Balayya-Venky-Nag: ఒకే సినిమాలో బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌.. యంగ్‌ డైరెక్టర్‌ అదిరిపోయే ప్లాన్‌

Published : Mar 01, 2026, 06:32 PM IST

టాలీవుడ్‌ టాప్‌ హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే, వెంకటేష్‌, నాగార్జున, బాలయ్య కలిసి ఒకే సినిమాలో మెరిస్తే చూడ్డానికి కనువిందుగా ఉంటుంది. రెండు కళ్లు చాలవు. అదే జరగబోతుందట. 

PREV
14
`త్రిమూర్తులు` చిత్రంలో కలిసి కనిపించిన వెంకీ, బాలయ్య, నాగ్‌

టాలీవుడ్‌లో సీనియర్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున కలిసి గతంలో ఓ మూవీలో నటించారు. ఓ పాటలో కాసేపు అలా మెరిశారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. కానీ ఈ నలుగురు హీరోలు కలిసి నటిస్తే చూడాలని ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటుంది. అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ అరుదైన సందర్భం చోటు చేసుకోబోతుందనే టాక్‌ వినిపిస్తుంది.

24
చిరు, వెంకీ కలసి నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు`

ఇటీవల సంక్రాంతికి వచ్చిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీలో చిరంజీవి, వెంకటేష్‌ కలిసి నటించారు. కానీ ఇప్పుడు వెంకటేష్‌, బాలయ్య, నాగార్జున కలిసి కనిపించబోతున్నారట. ఓ చిన్న సినిమా కోసం ఈ ముగ్గురు కలిసి నటించేందుకు ప్లాన్‌ జరుగుతుందట. ఓ దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో గెస్ట్ లుగా కొంత మంది హీరోలు కనిపిస్తారని, అందులో వెంకీ, బాలయ్య, నాగ్‌ కూడా ఉంటారని సమాచారం.

34
ఈ నగరానికి ఏమైంది 2 ప్లాన్‌ చేస్తోన్న తరుణ్‌ భాస్కర్‌

యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో `ఈ నగరానికి ఏమైందీ 2` అనే మూవీ రూపొందుతుంది. గతంలో వచ్చిన `ఈ నగరానికి ఏమైంది` మూవీకిది సీక్వెల్‌. ఇటీవలే దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. అయితే ఇందులో స్టార్స్ గెస్ట్ లుగా మెరుస్తారట. సందర్భానుసారంగా హీరోలు కనిపించే సీన్‌ ఉందని, అందులో ఈ సీనియర్లని దించుతున్నట్టు సమాచారం. దాదాపు పది మందికిపైగా సెలబ్రిటీలు ఇందులో కనిపిస్తారని సమాచారం.

44
వెంకటేష్‌, బాలయ్య, నాగార్జున కనిపించే ఛాన్స్

అందులో బాలయ్య, వెంకటేష్‌, నాగార్జునతోపాటు దర్శకుడు సుజీత్‌, దర్శకుడు మెహర్‌ రమేష్.. ఇలా పది మంది స్టార్స్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అందరిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ముగ్గురి హీరోలను మాత్రం బాగా అలరిస్తోంది. వినడానికి కూడా క్రేజీగా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories