Virat Kohli , Ram Charan Viral Selfie: హీరోలలో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయితే.. క్రికెట్ లో స్టార్ విరాట్ కోహ్లీ. ఈ ఇద్దరి స్టార్ డమ్ లో ఎవరిని తక్కువ చేయలేము. స్టార్ క్రికెటర్స్ కు అభిమాన హీరోలు ఉన్నట్టే.. స్టార్ హీరోలకు కూడా అభిమాన క్రికెటర్స్ కూడా ఉంటారు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో రామ్ చరణ్ కూడా ఒకరు. ఎన్నో సార్లు క్రికెటర్లను కలిశారు చరణ్. రామ్ చరణ్ కు ఇండియన్ క్రికెట్స్ తో మంచి అనుబంధం ఉంది.
Also Read: 8000 కోట్లకు అధిపతి, 300 కోట్ల ఇంటిని రోజుకు 2 లక్షలకు అద్దెకిస్తున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
చాలామందితో ఫ్రెడ్షిప్ కూడా ఉంది. గతంలో క్రికెటర్స్ తో కలిసి చరణ్ పనిచేశారు కూడా. మాజీ కెప్టెన్ థోనీతో కలిసి కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా చేశారు చరణ్. అంతే కాదు థోనీని తన ఇంటికి కూడా ఇన్ వైట్ చేశారు. ఓ సందర్భంలో హైదరాబాద్ లో మ్యాచ్ జరిగినప్పుడు క్రికెటర్స్ చాలామంది మెగాస్టార్ ఇంటికి వింధుకు కూడా వెళ్ళారు. ఇక రామ్ చరణ్ తో థోనీ దిగిన ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.
Also Read: శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.
ఇక ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ తో విరాట్ కోహ్లీ సెల్ఫీ దిగిన ఫోటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇద్దరు కలిసి ఫోటో దిగారు సరే.. ఎప్పుడు ఎక్కడ దిగారు అనేది ఎవరికి అంతుపట్టడంలేదు. ఈ ఫోటోను చూసి కోహ్లీని ఇష్టపడే రామ్ చరణ్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు.
ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఒక కమర్షియల్ యాడ్ చేయాలనీ కోరుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటో చూసి తెగ ఆనందపడుతున్నారు ఫ్యాన్స్. కాని అందరిది ఒకటే ప్రశ్న వీరు ఎప్పుడు కలిశారు. ఎక్కడ కలిశారు అనేది ఎవరికి అర్ధం కావడంలేదు.
Also Read: ప్రభాస్ ను క్లైమాక్స్ లో చంపబోతున్న డైరెక్టర్, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇంతకీ ఆ సినిమా ఏంటి?
Ram Charan Peddi Movie
కొంత మంది మాత్రం ఇది AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసారని అంటున్నారు. ఇచ్చింది. ప్రస్తుతం IPL సీజన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీళ్లిద్దరు కలిశారన్న టాక్ వినిపిస్తుంది. అలా కలిస్తే అఫీషియల్ గా తెలిసేది కదా అని మరోవాదన.
మొత్తానికి విరాట్ కోహ్లీ, రామ్ చరణ్ సెల్ఫీ మాత్రం మరింత వైరల్ అయ్యింది. అయితే ఇది నిజమైన ఫోటో కాదని, రామ్ చరణ్, విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కలవలేదని అంటున్నారు. అయితే ఇది మాత్రం ఒరిజినల్ ఫోటోలాగే ఉండటంతో నిజం ఏంటో తెలియక చరణ ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు.
అయితే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు., అంతే కాదు ఈసినిమా క్రికెట్ నేపధ్యంలో రూపొందుతోంది. పెద్ది ఫస్ట్ గ్లింప్ లో కూడా చరణ్ క్రికెట్ ఆడుతూ కనిపించారు.
Also Read: రామ్ చరణ్ నా ఫస్ట్ క్రష్ అంటున్న రవితేజ హీరోయిన్ ఎవరో తెలుసా?