కదా మల్లిక అని జానకి అడగగా అదేం లేదమ్మా పేరుకి పెద్ద షాప్ అయినా కానీ దాంతో రూపాయి కూడా ఆదాయం లేదు. ఇప్పుడు అసలు ఆ షాపే లేదు అని అంటుంది మల్లిక. అప్పుడు జ్ఞానాంబ బయటకు వచ్చి షాపు లేకపోవడం ఏంటి అని అడగడంతో మల్లిక విష్ణు టెన్షన్ పడుతూ ఉంటారు. విష్ణు నిన్నే అడిగేది షాపు లేకపోవడం ఏంటి అనడంతో విష్ణు తడబడుతూ ఉంటాడు. అప్పుడు విష్ణు షాపు లేదు అనడంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. షాప్ లో బిజినెస్ సరిగా జరగకపోవడంతో బిజినెస్ ని మరింత పెంచుకోవడం కోసం మా ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి ఆ షాప్ ని బాగు చేయించాను. అయినా కూడా బిజినెస్ సరిగా అవ్వలేదు దాంతో షాప్ ని మా ఫ్రెండ్ కి అప్పగించాల్సి వచ్చింది అనడంతో గోవిందరాజులు జ్ఞానాంబ, జానకి షాక్ అవుతారు.