ఒంటిపై 119 కుట్లు, డూప్ లేకుండా స్టంట్స్ చేసే ఏకైక హీరో ఎవరో తెలుసా?

Published : Oct 18, 2025, 04:44 PM IST

ఏ హీరో అయినా తన అభిమానులను అలరించడానికి ఎంతో కష్టపతాడు. కానీ ప్రాణాల మీదకు తెచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం రిస్క్ తీసుకోరు, వాటి కోసం ప్రత్యేకంగా డూప్ లు ఉంటారు. అయితే అలాంటి ప్రాణాంతకమైన స్టంట్స్ ను చేసి గాయాలపాలు అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

PREV
17
సినిమా షూటింగ్స్ లో సాహసాలు

సినిమాల్లో హీరోలు ఫైటింగ్ చేస్తే ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఆ ఫైటింగ్స్ వెనుక వారు ఎంత కష్టపడతారు అనేది మాత్రం చాలామందికి తెలియదు. అయితే సాధారణంగా .. యాక్షన్ సీక్వెన్స్ లలో పైటింగ్ సీన్స్ కు హీరోలు రిస్క్ చేయరు. స్టంట్ మెన్స్ డూప్ గా కొన్ని యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. కానీ కొంత మంది హీరోలు మాత్రం యాక్షన్స్ సీన్ విషయంలో డూప్ లేకుండా రిస్క్ చేస్తుంటారు. అలాంటి హీరోలలో విశాల్ ముందు వరసలో ఉన్నాడు. డూప్ తో పనిలేకుండా ఎటువంటి యాక్షన్ సీన్ అయినా చేయడానికి రెడీగా ఉంటాడు విశాల్.

27
యాక్షన్ హీరో విశాల్

యాక్షన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు హీరో విశాల్. యాక్షన్ సీన్స్ ను డూప్ తో చేయించకుండా తాను స్వయంగా చేసి, ఎన్నోప్రమాదాలకు గురయ్యారు. కొన్ని రిస్క్ స్టంట్స్ చేయడం వల్ల విశాల్ ప్రాణాలకు కూడాప్రమాదం తెచ్చుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తన ఆరోగ్యం గురించి రిసెంట్ గా విశాల్ చేసిన కామెంట్స్ ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను ఎన్ని ప్రమాదాలకు గురయ్యారు అనే విషయాలను వివరించారు విశాల్.

37
విశాల్ శరీరంలో 119 కుట్లు

త్వరలోనే ప్రారంభం కానున్న తన పాడ్‌కాస్ట్ ‘యువర్స్ ఫ్రాంక్లీ విశాల్’కు సంబంధించిన ప్రోమోను రీసెంట్ గా రిలీజ్ చేశారు విశాల్. ఈ ప్రోమోలో ఆయన మాట్లాడుతూ, “ఇప్పటివరకు నేను సినిమాల్లో డూప్‌ను ఉపయోగించలేదు. నా శరీరంలో దాదాపు 119 కుట్లు ఉన్నాయి, అయినా సరే యాక్షన్ సీన్స్ విషయంలో డూప్ ను ఉపయోగించడం నాకు నచ్చదు ” అని పేర్కొన్నారు. విశాల్‌కి సినిమాల విషయంలో ఉన్న అంకితభావం ఈ కామెంట్స్ ద్వారా ఆడియన్స్ కు అర్ధం అవుతోంది.

47
ఫిల్మ్ ఇండస్ట్రీలో విశాల్ ప్రయాణం

2004 సెప్టెంబర్ 10న విడుదలైన ‘చెల్లమే’ సినిమా ద్వారా విశాల్ హీరోగా తేరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఒక్కో మెంట్టు ఎక్కుతూ, స్టార్ హీరోగా, నిర్మాతగా తమిళ ఇండస్ట్రీలో వెలుగు వెలిగారు. అటు తమిళంలో పాటు ఇటు తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించాడు విశాలు. దాదాపు 21 ఏళ్ళుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు విశాల్. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్.

57
ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 21 ఏళ్లు అవుతోన్న సందర్భంగా విశాలో ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఆ ప్రకటనలో విశాల్ తన తల్లిదండ్రులకు, గురువు యాక్షన్ కింగ్ అర్జున్ కి, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులతో పాటు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “మీరు చూపిన ప్రేమ, నన్ను నడిపించిన శక్తి. మీరు లేకుండా నేను ఉండే వాడిని కాదు,” అంటూ ఎమోషనల్ గా స్పందించారు విశాల్.

67
48 ఏళ్ళ వయసులో పెళ్లి

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగు వెలిగిన విశాల్ వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాలు కూడా ఫేస్ చేశాడు. ఇక రెండు సార్లు పెళ్లి కాన్సిల్ అవ్వడంతో విశాల్ ఇక పెళ్లి చేసుకోరేమో అనుకున్నారంతా.. కానీ తమిళ నటీనటుల సంఘానికి భవనం నిర్మించిన తరువాతే పెళ్లి చేసుకుంటాను అని ప్రకటన చేశారు విశాల్. ప్రస్తుతం 48 ఏళ్ల వయస్సులో విశాల్ కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. త్వరలో నటి సాయి ధన్షికను వివాహం చేసుకోనున్నారు. ఈ జంటకు రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది.

77
యువర్స్ ఫ్రాంక్లీ విశాల్

ఇక మరోవైపు, ‘యువర్స్ ఫ్రాంక్లీ విశాల్’ అనే టైటిల్‌తో ఆయన ప్రారంభించనున్న పాడ్‌కాస్ట్‌ గురించి ఆడియన్స్ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు . ఈ షో ద్వారా ఆయన తన వ్యక్తిగత, వృత్తిపర అనుభవాలను, ఇన్‌సైడర్ విషయాలను అభిమానులతో పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం త్వరలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. సినిమాల్లో తనకున్న అంకితభావాన్ని, నిజ జీవితంలో చూపిన ధైర్యాన్ని ఈ పాడ్‌కాస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేయబోతున్నరు విశాల్.

Read more Photos on
click me!

Recommended Stories