
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఆరుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఇద్దరు సెన్సేషనల్ కంటెస్టెంట్లు ఉన్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష సోషల్ మీడియాలో ఎంతగా పాపులర్ అయ్యారో తెలిసిందే. దీంతో ఇకపై హౌజ్‌లో రచ్చ వేరేలా ఉంటుందని భావించారు. అయితే ఎంట్రీతోనే మాధురి రచ్చ షురూ చేసింది. హౌజ్‌లో ఎవరు ఎలా ఉంటున్నారో నిర్మొహమాటంగా చెప్పింది. అదే సమయంలో ఏదైనా విషయంపై గట్టిగా మాట్లాడుతూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది.
ఈ క్రమంలో ఆమె కొన్ని పొరపాట్లు కూడా చేసింది. ఆవేశంలోనో, హడావుడి చేయాలనుకోవడమోగానీ హౌజ్‌లోకి వచ్చిన మొదటి రోజే కెప్టెన్ కళ్యాణ్‌తో గొడవకు దిగింది మాధురి. హౌజ్‌లో కిచెన్‌కి సంబంధించిన పనులను కళ్యాణ్ వివరణ ఇస్తున్నాడు. ఈ క్రమంలో కాస్త సీరియస్ రియాక్ట్ అయ్యింది మాధురి. ఎటకారాన్ని వ్యక్తం చేసింది. ఇందులో కళ్యాణ్ `రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదు` అని చెప్పగా, `నేను అక్కడకు వచ్చి అరగంట కూర్చున్నాను, అప్పుడు ఏం చేశారు మీరు, లేటవుతుందని తెలియదా మీకు` అని ఘాటుగా రియాక్ట్ అయ్యింది. దీంతో `మీరిలా మాట్లాడితే, నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది` అని కళ్యాణ్ అన్నాడు. దీనికి మాధురీ `మాట్లాడండీ` అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది.
ఇదే విషయాన్ని శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ప్రశ్నించాడు. మాధురిని నిలదీశాడు. ఇందులో తప్పువెరిది అని సుమన్ శెట్టిని అడగ్గా, మాధురిదే అని స్పష్టం చేశాడు. దీనికి నాగ్ రియాక్ట్ అవుతూ మాట్లాడిన విషయంలో తప్పులేదు, మాట్లాడిన తీరు లో తప్పు ఉందన్నాడు. `సర్ నా వాయిసే అలా ఉంటుంది` అని మాధురి అనగా, `ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావ్ గా` అని నాగార్జున కౌంటర్ ఇవ్వడం విశేషం. దీంతో మాధురికి మతిపోయింది. మాట తీరే మిమ్మల్ని అందంలోకి ఎక్కిస్తుందని నాగ్ చెప్పడం విశేషం.
ఇంతటితో వదల్లేదు నాగార్జున. ఆమెకి కిరీటం ఇచ్చి ఆ పవర్‌కి ఆమె అర్హురాలా? కాదా? అనేది తేల్చే పనిలో పడ్డారు. ఆడియెన్స్ ఓటింగ్‌కి వెళ్లారు. ఇందులో అరవై శాతం మాధురితో వ్యతిరేకించారు. ఆమె పవర్ అస్త్రకి అర్హురాలు కాదని తేల్చారు. నలభై శాతం మంది మాత్రమే అర్హురాలుగా తెలిపారు. దీంతో ఈ పవర్‌కి అర్హురాలు కాదని చెప్పి ఆమె షీల్డ్ లో ఉన్న పవర్‌ని తీసేశారు.
మరోవైపు ఇతర పవర్ అస్త్ర కలిగిన వారి నిగ్గు తేల్చారు. ఆయేషా వద్ద ఉన్న నామినేషన్ పవర్‌పై ఓపీనియన్ తీసుకోగా, దానికి ఆమె అర్హురాలే అని తనూజ వెల్లడించింది. తనకు పోటీగా వచ్చినా అందులో తప్పులేదని తనూజ చెప్పడం విశేషం. మరోవైపు రీతూ చౌదరీ కూడా ఓకే చెప్పింది. ఆయేషా వద్ద ఆ పవర్ ఉన్నా, తనకు ఎలాంటి సమస్య లేదని, అందుకే ఆమె అర్హురాలు అని చెప్పింది రీతూ. ఇలాంటి వారికి డైరెక్ట్ నామినేషన్ చేసే పవర్ అవసరం లేదని చెప్పింది. దీనిపై వాదనలు జరగడం విశేషం. లేటెస్ట్ గా విడుదలైన శనివారం ఎపిసోడ్ ప్రోమో ఆకట్టుకుంది.
అంతటితో ఆగలేదు, శనివారం ఎపిసోడ్‌లో ఒక్కొక్కిరి బండారం బయటపెట్టాడు. అందులో భాగంగా ఇమ్మాన్యుయెల్‌ని పగిలిపోతుందంటూ వార్నింగ్ ఇచ్చాడు. మరి దీంతో ఇమ్మూ షాక్ అయ్యాడు. మరి ఇంతకి ఇమ్మాన్యుయెల్ చేసిన తప్పేంటి? ఎందుకు అలా అన్నాడనేది ఈ రోజు ఎపిసోడ్‌లో తేలనుంది. వీరితోపాటు వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన రమ్య మోక్ష, నిఖిల్ నాయర్, శ్రీనివాసా సాయిలకు ఉన్న పవర్స్ విషయంలో కూడా దానికి వాళ్లు అర్హులేనా అనేది తేల్చారు నాగార్జున. మొత్తంగా ఈ శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుందని లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోని బట్టి అర్థమవుతుంది.