Hyper Aadi: బెడ్ పై ఆమెతో హైపర్ ఆది రొమాన్స్.. ఫస్ట్ నైట్ గదిలా మార్చేశారుగా..

Published : Jul 14, 2022, 01:50 PM ISTUpdated : Jul 14, 2022, 02:00 PM IST

ఓ ఛానల్ లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా బాగా పాపులర్ అయింది. ఈ షోలో హైపర్ ఆది, రాంప్రసాద్, నూకరాజు, ఇమ్మాన్యూల్ లు హాస్యంతో నవ్విస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో కాన్సెప్ట్ తో బుల్లితెర కమెడియన్లు ముందుకు వస్తున్నారు. 

PREV
16
Hyper Aadi: బెడ్ పై ఆమెతో హైపర్ ఆది రొమాన్స్.. ఫస్ట్ నైట్ గదిలా మార్చేశారుగా..

ఓ ఛానల్ లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా బాగా పాపులర్ అయింది. ఈ షోలో హైపర్ ఆది, రాంప్రసాద్, నూకరాజు, ఇమ్మాన్యూల్ లు హాస్యంతో నవ్విస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో కాన్సెప్ట్ తో బుల్లితెర కమెడియన్లు ముందుకు వస్తున్నారు. 

26

ఈ సారి రొమాంటిక్ కాన్సెప్ట్ ఎంచుకున్నారు. త్వరలో ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది. ఈ ఎపిసోడ్ లో టివి సీరియల్స్ నటీనటులు కూడా పాల్గొంటున్నారు. మొదట బుల్లితెర జంటలు 'దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని' అనే సాంగ్ కి హై డోస్ రొమాన్స్ తో డ్యాన్స్ చేస్తారు. 

 

 

36

అనంతరం అదే డ్యాన్స్ కి శ్రీదేవి డ్రామా కంపెనీ జంటలు విభిన్నంగా రొమాన్స్ చేస్తారు. బ్యాగ్రౌండ్ లో ఆ సాంగ్ ప్లే అవుతుండగా.. ఫస్ట్ నైట్ కి సిద్ధం చేసిన బెడ్ ఉంటుంది. మొదట హైపర్ ఆది రంగంలోకి దిగుతాడు. ఓ నటితో అతడు బెడ్ పై రొమాన్స్ చేసేందుకు ప్రయాత్నిస్తాడు. కానీ ఆమె ఆదిని ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది. ఆ నటి ఎవరనేది ప్రోమోలో సరిగా చూపించలేదు. 

46

ఆ తర్వాత జబర్దస్త్ నటి ఫైమా, పటాస్ ప్రవీణ్ పెళ్లి బట్టల్లో బెడ్ పైకి వస్తారు. వీళ్లిద్దరి రొమాన్స్ చూడముచ్చటగా ఉంటుంది. రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ లవ్ లో ఉన్నారు కాబట్టి బాగా రొమాన్స్ పండించారు. 

56

ఇక మరో విశేషం ఏంటంటే ఈ షోకి నటి ప్రగతి, సీనియర్ హీరోయిన్ సంఘవి అతిథులుగా హాజరయ్యారు. సంఘవితో హైపర్ ఆది సరదాగా సెటైర్లు వేసే ప్రయత్నం చేశాడు. సంఘవి పథ సాంగ్ ని గుర్తు చేస్తూ.. మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటుంది అని హైపర్ ఆది అంటాడు. బాగానే ఉంటుంది కానీ మీకు రెండు ఇస్తే ఇంకా బావుంటుంది అని కౌంటర్ వేస్తుంది. 

66

ఇక ఫైమాకి పటాస్ ప్రవీణ్ వేదికపైనే రింగ్ పెడతాడు. ఫైమా వాళ్ళ అమ్మగారి కల నెరవేర్చేందుకు, సొంత ఇల్లు కట్టుకునేందుకు కష్టపడుతోంది అని ప్రవీణ్ అంటాడు. అందుకే తనకి ఫైమా అంటే ఇష్టం అని చెబుతాడు. ఇక బులెట్ భాస్కర్ కామెడీ కూడా బావుంది. పూర్తి ఎపిసోడ్ ఆదివారం రోజు ప్రసారం కానుంది. 

click me!

Recommended Stories