చిరంజీవి తో భారీ పౌరాణిక సినిమా ప్లాన్ చేసిన నిర్మాత, వీర అర్జున టైటిల్, కానీ ఎందుకు సెట్స్ మీదకు వెళ్లలేదు

Published : Aug 20, 2025, 11:07 AM IST

చిరంజీవి భారతంలో అర్జునిడి పాత్ర చేస్తే ఎలా ఉంటుంది. మైథాలాజికల్ పాత్రలో మెగాస్టార్ ను చూడగలమా? చిరంజీవితో పక్కా పౌరాణిక సినిమా చేయాలని చూసిన స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? ఆ సినిమా ఎందుకు పట్టాలెక్కలేదు? 

PREV
14

టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, ఎంతో కష్టపడి మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు. తన టాలెంట్ ను మాత్రమే నమ్మకున్న చిరంజీవి, తాను ఏది చేయగలడో దాన్ని మాత్రమే మరింత పర్ఫెక్ట్ గా మార్చకున్నాడు. డాన్స్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, ఈ నాలుగు విషయాల్లో మెగాస్టార్ తనను తాను నిరూపించుకున్నాడు. ఇక డాన్స్ లో చిరంజీవి టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడని చెప్పుకోవచ్చు. తెలుగు పరిశ్రమకు మైఖేల్ జాక్సన్ స్టెప్పులను పరిచయం చేసింది మెగాస్టార్ చిరంజీవి. యాక్షన్ , కామెడీ సినిమాలు లతో పాటు తనకు అలవాటు లేని మైథలాజికల్ మూవీస్ కూడా ట్రై చేసి సాహసం చేశారు చిరు. కాని అది అవర్కౌట్ అవ్వలేదు.

DID YOU KNOW ?
శివుడిగా రెండు సార్లు
మెగాస్టార్ చిరంజీవి శివుడు గా రెండు సార్లు నటించారు. శ్రీ మంజునాథ సినిమా ఫుల్ లెన్త్ పాత్రలో పరమేశ్వరుడిగా కనిపించిన ఆయన, ఆపద్బాంధవుడు సినిమాలో ఓ పాటలో శంకరుడిగా కనిపించారు.
24

భక్తి సినిమాలో చిరంజీవి

శ్రీ మంజునాథ సినిమాలో శివుడి పాత్రలో కనిపించిన చిరంజీవిని ఆడియన్స్ ఆదరించలేదు. ఫ్యాన్స్ కు కూడా ఈ పాత్ర పెద్దగా నచ్చలేదు. తరువాత ఎప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయలేదు మెగాస్టార్. అయితే మెగాస్టార్ చిరంజీవితో భారీ మైథలాజికల్ మూవీని తెరకెక్కించాలని స్టార్ ప్రొడ్యూసర్ ఒకరు ప్రయత్నం చేశారట. చిరంజీవిని కృష్ణుడిగా, అర్జునిడిగా రెండు పాత్రల్లో చూపించి మెగా మైథలాజికల్ సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు. కాని అది కార్యరూపం దాల్చలేదు. ఇంతకీ ఆ ప్రయత్నం చేసిన బడా నిర్మాత ఎవరో కాదు టి. సుబ్బిరామిరెడ్డి.

34

సుబ్బిరామిరెడ్డి ప్రయత్నం

ఒకప్పుడు వ్యాపారవేత్తగా , సినిమా నిర్మాతగా, కళాబంధు బిరుదు కూడా పొందిన సుబ్బిరామిరెడ్డి.. స్టార్ హీరోలతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు, హిందీలో స్టార్ హీరోలతో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. మరీముఖ్యంగా టాలీవుడ్ లో చిరంజీవితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. చిరంజీవితో సుబ్బిరామి రెడ్డి ''స్టేట్ రౌడీ'' అనే సినిమాను కూడా నిర్మించారు. సుబ్బిరామిరెడ్డికి భక్తి చాలా ఎక్కువ, ఆయన ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో భక్తి కార్యక్రమాలు నిర్వహించేవారు. సంస్కృతంలో భగవద్గీత సినిమాను కూడా ఆయన నిర్మించారు. దానికిగాను నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు సుబ్బిరామిరెడ్డి. ఈక్రమంలోనే ఆయన చిరంజీవితో భారీ మైథలాజికల్ సినిమా చేయాలని అనుకున్నారట. కాని అది కార్యరూపం దాల్చలేదు. ఈ విషయాన్ని సీనియర్ సినిమా జర్నలిస్ట్ భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

44

మెగాస్టార్ బర్త్ డే ట్రీట్

ఇక ప్రస్తుతంచిరంజీవి వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్నారు. త్వరలో రెండు సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడు. యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లాడి దర్శకత్వంలో చిరు నటించిన విశ్వంభర సినిమా రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈసినిమా చేస్తూనే చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ కామెడీ మూవీని మొదలు పెట్టారు. ఈసినిమా షూటింగ్ కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక త్వరలో మెగాస్టార్ బర్త్ డే ఉండటంతో.. ఈసినిమా నుంచి భారీ అప్ డేట్ ను ప్లాన్ చేశాడట అనిల్. అగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా అనిల్ రావిపూడి సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు స్పెషల్ గ్లింప్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories