Janaki Kalaganaledu: మళ్లీ అత్తను మోసం చేసిన మల్లిక.. జానకిని చూసి ఎమోషనల్ అవుతున్న జ్ఞానాంబ!

Published : Jul 14, 2022, 02:27 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఉంటుంది. మంచి కుటుంబ కథతో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు జులై 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
18
Janaki Kalaganaledu: మళ్లీ అత్తను మోసం చేసిన మల్లిక.. జానకిని చూసి ఎమోషనల్ అవుతున్న జ్ఞానాంబ!

ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానంబ గుడి నుండి ఇంటికి రాగానే నేరుగా జానకి (Janaki) గది దగ్గరికి వెళుతుంది. ఇక తలుపు కొట్టడంతో జానకి తమకు ఆ కార్యం జరగకున్నా జరిగింది అన్నట్లుగా బొట్టు, జుట్టు చెరుపుకొని జ్ఞానంబ (Jnanamba) ముందు నిలబడుతుంది.
 

28

అది చూసి జ్ఞానంబ (Jnanamba) ముఖంలో సంతోషం కనిపించగా జానకి (Janaki) ని పక్కకు తీసుకెళ్లి ఒక అమ్మ కూతురుని అడిగినట్లుగా నేను అడుగుతున్నాను.. అంత మంచే జరిగింది కదా అని ఉంటుంది. త్వరలోనే నీకు కడుపు పండాలనుకుంటున్నాను..
 

38

నేను పాయసం చేసుకుని వస్తాను రెడీ అవ్వమని అంటుంది. ఇక మల్లిక (Mallika) ఒక పక్కన ఉండి వీరి మాటలు వినడంతో జానకి కి శోభనం జరిగింది అని తెగ కంగారుపడుతుంది. ఇక మల్లిక కూడా తనకు ఆ కార్యం జరిగినట్లుగా లుక్ మారుస్తూ జ్ఞానంబ (Jnanamba) ముందు నిలబడుతుంది.
 

48

ఆ తర్వాత తన మనసులో జానకి (Janaki) కంటే మొదట నేనే వారసులను ఇస్తాను అని అనుకుంటుంది. ఇక జానకి తన గదిలోకి వెళ్ళగా రామ (Rama) కంగారుగా కనిపిస్తాడు. తన అవతారం చూసుకొని  అంత ఏదో జరిగిపోయింది అని భయపడుతుంటాడు.
 

58

ఇక జానకి రామ (Rama) భయాన్ని మరింత ఆటపట్టిస్తూ ఉంటుంది. ఇక రామ ఏం జరిగింది అని.. నాకేం గుర్తుకులేదు అని అనడంతో జానకి (Janaki) మాత్రం ఏం చెప్పకుండా బాగా ఆటపటిస్తుంది. ఆ సమయం లో అక్కడ బాగా కామెడీ గా ఉంటుంది. 
 

68

ఆ తర్వాత జ్ఞానంబ (Jnanamba) పాయసం చేసుకొని వస్తుంది. అందరికీ ప్రేమగా పెడుతుంది. పైగా వారితో బాగా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ సమయంలో రామ జానకి (Janaki) వైపు చూసి మీ ఐపీఎస్ కల నెరవేర్చాలని ప్రయత్నిస్తున్నాను అంటూ..
 

78

మీ చదువుకు అడ్డంకులు రాకుండా చూసుకుంటాను అని అనుకుంటాడు. మల్లిక (Mallika) మాత్రం జానకి కంటే ముందుగా పిల్లలను కనాలని అనుకుంటుంది. ఆ తరువాత జ్ఞానంబ (Jnanamba) దేవుళ్ళ ముందు నిలబడి ఈ ఇంటికి వారసులు రావాలని వేడుకుంటుంది.
 

88

అదే సమయంలో గోవిందా రాజులు రావడంతో కార్యం జరిగింది అని సంతోషంగా చెబుతుంది. ఇక మల్లిక (Mallika) కంటే ముందు జానకి కి కడుపు పండాలని లేదంటే ఊర్లో వారి మాటలకు తాను బాధ పడుతుందని అంటుంది. ఇక ఆ మాటలు జానకి (Janaki) వింటూ ఎమోషనల్ అవుతుంది.

click me!

Recommended Stories