జబర్దస్త్ వేదిక ద్వారా ఫేమ్ తెచ్చుకున్న అనేక మంది నటులు, కమెడియన్స్ కి వెండితెర అవకాశాలు వచ్చాయి. సుధీర్, గెటప్ శ్రీను, మహేష్, రచ్చ రవి, రాంప్రసాద్, హైపర్ ఆది, అప్పారావు, చమ్మక్ చంద్ర లాంటి చాలా మంది కమెడియన్స్ సినిమాల్లో విరివిగా అవకాశాలు పొందుతున్నారు.
ఇక జబర్దస్త్(Jabardasth) షోతో పాపులారిటీ తెచ్చుకున్న లేడీ కమెడియన్లో సత్యశ్రీ ఒకరు. సత్యగా పేరుగాంచిన ఈ లేడీ కమెడియన్ చమ్మక్ చంద్ర టీమ్ లో చేసేవారు. సాధారణంగా జబర్దస్త్ లో అబ్బాయిలే లేడీ క్యారెక్టర్స్ చేసేవారు. ఎక్కువగా భార్యాభర్తల డ్రామాపై స్కిట్స్ చేసే చమ్మక్ చంద్ర సత్యశ్రీని తెచ్చుకున్నారు. ఆమె చమ్మక్ చంద్ర భార్య పాత్రలు చేసేవారు.
27
Jabardasth satyasri comments over Pawan kalyan
2019లో నాగబాబు(Nagababu)తో పాటు చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుండి వెళ్లిపోవడం జరిగింది. తన గురువు చమ్మక్ చంద్రతో పాటు సత్యశ్రీ కూడా జబర్దస్త్ వీడారు. చమ్మక్ చంద్ర నాకు గురువు లాంటి వారు, ఆయనే నన్ను జబర్దస్త్ కి తీసుకొచ్చారు. ఆయన వెళ్లిపోవడంతో నేను కూడా బయటికి వచ్చేశానని సత్యశ్రీ చెప్పుకొచ్చారు.
37
Jabardasth satyasri comments over Pawan kalyan
తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో జరిగిన ఓ సంఘటన గురించి బయటపెట్టారు. సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీలో కొన్ని సీన్స్ లో నటించడం ఇష్టం లేక చేయనని చెప్పేశారట. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిపించి అడిగారని సత్యశ్రీ తెలియజేశారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తన గురించి బయటపెట్టారు.
47
Jabardasth satyasri comments over Pawan kalyan
సత్యశ్రీ మాట్లాడుతూ.. గబ్బర్ సింగ్ మూవీలో నేను నటిస్తున్నాను. అయితే కొన్ని సీన్స్ లో నటించడం నాకు ఇబ్బందిగా అనిపించింది. నేను చేయనని సెట్స్ నుండి వెళ్లిపోయాను. తర్వాత పవన్ నన్ను ఇంటికి పిలిపించారు. ఆయన కబురు చేశారని తెలిసి వెళ్ళాను.
57
Jabardasth satyasri comments over Pawan kalyan
నీ పేరేంటి? అన్నారు. సత్యశ్రీ అని చెప్పాను. ఏ ఊరు? అన్నారు. తణుకు అన్నాను. ఏంటీ సినిమాలో చేయను అన్నావట? అని అడిగారు... అవును సర్, నాకు ఆ సీన్స్ లో నటించడం కొంచెం ఇబ్బంది అనిపించింది అన్నాను. పెద్దగా నవ్వేసి, ఓకె అందులో తప్పేముంది నీ ఇష్టం అని అన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఫొటోగ్రాఫ్ అడిగితే కాదనకుండా ఇచ్చారు. అందుకే ఆయనంటే నాకు చాల ఇష్టం... అంటూ సత్యశ్రీ చెప్పుకొచ్చింది.
67
Jabardasth satyasri comments over Pawan kalyan
జబర్దస్త్ వీడాక సత్యశ్రీ పెద్దగా కనిపించడం లేదు. బుల్లితెర ఈవెంట్స్ లో ఆమె సందడి తగ్గింది. ఇక సత్యశ్రీ గురువు చమ్మక్ చంద్ర మాత్రం కామెడీ స్టార్స్ ప్రోగ్రాం లో స్కిట్స్ చేస్తున్నారు. ఇటీవల నాగబాబు సైతం కామెడీ స్టార్స్ జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ కి పోటీగా స్టార్ మాలో ఈ కామెడీ షో స్టార్ట్ చేయడం జరిగింది.
77
గతంలో జబర్దస్త్ లో పని చేసిన కమెడియన్స్ మొత్తం కామెడీ స్టార్స్ లో చేస్తున్నారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ ని వీడినప్పటికీ కామెడీ స్టార్స్ కి వెళ్ళలేదు. సినిమాల్లో బిజీ అయిన ఈ స్టార్ కమెడియన్స్ బుల్లితెర షోస్ ని పట్టించుకోవడం లేదు. గెటప్ శ్రీను పూర్తిగా టెలివిజన్ షోస్ ని వదిలేశారు. సుడిగాలి సుధీర్ యాంకర్ గా, నటుడిగా కొనసాగుతున్నారు.