నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. దాసరి కిరణ్ ఎవరు ? ఆయన ఎలాంటి చిత్రాలు నిర్మించారు ? ఎందుకు అరెస్ట్ అయ్యారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. గత ఏడాది ఎన్నికలకి ముందు దాసరి కిరణ్ వ్యూహం చిత్రాన్ని నిర్మించి రిలీజ్ చేశారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. వైఎస్ జగన్ పొలిటికల్ జర్నీ ఆధారంగా ఆర్జీవీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలో పాత్రలు వైఎస్ జగన్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లని పోలినట్లుగా ఉంటాయి. జగన్ ని హైలైట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రంపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది.
25
ఆర్థిక వ్యవహారంలో కేసు
ఆ విధంగా దాసరి కిరణ్ కూడా వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా బుధవారం రోజు ఏపీ పోలీసులు దాసరి కిరణ్ ఒక ఒక ఆర్థిక వివాదం కేసులో అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది అనేది వివరాల్లో తెలుసుకుందాం. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో దాసరి కిరణ్ బంధువు గాజుల మహేష్ అనే వ్యక్తి ఉంటున్నారు. ఆయన హైదరాబాద్ లో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు.
35
భార్య భర్తలపై దాడి
రెండేళ్ల క్రితం దాసరి కిరణ్.. గాజుల మహేష్ వద్ద 4.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అప్పు గడువు ముగిసింది. తన డబ్బు తిరిగి ఇవ్వాలని మహేష్ ఎన్నిసార్లు అడిగినా దాసరి కిరణ్ స్పందించలేదు. దీనితో గాజుల మహేష్ కొన్నిరోజుల క్రితమే ఆగష్టు 18న తన భార్యతో కలిసి విజయవాడలోని దాసరి కిరణ్ కార్యాలయానికి వెళ్లారు. తమ డబ్బు తిరిగి చెల్లించాలని నిలదీశారు. కానీ దాసరి కిరణ్ అనుచరులు తిరిగి మహేష్, అతడి భార్యపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
దీనితో మహేష్ దంపతులు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో దాసరి కిరణ్ పై ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. దీనితో పోలీసులు బుధవారం రోజు దాసరి కిరణ్ ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దీనితో దాసరి కిరణ్ గురించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యూహం మూవీ రిలీజ్ సమయంలో నెలకొన్న వివాదం గురించి దాసరి కిరణ్ స్పందిస్తూ.. 100 మంది లోకేష్ లు వచ్చినా ఈ చిత్రాన్ని అడ్డుకోలేరు అనే స్టేట్మెంట్ ఇచ్చారు.
55
దాసరి కిరణ్ నిర్మించిన చిత్రాలు
రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కొన్ని చిత్రాలు నిర్మించారు. గతంలోనే వంగవీటి అనే పొలిటికల్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత మొగలిరేకులు సాగర్ హీరోగా సిద్ధార్థ్ అనే చిత్రాన్ని దాసరి కిరణ్ నిర్మించారు. గత ఏడాది తెరకెక్కించిన వ్యూహం చిత్రం బాగా వార్తల్లో నిలిచింది. దాసరి కిరణ్ వైఎస్ జగన్ అనుచరుడు అంటూ ప్రచారం ఉంది. వైసీపీ హయాంలో దాసరి కిరణ్ టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా పనిచేశారు.