Gunnagunnavoye Sinnadi Folk Song : ప్రస్తుతం ఏ సోషల్ మీడియా మాధ్యమంలో చూసినా ఓ తెలంగాణ జానపద పాటపై రీల్స్, వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ పాటపై మీరు రీల్స్ చేసినా లక్షల వ్యూస్ ఖాయం.
Folk Song : ప్రస్తుతం ఎక్కడచూసినా జానపద పాటలే వినిపిస్తున్నాయి. కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమా పాటలను మించిపోతున్నాయి. కొన్ని ఫోక్స్ యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుంటే మరికొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇలా గతంలో ''రాను బొంబైకి రాను'', ''ఓ పిలగ యెంకటేశు..'' వంటి పాటలు ఓ ఊపు ఊపాయి. ఇప్పుడు ఇదే బాటలో ''గురియన్నే సీరెగట్టి.. గుద్దినట్టు గోసివెట్టి.. గున్నగున్నవోయే గునుకపూల సిన్నది'' అంటూ సాగే తెలంగాణ ఫోక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటపై చాలామంది రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.
24
గున్నగున్నవోయె సిన్నది ఫోక్ సాంగ్ లిరిక్స్...
పల్లవి
కట్ల కట్ల మిరపకాయ
కాళ్ళ గుత్తులు మెరియనాయ
బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది
చల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది
చల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది
ఆ బంతి సేబంతి
సెలియ నీకు ఇత్తగాని
కొండమీని కోతినైన
సిటికెలోన దెత్తగాని
సెన్నగోడ మీనికెళ్లి
సేతులియ్యవే
చల్ సెన్నగోడ మీనికెళ్లి
సేతులియ్యవే
చరణం 1
గురియవన్నె సీరెగట్టి
గుద్దినట్టు గోసివెట్టి
గున్న గున్నవోయే
గునుకపూల సిన్నది
చల్ గున్న గున్నవోయే
గనుకపూల సిన్నది
చల్ గున్న గున్నవోయే
గనుకపూల సిన్నది
ఆ బంతి సేబంతి
సెలియ నీకు ఇత్తగాని
మా ఇంటికి మీ ఇంటికి
నడుమ నిచ్చనేత్త గాని
కట్టెల దడి మీనికెళ్లి
కన్ను గిలుపవే
గా కట్టెల దడి మీనికెళ్లి
కన్ను గిలుపవే
చరణం 2
అల్లిపూల సీరె గట్టి
అద్దాల రైక దొడిగి
ఆగమాగమచ్చె
అందమోళ్ల సిన్నది
చల్ ఆగమాగమచ్చె
అందమోళ్ల సిన్నది
చల్ ఆగమాగమచ్చే
అందమోళ్ళ సిన్నది
అరే ఆబంతి సేబంతి
సెలియ నీకు ఇత్తగాని
బతుకంత కాళ్ళకాడ
నేను వడీ సత్తగాని
అరుగుబండ మీనికెళ్లి
అలికిరియ్యవే
గా అరుగుబండ మీనికెళ్లి
అలికిరియ్యవే
చరణం 3
ఎర్రజీర గట్టుకోని
ఎండి గొలుసులు వెట్టుకోని
ఎన్నెలోలే ఎల్లే
ఎచ్చిరికాల సిన్నది
చల్ ఎన్నెలోలే ఎల్లే
ఎచ్చిరికాల సిన్నది
చల్ ఎన్నెలోలే ఎల్లే
ఎచ్చిరికాల సిన్నది
ఆ బంతి సేబంతి
సెలియ నీకు ఇత్తగాని
నీ అడుగుల నడిసచ్చి
ఏడడుగూలేత్తగాని
పందిరి గుంజ సాటుకెళ్లి
పలుకరియ్యవే
చల్ పందిరి గుంజ సాటకెళ్లి
పలుకరియ్యవే
చరణం 4
మామిడంచు సీరెగట్టి
మల్లెపూలు శికల వెట్టి
మౌనంగ వోయే
మట్టి కాళ్ళ సిన్నది
చల్ మౌనంగ వోయే
మట్టి కాళ్ళ సిన్నది
చల్ మౌనంగ వోయే
మట్టి కాళ్ళ సిన్నది
ఆ బంతి సేబంతి
సెలియ నీకు దెత్తగాని
నువ్వు గోరుకుంటే
నా పాణమైన ఇత్తగాని
గడిగొయ్యల మీనికెళ్లి
సైగ జేయ్యవే
గా గడిగొయ్యల మీనికెళ్లి
సైగ జేయ్యవే
34
పల్లెటూరి ప్రేమకు చాటేలా సాంగ్..
పల్లెటూరి ప్రేమను అంటే కాస్త మొరటుగా సాగే ప్రేయసి ప్రియుడి సరసాలను ఈ పాటలో చక్కని పదాలతో వివరించారు. అమ్మాయి వివిధ రంగుల చీరలు కట్టి అందంగా ముస్తాబై వెళుతుంటే ఆమెను ప్రియుడు పిలుస్తున్నట్లుగా సాగుతుంది. అయితే ''గురియవన్నె సీరెగట్టి..గుద్దినట్టు గోసివెట్టి'' అంటూ మొదటి చరణంపై సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. కేవలం లిరిక్స్ మాత్రమే కాదు మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది... అందుకే ఈ ఫోక్ జనాల్లోకి బలంగా వెళ్లింది. యూట్యూబ్ లో కోటి వ్యూస్ కి చేరువచ్చింది ఈ సాంగ్.
అచ్చ తెలంగాణ యాసలో సాగే ఈ గున్నగున్నవోయె సిన్నది సాంగ్ ను ఎంవి మ్యూజిక్ ఆండ్ మూవీస్ యూట్యూబ్ లో ఛానెల్ రూపొందించింది. ఈ పాటకు లిరిక్స్, మ్యూజిక్ తో పాటు డైరెక్షన్ చేసింది ఎస్వి మల్లిక్ తేజ... ప్రొడ్యూసర్ ఒర్సు (RK). అందమైన పదాలతో కూడిన ఈ పాట సరికొత్త గొంతులో మోగింది... అందుకే ఇంత అద్భుతంగా వచ్చింది. లచ్చుమక్క బొడుగు ఈ పాట ద్వారా సింగర్ గా పరిచయం అయ్యారు. గున్నగున్నవోయె సాంగ్ ను వైష్ణవి సోని, ఈశ్వర్ సాయి డ్యాన్స్ మరో స్థాయికి తీసుకెళ్లాయి. మై విలేజ్ షో గంగవ్వ, సింగర్ లచ్చుమక్క బొడుగు కూడా మధ్యలో కనిపిస్తూ మరింత పల్లెటూరు టచ్ ఇచ్చారు.