Keerthy Suresh: నటి కీర్తి సురేష్ మొదట్లో బరువు ఎక్కువగా ఉండేది. కానీ తరువాత మాత్రం చాలా స్లిమ్ గా తయారైంది. ఆ సమయంలో ఆమెను బరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకుందని కామెంట్లు వచ్చాయి. దానికి ధీటైన సంబంధం ఇచ్చింది కీర్తి సురేష్.
కీర్తి సురేష్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కాస్త బొద్దుగా ఉండేది. కొన్ని సినిమాలు చేశాక ఆమె స్లిమ్ గా మారింది. ఆమె సన్నగా మారడానికి సర్జరీనే కారణమని, ఆమె బరువు తగ్గించే సర్జరీ చేయించుకుందని కామెంట్లు వచ్చాయి. దీనికి ఇన్నాళ్ల తరువాత ధీటైన జవాబు ఇచ్చింది కీర్తి సురేష్. అది కూడా ఒక వీడియో షేర్ చేసి మరీ. కీర్తి సురేష్ మాట్లాడుతూ “ నేను సర్జరీ చేయించుకోలేదు. 9 నెలలు కష్టపడి 10 కిలోల బరువు తగ్గాను. కానీ అది చూసి నేను సర్జరీతో సన్నబడ్డానని ప్రచారం చేశారు. అది నన్ను చాలా బాధపెట్టింది” అని చెప్పుకొచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా వచ్చిన 'గీతాంజలి' సినిమాతో కీర్తి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.
24
సన్నగా ఉంటే లావుగా మారమంటున్నారు
“నన్ను నేను చూసుకుంటున్న తీరు ఇప్పుడు నాకు నచ్చింది. నన్ను చూసి నేను గర్వకారణంగా భావిస్తున్నాను. అయినా జనాలు నా గురించి మాట్లాడటం మాత్రం ఆపరు. లావుగా ఉంటే సన్నబడమంటారు, సన్నగా ఉంటే లావవ్వమంటారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది” అంటూ కీర్తి సురేష్ తన కోపాన్ని వ్యక్తపరుస్తుంది.
34
యోగా వల్ల లాభాలు
తాను బరువు తగ్గే ప్రక్రియలో రోజూ యోగా కూడా చేసేదాన్నని చెప్పింది కీర్తి సురేష్. యోగా చేయడం వల్ల తనకు మంచి మానసిక స్థితి, ఆత్మవిశ్వాసం వచ్చాయని తెలిపింది. తన శరీరాన్ని మరింతగా ప్రేమించడం యోగా నేర్పిందని చెప్పింది. మొదట్లో జిమ్ చేయడం కష్టంగా ఉండేదని.. కానీ ఇప్పుడు దాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో అర్థం చేసుకున్నానని చెప్పారు.
కీర్తి తన వర్కవుట్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఆ పోస్ట్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ ఏడాది మలయాళం, తమిళం, తెలుగులో ఆమె నటించిన పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.