‘బిగ్ బాస్ తెలుగు’తో టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ. ప్రస్తుతం ఆయా షోలతోనూ బుల్లితెరపై సందడి చేస్తూ వస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ రచ్చ షురూ చేసింది.
ఆర్జీవీ ఇంటర్వ్యూతో యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారిన అరియానా ఆ వెంటనే కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 4తో హౌజ్ లో సందడి చేసింది.
అలాగే ఓటీటీ ప్రసారం అయిన Bigg Boss Telugu ఐదో సీ.జన్ లోనూ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. మరోవైపు ఆ షోకు సంబంధించిన అప్డేట్స్ ను ‘బీబీ కెఫే’తో ఎప్పటికప్పుడు ఆడియెన్స్ కు అందిస్తూ ఆకట్టుకుంది.
ప్రస్తుతం ‘బీబీ జోడీ’ షోలో సందడి చేస్తోంది. తన అందంతో అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ గ్లామర్ విందు చేస్తోంది.
నెట్టింట క్రేజ్ దక్కించుకోవడమే లక్ష్యంగా బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతోంది. మరోవైపు ట్రెండీ అవుట్ ఫిట్లలో మతులు పోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తోంది. లేత అందాలను ఆరబోస్తూ ఇంటర్నెట్ లో రచ్చరచ్చ చేస్తోంది.
తాజాగా నెమలి కనుల ప్రింటెండ్ లెహంగా, బ్లాక్ టాప్ లో దర్శనమిచ్చింది. ఈ డ్రెస్ లో అరియానా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పీకాక్ డ్రెస్ లో మరింతగా మెరిసిపోతుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లైక్స్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.