ఫ్రెండ్‌తో సినిమా చూసి థియేటర్‌ బయట కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్.. జీవితాన్నే మార్చేసిన రోజది

Published : Aug 20, 2025, 09:20 AM ISTUpdated : Aug 20, 2025, 09:28 AM IST

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ తన మొదటి సినిమా `అపూర్వ రాగంగళ్‌` సినిమా చూసి ఆనందం తట్టుకోలేక థియేటర్‌ బయట ఫ్రెండ్‌ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

PREV
15
`కూలీ`తో సందడి చేస్తోన్న రజనీకాంత్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ఇప్పుడు ఇండియన్‌ టాప్‌ స్టార్స్ లో ఒకరు. కోలీవుడ్‌లో ఆయన్ని మించిన స్టార్‌ లేడని చెబితే అతిశయోక్తి కాదు. సరైన సినిమా పడాలే గానీ, ఆయన రేంజ్‌ ఏంటో చూపిస్తారు. కోలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీస్‌ ఆయనవే. `2.0`, `జైలర్‌`తో కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేశారు. ఇప్పుడు `కూలీ`తో థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. ఈ మూవీ వీకెండ్‌లో భారీ వసూళ్లని రాబట్టింది. వీక్‌ డేస్‌లో కాస్త జోరు తగ్గింది. అయితే ఇది సక్సెస్‌ దిశగా వెళ్తుందా అనేది చూడాలి.

DID YOU KNOW ?
మొదటి తెలుగు సినిమా
రజనీకాంత్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `చిలకమ్మా చెప్పింది` అనే చిత్రంలో నటించారు. ఎరంకి శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంగీత, శ్రీప్రియ హీరోయిన్లుగా నటించారు.
25
స్నేహితుడు రాజ్ బహదూర్‌ సపోర్ట్ తో సినిమాల్లోకి

ఈ క్రమంలో రజనీకాంత్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన కెరీర్‌ బిగినింగ్‌ డేస్‌కి సంబంధించిన విషయం ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. కర్నాటకలో జన్మించిన మరాఠి ఫ్యామిలీకి చెందిన రజనీకాంత్‌.. డిగ్రీ చదువుకున్నాక కూలీ పనులు చేశారు. ఆ తర్వాత బెంగుళూరు ఆర్టీసీలో బస్‌ కండక్టర్‌గా జాబ్‌ సాధించారు. అంతకు ముందే ఆయనకు నటనపై ఆసక్తి ఉంది. నాటకాలు కూడా వేశారు. రామకృష్ణ మఠ్ లో నాటకాలు ప్రదర్శించి మెప్పించారు. ఆయనలో ఉన్న నటనకి సంబంధించిన టాలెంట్‌ని గుర్తించి ఆర్టీసీ ఫ్రెండ్‌ రాజ్‌ బహదూర్‌ రజనీని ఎంకరేజ్‌ చేశారు. దీంతో మద్రాస్‌ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యాడు రజనీ. ఆ సమయంలో ఖర్చులన్నీ స్నేహితుడు రాజ్‌ బహదూర్‌ భరించాడు. మద్రాస్‌ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకుడు కె బాలచందర్‌ .. రజనీ టాలెంట్‌ని చూసి సినిమాల్లో ఎంకరేజ్‌ చేశారు. అంతేకాదు శివాజీ రావు గైక్వాడ్‌గా ఉన్న పేరుని రజనీకాంత్‌గా మార్చారు.

35
`అపూర్వ రాగంగళ్‌` సినిమాని థియేటర్లో చూసి కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్‌

మొదటగా బాలచందర్ దర్శకత్వం వహించిన `అపూర్వ రాగంగళ్‌` చిత్రంలో చిన్న పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇందులో కమల్‌ హాసన్‌ హీరో. శ్రీదివ్య, జయసుధ హీరోయిన్లుగా నటించారు. ఇందులో పాండియన్‌ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారు. ఆయన శ్రీదివ్య మాజీ భర్త. చిన్న పాత్రనే కానీ, ఆయనలో ఏదో ఉందని అప్పటి మీడియా సైతం ప్రత్యేకంగా కోట్‌ చేసింది. అయితే ఈ సినిమా 1975 ఆగస్ట్ 15న విడుదలైంది. మొదటిసారి రజనీకాంత్‌ బెంగుళూర్‌లోని `కపాలి` థియేటర్ లో స్నేహితుడు రాజ్‌ బహదూర్‌తో కలిసి సినిమా వీక్షించారు. మొదటిసారి వెండితెరపై తనని తాను చూసుకుని రజనీకాంత్‌ ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. థియేటర్‌ బయటకు వచ్చి ఫ్రెండ్‌ని పట్టుకుని బోరున ఏడ్చేశారు. తాను పడ్డ స్ట్రగుల్స్ అన్నీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ సంఘటన రజనీకాంత్‌ జీవితాన్నే మార్చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

45
రజనీకాంత్‌ సూపర్‌ స్టార్‌గా నిలబెట్టిన సినిమాలివే

నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ సక్సెస్‌ మాత్రం అంత ఈజీగా రాలేదు. ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. విలన్‌గా, సైడ్‌ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాడు. సెకండ్‌ లీడ్‌గానూ చేశారు. రజనీకాంత్‌కి ఫస్ట్ బ్రేక్ రావడానికి ఐదేళ్లు పట్టింది. దాదాపు 54 సినిమాలు చేశారు. 1980లో వచ్చిన `బిల్లా` చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ అందుకున్నారు. ఇక తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత అనేక విజయాలు సొంతం చేసుకుని తమిళ సూపర్‌ స్టార్‌గా ఎదిగారు రజనీకాంత్‌. `దళపతి`, `ముత్తు`, `బాషా`, `నరసింహ`, `శివాజీ`, `రోబో`, `2.0`, `జైలర్‌` చిత్రాలతో సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఈ ఏజ్‌లోనూ హీరోగా తన రేంజ్‌ ఏంటో చూపిస్తున్నారు.

55
డీలా పడ్డ `కూలీ` మూవీ

తాజాగా రజనీకాంత్‌ `కూలీ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున మొదటిసారి విలన్‌గా నటించారు. అలాగే ఉపేంద్ర, శృతి హాసన్‌, సత్యరాజ్‌, సౌబిన్‌ షాహిర్‌ కీలక పాత్రలు పోషించారు. అమీర్‌ ఖాన్‌ గెస్ట్ రోల్‌ చేశారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కానీ వీకెండ్‌లో భారీగా వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రం ఇప్పటి వరకు నాలుగు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories