్లు వసూలు చేసింది.

34
`వార్‌ 2` ఆరు రోజుల కలెక్షన్లు

`వార్ 2` మొదటి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.275 కోట్లు వసూలు చేసింది. 5వ రోజు 11 కోట్లు, 6వ రోజు రూ.13 కోట్లు వసూలు చేసింది. ఇందులో భారత్‌లో 8.34 కోట్లు వసూలు చేసింది. హిందీలో 6.70 కోట్లు, తెలుగులో 1.53 కోట్లు, తమిళంలో 11 లక్షలు వసూలు చేసింది. ఆరు రోజుల్లో మొత్తం రూ.288 కోట్లు వసూలు చేసింది. ఇంకా 300 కోట్లు కూడా క్రాస్‌ చేయలేకపోయింది. కానీ టీమ్‌ మాత్రం మూడు వందల కోట్లు దాటినట్టు ప్రకటించడం గమనార్హం.

44
ఆరో రోజు `కూలీ` వర్సెస్‌ `వార్‌ 2`

6వ రోజు `కూలీ` రూ.15 కోట్లు, `వార్ 2` రూ.13 కోట్లు వసూలు చేశాయి. 5వ రోజుతో పోలిస్తే కూలీ రూ.2 కోట్లు తక్కువ, `వార్ 2` రూ. 2 కోట్లు ఎక్కువ వసూలు చేసింది. వార్ 2 బాక్సాఫీస్ వద్ద కూలీ కంటే బాగా రాణిస్తోంది. ఇదే కొనసాగితే `కూలీ`.. `జైలర్` వసూళ్లను దాటకపోవచ్చు. మరి `వార్ 2`.. `కూలీ`ని కలెక్షన్లలో మించిపోతుందో లేదో చూడాలి. ఈ సినిమాకి విదేశాల్లో మంచి ఆదరణ వస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories